అందెశ్రీ
అందె శ్రీ | |
---|---|
జననం | |
వృత్తి | కవి, సినీగేయరచయిత |
అందెశ్రీ (జననం జూలై 18, 1961) తెలంగాణ రచయిత. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతం రచించారు[1] [2]
తొలినాళ్ళు
[మార్చు]ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డా. అందెశ్రీ వరంగల్ జిల్లా, జనగాం వద్ద గల రేబర్తి (మద్దూర్ మండలం) అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైన చదువు చదవలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.
గీత రచన
[మార్చు]ఈయన గొడ్ల కాపరిగా పనిచేసారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామీ శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఇతడిని చేరదీసాడు. రాష్ట్రవ్యాప్తంగా ఈయన పాటలు ప్రసిద్ధం. నారాయణ మూర్తి ద్వారా వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలున్నాయి. తెలంగాణ, ప్రకృతి లాంటి అంశాలపై ఈయన గేయరచన చేసారు. ఈయన అశువు కవిత్వం చెప్పటంలో దిట్ట. 2006లో గంగ సినిమాకు గానూ నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తెలంగాణ మాతృగీతం రచించారు.[3]
సినీ సంభాషణలు
[మార్చు]బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు కూడా రాసారు.
సినీ పాటల జాబితా
[మార్చు]- జయజయహే తెలంగాణ జననీ జయకేతనం (తెలంగాణ మాతృగీతం)[4]
- పల్లెనీకు వందనములమ్మో
- మాయమై పోతున్నడమ్మో మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు
- గలగల గజ్జెలబండి
- కొమ్మ చెక్కితే బొమ్మరా...
- జన జాతరలో మన గీతం
- యెల్లిపోతున్నావా తల్లి
- చూడ చక్కని
- ఆవారాగాడు (సినిమా)
పురస్కారాలు, గుర్తింపులు
[మార్చు]- 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈయనను భారత అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అందుకొనుటకు ప్రతిపాదించింది[5]
- ఎర్ర సముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతుండమ్మా మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం రెండో సంవత్సరం సిలబస్ లో చేర్చారు.
- కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది.
- అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్ టన్ డి.సి వారి గౌరవ డాక్టరేట్ తోపాటు లోకకవి అన్న బిరుదునిచ్చి 2014 ఫిబ్రవరి 1లో సన్మానించారు.
- వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం (2015 ఆగస్టు 14)
- డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం (2015 జూలై 5)[6]
- నంది పురస్కారం కూడా అందుకున్నారు.
- మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రను నిర్వర్తించాడు. అంతేకాకుండా తెలంగాణ ధూంధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించాడు.
- అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకలతో... ఇప్పటికి విద్యాసంస్థలలో, ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ జాతి గీతంగా, ప్రార్థనాగీతంగా పాడుకోవడం విశేషం.
- సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం , సుందరయ్య విజ్ఞాన కేంద్రం, 2022 అక్టోబరు 15)[7]
- దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం-2024[8][9]
మూలాలు
[మార్చు]- ↑ http://www.hindu.com/2007/03/24/stories/2007032421180400.htm
- ↑ "ఇందూరు గడ్డ పెట్టిన భిక్ష". EENADU. Retrieved 2024-06-02.
- ↑ telugu, NT News (2024-06-02). "సిద్ధప్ప వరకవి స్ఫూర్తితోనే అందెశ్రీ రచనలు". www.ntnews.com. Retrieved 2024-06-02.
- ↑ "Jaya Jaya He Telangana: 'జయ జయహే తెలంగాణ' స్వరాలకు తుది మెరుగులు". EENADU. Retrieved 2024-06-02.
- ↑ "అరుదైన గౌరవం". Sakshi. 2014-09-17. Archived from the original on 2016-03-06. Retrieved 2024-02-05.
- ↑ http://namasthetelangaana.com/News/award-awarded-to-andesri-1-1-442922.aspx Archived 2016-03-05 at the Wayback Machine అందెశ్రీకి రావూరి పురస్కారం ప్రదానం
- ↑ telugu, NT News (2022-10-16). "అందెశ్రీకి సుద్దాల హనుమంతు పురస్కారం ప్రదానం". Namasthe Telangana. Archived from the original on 2022-10-16. Retrieved 2022-10-16.
- ↑ "Andeshree: అందెశ్రీకి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం". EENADU. Retrieved 2024-07-22.
- ↑ telugu, NT News (2024-07-19). "Ande Sri | 'దాశరథి' పురస్కారానికి అందెశ్రీ ఎంపిక". www.ntnews.com. Retrieved 2024-07-31.