అదిరింది గురూ
అదిరింది గురూ (1996 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సాగర్ |
---|---|
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
భాష | తెలుగు |
అదిరింది గురూ 1996 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సాయి పవన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.మధు నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కృష్ణ, ప్రేమ, రంజిత, సంగీత, సనా, మల్లికార్జున రావు, ఎమ్ ఎస్ నారాయణ, నర్సింగ్ యాదవ్, దువ్వసి మోహన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు.
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- ప్రేమ
- రంజిత
- సంగీత
- సనా
- బేబీ శ్రేష్ట
- కస్ట్యూం కృష్ణ
- బేతా సుధాకర్
- మల్లిఖార్జునరావు
- వల్లభనేని జనార్థన్
- శ్రీనాథ్
- ఎం.ఎస్.నారాయణ
- రామరాజు
- కళ్ళు చిదంబరం
- ప్రకాష్
- నర్సింగ్ యాదవ్
- దువ్వాసి మోహన్
- సత్తిబాబు
సాంకేతికవర్గం
[మార్చు]- బ్యానర్: శ్రీ సాయి పవన్ ప్రొడక్షన్స్
- కథ: ఎం.ఎస్.నారాయణ
- చిత్రానువాదం: వల్లభనేని జనార్థన్
- మాటలు: ఎల్.బి.శ్రీరాం
- పాటలు: భువనచంద్ర
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర,, సుజాత, స్వర్ణలత
- స్టిల్స్: శ్యామలరావు
- పోరాటాలు: రాజు
- నృత్యం: డి.కె.ఎస్.బాబు
- కళ: రమణబాబు
- కూర్పు: గౌతం రాజు
- ఛాయాగ్రహణం: వి.శ్రీనివాసరావు
- సంగీతం: కోటి
- నిర్మాత: ఎం.మధు
- దర్శకత్వం: సాగర్
పాటల జాబితా
[మార్చు]1.అమ్మో కిలాడిగాడే అబ్బో గిల్లేసినాడే, రచన: భువన చంద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత
2 . గిల్లి గిల్లి గిల్లి గిచ్చుతాడే పిల్లగాడు ముద్దబంతి పువ్వులాగా, రచన: భువన చంద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
3.చుమ్మా చుమ్మా చుమ్మ చుట్టుకుంది గుమ్మా, రచన: భువన చంద్ర, గానం.భారతి, నాగూర్ బాబు బృందం
4.తుమ్మెద వాలిందిలే అందాల కన్నె పూదోటలో, రచన: భువన చంద్ర, గానం.సుజాత, నాగూర్ బాబు, కోరస్
5.మండపేట మరదలా గుంజుకోకే , రచన: భువన చంద్ర, గానం నాగూర్ బాబు, కె ఎస్ చిత్ర బృందం .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
[మార్చు]- "ADIRINDI GURU | TELUGU FULL MOVIE | KRISHNA | PREMA | RANJITHA | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.