ప్రేమ (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ
Prema Actress.JPG
జననంనెరవండ చెంగప్ప ప్రేమ
(1977-01-06) 1977 జనవరి 6 (వయస్సు: 43  సంవత్సరాలు)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1994–2009
2016
జీవిత భాగస్వామిజీవన్ అప్పచు (2006–2016)

ప్రేమ (జననం. జనవరి 6, 1977), సుప్రసిద్ధ సినీనటి. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. ప్రేమ నటించిన ఓం, యజమన సినిమాలు కన్నడ సినిరంగంలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలుగా నిలిచాయి. తన రెండు దశాబ్దాల సినీ జీవితంలో అనేకమంది నటుల సరసన నటించింది. ఆమె విష్ణువర్ధన్, మోహన్ లాల్, దగ్గుబాటి వెంకటేష్, జగపతిబాబు, మోహన్ బాబు, కృష్ణ, శివరాజ్ కుమార్, వి రవిచంద్రన్, ఉపేంద్ర, సాయికుమార్, రమేష్ అరవింద్ వంటి నటులతో నటించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ప్రేమ 1977, జనవరి 6న బెంగుళూర్ లోని కావేరి కొడవ సంఘానికి చెందిన నెరవండ కుటుంబములో జన్మించింది. మహిళా సేవా సమాజ హైస్కూల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి, బెంగుళూర్ లో ఎస్.ఎస్.ఎమ్.ఆర్.వి. కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. విద్యార్థినిగా ఉన్న దశలో పాఠశాల మరియు కళాశాల తరపున జాతీయ స్థాయి హై జంప్, వాలీబాల్ పోటీలలో పాల్గొన్నది. ప్రేమ తమ్ముడు నెరవండ అయ్యప్ప క్రికెట్ ఆటగాడు, కర్ణాటక రంజీ ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించాడు. ప్రేమ 2006 లో జీవన్ అప్పచు అనే వ్యాపారవేత్త పెళ్ళి చేసుకుంది. కుటుంబ కలహాల కారణండా 2016 మార్చిలో విడాకులకోసం బెంగుళూర్ లోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ ను దాఖలు చేసింది.[1]

పురస్కారాలు[మార్చు]

  1. ఓంకారం - ఉత్తమ నటి, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్, 1996
  2. ఓంకారం - ఉత్తమ నటి, ఫిలింఫేర్ అవార్డ్, 1996
  3. దేవి - ఉత్తమ నటి, నంది అవార్డు, 1997
  4. తూర్పింటి - ఉత్తమ నటి, ఫిలింఫేర్ అవార్డ్, 2001
  5. ఉత్తమ నటి, ఉదయ అవార్డు
  6. ఉత్తమ నటి, వీడియోకాన్ అవార్డు
  7. ఉత్తమ నటి, సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు
  8. చిత్రప్రేమిగల సంఘ అవార్డు
  9. దేవికారాణి మెమోరియల్ అవార్డు

చిత్రసమాహారం[మార్చు]

సంవత్సరం చలన చిత్రం పేరు పాత్ర పేరు భాష ఇతరములు
1995 సవ్యసాచి కన్నడ
ఓంకారం మాధురి కన్నడ ఉత్తమ నటి, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డ్
ఆత హుదుగాట కన్నడ
పోలీస్ పవర్ కన్నడ
1996 నమూర మందర హువే సుమ కన్నడ ఉత్తమ నటి, ఉదయ ఫిల్మ్ అవార్డు
గాజీన మనే కన్నడ ఉదయ ఫిల్మ్ అవార్డు
ప్రిన్స్ స్వర్ణ మలయాళం ఉదయ ఫిల్మ్ అవార్డు
ధర్మ చక్రం తెలుగు
జగదేకవీరుడ తెలుగు
అదిరింది గురూ తెలుగు
1997 అత్తా నీకొడుకు జాగ్రత్త తెలుగు
కోరుకున్న ప్రియుడు తెలుగు
చెలికాడు తెలుగు
ఓంకారం తెలుగు
ఎల్లరంతల్ల నన్నా గాండా కన్నడ
1998 తుట్టా ముఠా పూజా కన్నడ
కౌరవులు కన్నడ
శాంతి శాంతి సుజి కన్నడ
మా ఆవిడ కలెక్టర్ తెలుగు
దీర్ఘ సుమంగళీ భవ తెలుగు
1999 చంద్రముఖి ప్రాణసఖి సహన కన్నడ ఉత్తమ నటి, సినిమా ఎక్స్ప్రెస్ అవార్డు
చంద్రోదయ దివ్య కన్నడ
నాను నన్న హెన్ ద్తిరు మనీషా కన్నడ
ఉపేంద్ర కన్నడ
జెడ్ ప్రేమ కన్నడ
దేవి దేవి తెలుగు ఉత్తమ నటి, జెమిని ఫిలిం అవార్డు
రాఘవయ్య గారి అబ్బాయి తెలుగు
ఈతరం నెహ్రూ తెలుగు
2000 నాగదేవత కన్నడ
మాయబజార్ కన్నడ
నువ్వేకావాలి అతిథి పాత్ర తెలుగు
అమ్మో ఒకటోతారీఖు తెలుగు
రాయలసీమ రామన్న చౌదరి నాగరంజని తెలుగు
నాన్నవల్లు నాన్నవల్లు కన్నడ ఉత్తమ నటి, కావేరీ ఆసియానెట్ ఫిల్మ్ అవార్డ్
చిరునవ్వుతో తెలుగు
ఉత్తర ధ్రువడిం దక్షిణ ధ్రువకు నందిని కన్నడ
యజమాన కన్నడ ఉత్తమ నటి, ఈ టి.వి ఫిలిం అవార్డు
దైవతింటే మకన్ అంజలి మలయాళ ఉత్తమ నటి, ఈ టి.వి ఫిలిం అవార్డు
2001 అంజలి గీతాంజలి అంజలి కన్నడ
కనసుగర కన్నడ ఉత్తమ నటి, కన్నడ ఫిలింఫేర్ అవార్డ్
ప్రేమి నెం.1 కన్నడ
కోతిగళ్ సార్ కోతిగళ్ కన్నడ
గ్రామ దేవత కావేరి కన్నడ
నీలాంబరి కన్నడ
ప్రేమతో రా సంధ్య తెలుగు
దేవీ పుత్రుడు దేవత తెలుగు
2002 బలరాముడు కన్నడ
చెల్వి చెల్వి కన్నడ
టపోరి కన్నడ
జమిందారు కన్నడ
మర్మ సుధా కన్నడ
పర్వం సుమ కన్నడ
కంబాలహల్లి కన్నడ
ముత్తు కన్నడ
ప్రేమ ప్రేమ కన్నడ
సింగారవ్వ సింగారవ్వ కన్నడ
2003 మూరు మనసు నూరు కనసు కన్నడ
హాయి నాన్ భీష్మ కానో కన్నడ
శ్రీ రేణుకా దేవి కన్నడ
ఆనంద నిలయ కన్నడ
విజయదశమి కన్నడ
తాయ్ భువనేశ్వరి తమిళ
లవ్వే పసగలి కన్నడ
జానకి వెడ్స్ శ్రీరామ్ తెలుగు
2004 అప్తమిత్ర సౌమ్య కన్నడ
అజగేసన్ నందిని తమిళ
2005 ఇన్స్పెక్టర్ ఝాన్సీ ఝాన్సీ కన్నడ
రణచంఢి కన్నడ
పాండు రంగవిఠల కన్నడ
దేవి అభయం తెలుగు
అయోధ్య తెలుగు
2006 అ ఆ ఇ ఈ కన్నడ
2007 ఏకదంత భక్తి కన్నడ
క్షణ క్షణ పాల్గుణి కన్నడ
ఢీ తెలుగు
2008 సుందరకాండ సీతా తెలుగు
కృష్ణార్జున తెలుగు
2009 అంజనీ పుత్రుడు తెలుగు
శిశిర తెలుగు

మూలాలు[మార్చు]

  1. సాక్షి, సినిమా (March 03, 2016). "విడాకులివ్వండి: నటి ప్రేమ". Retrieved 11 September 2016. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)