Jump to content

అన్నపర్రు

అక్షాంశ రేఖాంశాలు: 16°5′38.184″N 80°18′23.796″E / 16.09394000°N 80.30661000°E / 16.09394000; 80.30661000
వికీపీడియా నుండి
అన్నపర్రు
కొల్లా సుబ్బయ్య రాఘవమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అన్నపర్రు
కొల్లా సుబ్బయ్య రాఘవమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అన్నపర్రు
పటం
అన్నపర్రు is located in ఆంధ్రప్రదేశ్
అన్నపర్రు
అన్నపర్రు
అక్షాంశ రేఖాంశాలు: 16°5′38.184″N 80°18′23.796″E / 16.09394000°N 80.30661000°E / 16.09394000; 80.30661000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంపెదనందిపాడు
విస్తీర్ణం
27.98 కి.మీ2 (10.80 చ. మై)
జనాభా
 (2011)
2,538
 • జనసాంద్రత91/కి.మీ2 (230/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,292
 • స్త్రీలు1,246
 • లింగ నిష్పత్తి964
 • నివాసాలు724
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522235
2011 జనగణన కోడ్590334


కీ.శే కొలసాని చిన వెంకయ్య చౌదరి

అన్నపర్రు, గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన పెదనందిపాడు నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 724 ఇళ్లతో, 2538 జనాభాతో 2798 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1292, ఆడవారి సంఖ్య 1246. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 860 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 16. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590334[1].ఈ గ్రామం పెదనందిపాడు నుండి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో వరగాణి నుండి పడమరగా, నక్కవాగు ఒడ్డున ఉంది.

గ్రామ చరిత్ర

[మార్చు]

పూర్వం ఈ గ్రామం నిర్మితమైన ప్రదేశంలో దిబ్బ అనబడే మెరక ప్రదేశంపై జైనులు నివసించే పురం ఒకటి ఉండేది.జైనులు నివసించిన ఆ కాలంలో ఈ గ్రామానికి మొదటగా "రాజవోలు" అనే పేరు ఉండేది.కొంతకాలం ఇక్కడ జైనులు నివాసం చేసి అంతరించిన తరువాత ఆదిబ్బ ప్రదేశం కొంతకాలం పాడుబడిన సమయంలో దక్షిణ దేశం నుండి దనవంతులైన రాజులు అన్నంరాజు, కోనంరాజు, జిగిలిరాజు అనువారు వార్కి కలిగిన ఉపద్రవం వలన ఈ దిబ్బ కలిగిన ప్రదేశంనకు వచ్చి అన్నంరాజు పేరిట “అంన్నపర్తి” అనే పేరుతో గ్రామాన్ని కట్టించారు. కాలాంతరంలో అది [2]“అన్నపర్రు”గా పేరు వాడుకలోకి వచ్చినట్లుగా తెలుస్తుంది.

సమీప గ్రామాలు

[మార్చు]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి పెదనందిపాడులో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పెదనందిపాడులోను, ఇంజనీరింగ్ కళాశాల గుంటూరులోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల పెదనందిపాడులోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

కె.ఎస్.ఆర్.జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]
  1. 1959లో ప్రారంభించిన ఉన్నత పాఠశాల చాలా సంవత్సరాలుగా చుట్టుపక్కల గ్రామాల పిల్లలు ఎక్కువ దూరం పోకుండా చదువుకోటానికి తోడ్పడింది. కొల్లా సుబ్బయ్య రాఘవమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, కొలసాని చినవెంకయ్య చౌదరి స్థాపించాడు. తన ఇంటిలోనే పేదపిల్లల వసతి గృహాన్ని నడిపి, చాలా మంది పిల్లలు ఉచితంగా చదువుకొనే ఏర్పాటు చేశాడు. తరువాతి కాలంలో ప్రభుత్వానికి ఈ వసతి గృహాన్ని అందజేశాడు. ఈ పాఠశాలకి ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన వారిలో ముఖ్యంగా కొడాలి రాజా రామమోహన రావు తన వినూత్న పద్ధతులతో విద్యాప్రమాణాల్ని గణనీయంగా పెంచడానికి కృషి చేశాడు. 27, 28, ఫిబ్రవరి 2010 న ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవాలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ పాఠశాల విద్యార్థులు, 3 సంవత్సరాల నుండి 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించి, గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చారు.

ఆర్.ఆర్.ప్రాథమిక పాఠశాల(ప్రభుత్వ పాఠశాల)

[మార్చు]
  1. ఈ పాఠశాల, 1939లో 30 మంది విద్యార్థులతో ప్రారంభమైనది. ప్రస్తుతం 105 మంది పేద విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసించుచున్నారు. ఉపాధ్యాయుల పనితీరుకు, గ్రామస్తుల సహకారం తోడవటంతో, పాఠశాల ముందడుగు వేయుచున్నది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు 2500 మందిదాకా, దేశ, విదేశాలలో స్థిరపడినారు. ఈ పాఠశాల ఏర్పాటుకు దాత శ్రీమతి కోడపాటి సుబ్బాయమ్మ 20 సెంట్ల స్థలాన్ని విరాళంగా అందజేఇ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శ్రీ పాలపర్తి పూర్ణచంద్రరావు, ఈ పాఠశాలకు తొలి ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, పాఠశాల అభివృద్ధికి బహుధా కృషిచేసారు. దాతలు పలు సౌకర్యాలు కలుగజేశారు. 2014-15 సంవత్సరం నుండి, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాతలు విద్యా వలంటీర్ల సహకారంతో, ప్రత్యేక తరగతులు నిర్వహించుచున్నారు. ఈ పాఠశాలలో, 2013 నవంబరు 13 బుధవారం నాడు, సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ పాఠశాల 13-2014 ఏప్రిల్ నాడు, ప్లాటినం జూబిలీ ఉత్సవాలు, ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగినవి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రేక్షకులనలరించినవి. విద్యార్థుల తల్లిదండ్రులు. గ్రామస్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులను, దాతలను, ఘనంగా సత్కరించారు.[3][4]
  2. ఈ పాఠశాలలో 5వ తరగతి చదివిన అన్నవరపు సంధ్య అను విద్యార్థిని, జవహర్ నవోదయ పాఠశాలలో ఆరవ తరగతి చదవడానికి అర్హత పరీక్షలో ఉత్తీర్ణురాలయినది. ఈమె ఇంటరు వరకు ఉచితంగా విద్యనభ్యసించే అవకాశం దక్కించుకున్నది.

బి.సి.బాలుర వసతి గృహం

[మార్చు]

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

అన్నపర్రులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 21 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

అన్నపర్రులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 2 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 1 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 76 హెక్టార్లు
  • బంజరు భూమి: 260 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 2456 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 2173 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 543 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

అన్నపర్రులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 543 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

అన్నపర్రులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

ప్రత్తి, మిరప

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]
  1. నాగార్జునసాగర్ నీటి వసతి ఉంది.
  2. ఈ గ్రామంలోని త్రాగునీటి చెరువులో చాలా సంవత్సరాల తరువాత, ఎన్నో ఏళ్ళ నుండి పేరుకుపోయిన పూడిక తీశారు. చెరువులోని పిచ్చి చెట్లు, నాచు, జమ్ము, తామర వగైరాలు తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు విరాళాలు సమకూర్చారు.[5]

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలొ జరిగిన పంచాయతీ ఎన్నికలలో, సర్పంచిగా కొల్లా ఉమామహేశ్వరి ఎన్నికైంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

[మార్చు]

శ్రీ గంగా కాశీఅన్నపూర్ణా సమేత శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

2014, మే-26 సోమవారం నాడు, ఈ ఆలయ నవమ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిమందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో పరిసరప్రాంతాల భక్తులు గూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గ్రామస్థులు, యువత తమవంతు సేవలందించారు.

శ్రీ రణ ఆంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం

[మార్చు]

బొడ్డురాయి

[మార్చు]

గణాంకాలు

[మార్చు]
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం*[6] జనాభా 2595, పురుషుల సంఖ్య 1307, మహిళలు 1288, నివాసగృహాలు 670, విస్తీర్ణం 2798 హెక్టారులు

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. గుంటూరు జిల్లా గ్రామ కైపియ్యత్తులు రెండవ భాగం పేజి నెం.1-5
  3. ఈనాడు గుంటూరు సిటీ, 14 నవంబరు, 2013. 1వ పేజీ.
  4. ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,మార్చ్-10; 2వ పేజీ.
  5. ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; జనవరి-6,2014; 2వ పేజీ.
  6. "భారత జనగణన జాలస్థలిలో గ్రామ గణాంకాలు". Archived from the original on 2015-04-15. Retrieved 2014-03-11.

వెలుపలి లింకులు

[మార్చు]