అన్నయ్యగారి సాయిప్రతాప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నయ్యగారి సాయిప్రతాప్
అన్నయ్యగారి సాయిప్రతాప్

భారత ప్రభుత్వ అధికారిక పార్లమెంటు సభ్యుల వెబ్సైటులో ని సాయిప్రతాప్ చిత్రము


నియోజకవర్గం రాజంపేట

వ్యక్తిగత వివరాలు

జననం (1944-09-20) 1944 సెప్టెంబరు 20 (వయసు 80)
కోలార్, కర్ణాటక
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి కృష్ణవేణి
సంతానం 1 కూతురు
నివాసం కడప
మతం హిందూ
మూలం biodata

అన్నయ్యగారి సాయిప్రతాప్ (జ: 20 సెప్టెంబర్, 1944) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి 9వ, 10వ, 11వ, 12వ, 14వ లోక్‌సభలకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఐదు సార్లు ఎన్నికయ్యాడు.

వై.ఎస్. రాజశేఖరరెడ్డికి గుల్బర్గా వైద్య కళాశాలలో సహాధ్యాయి అయిన సాయి ప్రతాప్ అతడి ప్రోద్బలంతోనే 1989 పార్లమెంటు ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టినాడు. కాలేజీ రోజుల నుంచి నుంచి 2009లో రాజశేఖరరెడ్డి మృతి చెందేవరకు అత్యంత సన్నిహిత మిత్రబృందంలో ఒకడిగా ఉన్నాడు.

మన్మోహన్ సింగ్ నేతృత్వంలో రెండవసారి ఏర్పడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా 2009 మే 28 నుంచి 2011 జనవరి 19 వరకు ఉక్కు శాఖలోను, అదే రోజు ( 2011 జనవరి 19) నుంచి 2011 జూలై 12 వరకు భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖలోను పనిచేసాడు.

2014లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో చేరి ఉపాధ్యక్షుడయ్యాడు. కానీ ఆపార్టీని వదిలి, తిరిగి భారత జాతీయ కాంగ్రెస్లో చేరాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ సీట్ పై పోటీ చేసాడు. కేవలం 25 వేల ఓట్లు మాత్రమే సాధించగలిగాడు.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.