అభిమానవంతులు
అభిమానవంతులు (1973 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.రామిరెడ్డి |
నిర్మాణం | బి.నరసింహారావు |
తారాగణం | కృష్ణంరాజు, శారద |
నిర్మాణ సంస్థ | శ్రీ రామకృష్ణా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
అభిమానవంతులు 1973 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీరామకృష్ణా ఫిల్మ్స్ పతాకంపై ఎం. రామకృష్ణారెడ్డి, బి.నరసింహారావులు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్.రామిరెడ్డి దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, శారద ప్రధాన తారాగనంతో నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.పి. కోదండపాణి సంగీతాన్నందించాడు.[1]
కథ
[మార్చు]సీత (శారద) ధనవంతుడు, గర్విష్టి అయిన వ్యాపారవేత్త రాఘవరావు (ఎస్.వి.రంగారావు) కుమార్తె. అతను సమాజంలో డబ్బు, వ్యక్తి హోదాకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు. అనాథ, పేదవాడు అయిన రాము (కృష్ణరాజు) తో సీత ప్రేమలో పడుతుంది. సీత తండ్రి రాఘవ రావు సీత, రాముల వివాహాన్ని నిర్వహించడానికి అంగీకరించడు. కానీ సీత అతన్ని పెళ్లి చేసుకుని ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోతుంది. ఆమె తల్లి అన్నపూర్ణ (అంజలి దేవి) అతన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది. అయితే రాఘవరావు తన కుమార్తెను అంగీకరించే విషయం ఈ సినిమా కథాంశం.
తారాగణం
[మార్చు]- ఎస్.వి. రంగారావు
- కృష్ణంరాజు
- రాజబాబు
- శారద
- అంజలీదేవి
- రమాప్రభ
- సారథి
- మోదుకూరి సత్యం
- పొట్టి ప్రసాద్
- కె.కె.శర్మ
- పంచాది స్వామి
- కనకదుర్గ
- నీరజ
- ప్రసన్నరాణీ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: కె. యస్. రామిరెడ్డి
- సంగీతం: ఎస్.పి. కోదండపాణి
- మాటలు: రాజశ్రీ
- పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు, దాశరథి
- నేపథ్యగానం: సుశీల, వాణీజయరాం, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, కౌసల్య, నవకాంత్
- ఛాయాగ్రహణం, బాలు మహేంద్ర
- కూర్పు: ఎం.ఎస్.మణి
- కళ: భాస్కర్ రాజు
- నృత్యాలు: వెంపటి చినసత్యం, తార, సుందరం
- స్టిల్స్: ఎన్.వి.వి.ప్రసాద్
- నిర్మాతలు: ఎం. రామకృష్ణారెడ్డి, బి.నరసింహారావు
- ఉయ్యాల జంపాల ఊగరా ఊగరా అందాల బాబు - పి.సుశీల - రచన: దాశరథి
- ఎప్పటివలె కాదురా నా స్వామి ఎప్పటివలె - వాణీ జయరామ్ - రచన: డా.సినారె
- ఓ మనసు దోచిన చెలికాడా మమత పెంచినచినవాడా - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరథి
- ఈ వీణపైన పలికిన రాగం నాలోన విరిసిన అనురాగం - పి.సుశీల - రచన: డా.సినారె
- చేయి గలిపి మనసు నిలిపి చేలు - పి.సుశీల, ఎస్.పి.బాలు,నవకాంత్,కౌసల్య బృందం: రచన: కొసరాజు
మూలాలు
[మార్చు]- ↑ రావు, కొల్లూరి భాస్కర (2011-01-21). "అభిమానవంతులు - 1973". అభిమానవంతులు - 1973. Archived from the original on 2011-09-26. Retrieved 2020-08-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.