అయోవా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అయోవా అమెరికా దేశపు రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికాకు దక్షిణ, మధ్య భాగంలో ఉన్నది. డిసెంబరు 28, 1846న ఈ రాష్ట్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 29వ రాష్ట్రంగా చేరింది. ఈ రాష్ట్రంలో నివసించిన అయోవా ఆదివాసీ తెగ వలన ఈ పేరు స్థిరమయ్యింది.

భౌగోళిక స్వరూపం[మార్చు]

మిస్సిసిపీ నది ఈ రాష్ట్రపు తూర్పు సరిహద్దు. సియౌక్స్ నగరానికి దక్షిణంగా ఉన్న మిస్సూరీ నది, ఉత్తరంగా పెద్ద సియౌక్స్ నది ఈ రాష్ట్రపు పడమటి సరిహద్దులు. అయొవాలో పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయి. వీటిలో స్పిరిట్ సరస్సు, దక్షిణ ఒకోబోజీ సరస్సు, తూర్పు ఒకోబోజీ సరస్సులు అతి పెద్దవి. ఈ రాష్ట్రం ప్రధానంగా విశాలమైన మైదానాలతో కూడుకుని ఉన్నది. దక్షిణ సరిహద్దుల వెంబడి లోయెస్ కొండలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులలో మిస్సిసిపీ నదీ తీరంలో ఉన్న కోనిఫర్ చెట్లతో నిండిన చిన్న చిన్న కొండలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

  • ఫ్రెంచివారు ఈ రాష్ట్రాన్ని తొలిసారిగా పరిశోధించిన యూరోపియన్లు. లూయీ జోలియెట్, జాక్వెస్ మార్క్వెట్ ఈ రాష్ట్రాన్ని తొలిసారిగా సందర్శించారని ప్రతీతి.
  • ఇథనాల్, బయోడీజల్ ఉత్పత్తిలో ఈ రాష్ట్రం ప్రముఖ స్థానంలో ఉన్నది.
"https://te.wikipedia.org/w/index.php?title=అయోవా&oldid=3459724" నుండి వెలికితీశారు