Jump to content

అశోకవనంలో అర్జున కల్యాణం

వికీపీడియా నుండి
అశోకవనంలో అర్జున కల్యాణం
దర్శకత్వంవిద్యాసాగర్ చింతా
కథరవికిరణ్ కోలా
నిర్మాతభోగవల్లి బాపినీడు
సుధీర్ ఈదర
తారాగణంవిశ్వక్ సేన్
రుక్సార్ ధిల్లన్
రితిక నాయక్
గోపరాజు రమణ
ఛాయాగ్రహణంప‌వి కె.ప‌వ‌న్
కూర్పువిప్లవ్ నైషధం
సంగీతంజయ ఫణికృష్ణ
నిర్మాణ
సంస్థ
ఎస్‌విసిసి డిజిటల్
విడుదల తేదీs
6 మే 2022 (2022-05-06)(థియేటర్)
3 జూన్ 2022 (2022-06-03)( ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

అశోకవనంలో అర్జున కల్యాణం, 2022లో విడుదలైన తెలుగు రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ సినిమా. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బి. బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ సినిమాకు విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్, రుక్సార్ ధిల్లన్, రితిక నాయక్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2022 మే 6న థియేటర్లో విడుదలకాగా, 2022 జూన్ 3న ఆహా ఓటీటీలో విడుదలైంది.[1]

సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే అల్లం అర్జున్‌ (విశ్వక్‌ సేన్‌)కు ముఫ్ఫైమూడేళ్ళు వచ్చినా పెళ్లి కాదు. తమ కులంలో అమ్మాయిలు దొరక్కపోవడంతో, అతని తండ్రి గోదావరి జిల్లా అశోకపురంలో వేరే కులం అయిన మాధవి (రుక్సార్‌ దిల్లాన్)తో పెళ్ళి సంబంధం కుదుర్చుకుంటారు. నిశ్చితార్థం పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోదామని సమయానికి దేశం లాక్‌డౌన్‌ ప్రకటిస్తుంది. దీంతో అర్జున్‌ కుటుంబ సభ్యులతోపాటు బంధువులు కూడా పెళ్లికూతురి ఇంట్లోనే ఉండాల్సివస్తుంది. పెళ్లి కూతురు ఇంట్లో ఉన్న అర్జున్ కు ఊహించని సంఘటన ఒకటి ఎదురవుతుంది. దాన్ని అర్జున్ ఎలా తట్టుకున్నాడు? మాధవి (రుక్సాన్ థిల్లాన)తో అతని పెళ్ళి అయ్యిందా? లేదా? అనేది మిగతా సినిమా కథ.[2][3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ఎస్‌విసిసి డిజిటల్
  • నిర్మాతలు: బి. బాపినీడు, సుధీర్ ఈదర
  • కథ: రవికిరణ్ కోలా
  • స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విద్యాసాగర్ చింతా
  • సంగీతం: జయ ఫణికృష్ణ
  • సినిమాటోగ్రఫీ: పావి కే పవన్
  • ఎడిటర్: విప్లవ్ నైషధం
  • పాటలు: సంపాతి భరద్వాజ్ పాత్రుడు, అనంత శ్రీరామ్, రెహ్మాన్, విజయ్ కుమార్ భల్ల
  • ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి

చిత్ర నిర్మాణం

[మార్చు]

అశోకవనంలో అర్జున కల్యాణం 2021 ఏప్రిల్ 16న పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.[6] రాజా వారు రాణి గారు, ఫలక్‌నుమా దాస్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన విద్యాసాగర్ చింత దీనికి దర్శకత్వం వహించారు. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌లను రవికిరణ్ కోలా రాశారు. ఈ సినిమా టైటిల్ లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను 2021 సెప్టెంబరు 4న విడుదల చేశారు.[7] ఈ సినిమా టీజర్ ని 2022 ఫిబ్రవరి 2న విడుదల చేశారు.[8]

పాటలు

[మార్చు]
Untitled
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఓ ఆడపిల్ల"  రామ్ మిరియాల 5:07
2. "సిన్నవాడ"  అనన్య భట్
గౌతమ్ భరద్వాజ్
3:58
3. "రామ్ సిలకా"  రవి కిరణ్ కోలా 4:27
4. "ఈ వేడుక"  హరిప్రియ, జై క్రిష్ 4:36

మూలాలు

[మార్చు]
  1. Eenadu (27 May 2022). "'అశోకవనంలో అర్జున కల్యాణం'.. ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్పటి నుంచే". Archived from the original on 30 May 2022. Retrieved 30 May 2022.
  2. A. B. P. Desam (6 May 2022). "'అశోక వనంలో అర్జున కళ్యాణం' రివ్యూ : పెళ్లి కోసం ఇన్ని తిప్పలు పడాలా? విశ్వక్ సినిమా ఎలా ఉందంటే". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  3. Eenadu. "రివ్యూ: అశోకవనంలో అర్జున కళ్యాణం". Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
  4. NTV (4 September 2021). "డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకుంటున్న విష్వక్ సేన్". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  5. Namasthe Telangana (11 May 2022). "ఒక్క సినిమాతోనే పాపుల‌ర్‌..గీతాఆర్ట్స్‌లో మూడు సినిమాల డీల్‌..!". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  6. Eenadu (16 April 2021). "'అశోకవనంలో....' విశ్వక్‌సేన్‌". Archived from the original on 21 April 2021. Retrieved 21 April 2021.
  7. Sakshi (4 September 2021). "'చింత మ్యారేజ్‌ బ్యూరో.. సంబంధం కుదరని యెడల డబ్బులు వాపసు'". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  8. "Vishwak Sen's AVAK teaser promises to be a fun ride". Moviezupp. 2022-02-02. Retrieved 2022-02-02.

బయటి లింకులు

[మార్చు]