ఆత్మకథలు
ఆత్మకథ అనేది వ్యక్తులు తమ జీవిత విశేషాల గురించి తామే రాసుకునే సాహితీ ప్రక్రియ. తెలుగునాట పలువురు రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు ఎక్కువ గాను, ఇతరులు కొంత అరుదు గానూ ఆత్మకథలు రాశారు.
వ్యుత్పత్తి
[మార్చు]ఆత్మ అనే పదానికి శరీరం కంటె భిన్నమై, శాశ్వతత్వం కలిగినదనే ఒక భావన; ‘నేను’ అనే భావన; సర్వావస్థల యందు అనుస్యూతంగా ఉండే తత్త్వం. పొత్తూరి వెంకటేశ్వరరావు రాసిన పారమార్థిక పదకోశంలో అర్థాన్ని ఇచ్చారు. బ్రౌణ్య తెలుగు ఆంగ్ల నిఘంటువులో జీవుడు, సెల్ఫ్ (స్వీయ/స్వ/తన), శరీరము, స్వభావము, బుద్ధి వంటి అర్థాలు ఇచ్చింది. ఐతే ఆత్మ కథ అన్న పదబంధంలో హైందవ పారమార్థిక అర్థం కాక తన లేదా స్వ అనే అర్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రక్రియ పేరు తన కథ అన్న భావం నుంచి వచ్చిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తెలుగులో మొదట్లో వచ్చిన ఆత్మకథలను స్వీయ చరిత్రగా అభివర్ణించారు.
ప్రక్రియ లక్షణాలు
[మార్చు]రకాలు
[మార్చు]ఆత్మకథలు రెండురకాలు
- వ్యక్తులు తామే సొంతంగా రాసుకొనేవి
- వ్యక్తులు చెప్పగా వేరొకరు రాసేవి
కొన్ని ప్రసిద్ధ ఆత్మకథలు-రచయితలు
[మార్చు]- నా యెరుక - ఆదిభట్ల నారాయణదాసు - తెలుగులో రచించిన తొలి ఆత్మకథ
- కందుకూరి వీరేశలింగం స్వీయచరిత్రము - కందుకూరి వీరేశలింగం పంతులు - తెలుగులో తొలిగా ప్రచురణ పొందిన ఆత్మకథ
- హంపీ నుంచి హరప్పా దాక - తిరుమల రామచంద్ర - 2002లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన గ్రంథం
- శతపత్రము - గడియారం రామకృష్ణ శర్మ - 2007లో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందిన గ్రంథం
- అనుభవాలూ-జ్ఞాపకాలూను - శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
- నా జీవిత యాత్ర - టంగుటూరి ప్రకాశం
- నా స్మృతిపథంలో - ఆచంట జానకీరాం
- కళాప్రపూర్ణ దువ్వూరి వేంకటరమణ శాస్త్రి స్వీయచరిత్ర - దువ్వూరి వేంకటరమణ శాస్త్రి
- యాది - సామల సదాశివ
- జీవనయానం - దాశరథి రంగాచార్య
- దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర - కొండా వెంకటప్పయ్య
- మారుతున్న సమాజం - నా జ్ఞాపకాలు - మామిడిపూడి వేంకటరంగయ్య
- సి. వి. కె. రావు ఆత్మకథ - సి. వి. కె. రావు
- విన్నంత కన్నంత - బూదరాజు రాధాకృష్ణ ఆత్మకథ
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఏడిదము సత్యవతి - తెలుగులో ఆత్మకథ రాసిన తొలి మహిళ