ఈతరం మనిషి
Appearance
ఈతరం మనిషి (1977 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి. మధుసూదన రావు |
తారాగణం | శోభన్ బాబు, లక్ష్మి |
సంగీతం | కె.చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి |
గీతరచన | ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | పల్లవీ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ తరం మనిషి 1977లో విడుదలైన తెలుగు సినిమా. పల్లవి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎస్.వెంకటరత్నం, కె.రవీంద్రనాథ్ లు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూదనరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, లక్ష్మీ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రం మాదిరెడ్డి సులోచన వ్రాసిన "మిస్టర్ సంపత్ ఎం.ఎ" నవల ఆధారంగా తీశారు.
తారాగణం
[మార్చు]- శోభన్ బాబు
- లక్ష్మి
- జయప్రద
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రావు గోపాలరావు
- బి.పద్మనాభం
- రాజబాబు
- అల్లు రామలింగయ్య
- గిరిబాబు
- త్యాగరాజు
- సాక్షి రంగారావు
- రవీంద్రనాథ్
- పిచ్చయ్య చౌదరి
- ఎం. రంగారావు
- ఎస్.వి.జగ్గారావు
- ఎం.ప్రభాకరరెడ్డి
- అంజలీదేవి
- నిర్మల
- హలం
- ప్రదీప్
- బోసుబాబు
- కె.కె.శర్మ
- ఆర్. కామేశ్వరరావు
- చలపతిరావు
- చిడతల అప్పారావు
- బేబీ రోహిణి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: వి.మధుసూదనరావు
- స్టుడియో: పల్లవి ఆర్ట్ పిక్చర్స్
- నిర్మాతలు: ఎస్.వెంకటరత్నం, కె.రవీంద్రనాథ్
- ఛాయాగ్రహణం: ఎస్.వెంకటరత్నం
- కూర్పు: అక్కినేని సంజీవి
- కంపోజర్: చక్రవర్తి
- ఛాయాగ్రహణం: ఒ ప్రభాకర్
- పాటలు: ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర
- అసోసియేట్ డైరక్టర్: ఎ.కోదండరామిరెడ్డి
- కథ: మాదిరెడ్డి సులోచన
- చిత్రానువాదం: వి.మదుసూధనరావు
- సంభాషణలు: ఆచార్య అత్రేయ
- గాయకులు: పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- కళా దర్శకుడు: ఎస్.కృష్ణారావు
- నృత్య దర్శకుడు: బి.హీరాలాల్, తార, తరుణ్ కుమార్
- విడుదల: 1977 ఫిబ్రవరి 10
పాటలు
[మార్చు]ఈ సినిమాలో 2 పాటలను ఆరుద్ర రచించారు.[2]
- నవనవలాడే జవరాలు చెవిలో ఏదో చెప్పింది - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, గానం:ఆరుద్ర
- రావయ్యా ఓ తెలుగు బావా - గానం: ఎస్.జానకి బృందం, గానం: ఆత్రేయ
- చిరుగాలుల గిలిగింతలకు మరుమల్లె_ గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
- ఇచ్చేశా నా హృదయం తీసుకో _గానం: పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: ఆత్రేయ
- ఎంత షో గున్నావే కిలాడి గుంటా_గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: ఆచార్య ఆత్రేయ
- ఓ కోమలి నా జాబిలి ఓ నవ్వన యవ్వన రాశి_గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: ఆత్రేయ
- ఆమ్లల పుష్ప సంకీర్ణం(శ్లోకం)_ గానం:మంగళంపల్లి బాలమురళీకృష్ణ.
మూలాలు
[మార్చు]- ↑ "Ee Tharam Manishi (1977)". Indiancine.ma. Retrieved 2020-08-18.
- ↑ కురిసే చిరుజల్లులో, ఆరుద్ర సినీ గీతాలు, 5వ సంపుటం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
3.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఈతరం మనిషి
- "Ee Tharam Manishi Telugu Full Length Movie || Shoban Babu, Jaya Prada - YouTube". www.youtube.com. Retrieved 2020-08-18.