ఏమైంది ఈవేళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏమైంది ఈవేళ ..
దర్శకత్వంసంపత్ నంది
రచనసంపత్ నంది
నిర్మాతకె. రాధా మోహన్
తారాగణంవరుణ్ సందేశ్,
నిషా అగర్వాల్,
ఎమ్మెస్ నారాయణ,
కృష్ణ భగవాన్
శశాంక్
వెన్నెల కిశోర్
ఛాయాగ్రహణంబుజ్జి
కూర్పుముత్యాల నాని
సంగీతంచక్రి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
నవంబరు 12, 2010 (2010-11-12)
దేశంభారతదేశం భారతదేశం
భాషతెలుగు

ఏమైంది ఈవేళ 2010 నవంబరు 12 న సంపత్ నంది దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో వరుణ్ సందేశ్, నిషా అగర్వాల్ జంటగా నటించారు. ఈ చిత్రానికి చక్రి సంగీత దర్శకత్వం వహించాడు.

శీను సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం హైదరాబాదు నుంచి అమీర్ పేటకు వస్తాడు. అవంతిక కూడా అదే అవసరం మీద హైదరాబాదుకు వచ్చి హాస్టల్లో ఉంటుంది. మొదటగా తగాదాలతో ఆరంభమైన వారి పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ వాళ్ళ పెద్దల్ని ఎదిరించి పెళ్ళి చేసుకుని కాపురం పెడతారు. కానీ కొద్దిరోజులకే విడిపోవాలని నిర్ణయించుకుంటారు. తర్వాత తల్లిదండ్రుల బలవంతం మీద ఇద్దరూ రెండో పెళ్ళికి సిద్ధం అవుతారు. కానీ ఆ పెళ్ళిళ్ళకి ముందే తమ పొరపాట్లు తెలుసుకుని రెండో పెళ్ళి రద్దు చేసుకుని మళ్ళీ ఒకటవుతారు.

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]

2010 అక్టోబరు 11 న ఈ చిత్ర పాటలు హైదరాబాదులో పార్క్ హోటల్ లో జరిగిన కార్యక్రమంలో విడుదల అయ్యాయి. ఎం. ఎల్. కుమార్ చౌదరి, పోసాని కృష్ణమురళి, అల్లరి నరేష్, నాని, తనీష్, కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్, చక్రి, వెన్నెల కిషోర్, శశాంక్, కోడి రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.[1]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "నీ నవ్వే మ్యూజికల్"  చక్రి, పావని పొండా  
2. "నిజమేనా కాదా"  చక్రి, కౌసల్య  
3. "నువ్వనీ నేననీ"  దీపు, కౌసల్య  
4. "తూనిగన్నే ఉన్నావులే"  వాసు, శ్రావణభార్గవి  
5. "జ్యూస్"  గీతామాధురి  

మూలాలు

[మార్చు]
  1. "Yemaindi Ee Vela music launch". idlebrain.com. Archived from the original on 14 అక్టోబరు 2010. Retrieved 11 Oct 2010.

బయటి లింకులు

[మార్చు]