కళ్లకురిచి జిల్లా
Kallakurichi District | |
---|---|
Coordinates: 11°44′17″N 78°57′43″E / 11.738°N 78.962°E | |
Country | India |
రాష్ట్రం | Tamil Nadu |
Municipalities | Kallakurichi, Tirukoilur, Ulundurpet |
Named for | Sugarcane, cotton, maize, tapioca |
ముఖ్యపట్టణం | Kallakurichi |
Largest City | Kallakurichi |
Government | |
• Type | District Administration, Kallakurichi |
• Body | District Administration, Kallakurichi |
• Collector | Sravan Kumar Jatavath, IAS |
• Superintendent of Police | P. Pakalavan, IPS |
విస్తీర్ణం Plain area | |
• Total | 3,520 కి.మీ2 (1,360 చ. మై) |
• Rank | 1 |
జనాభా | |
• Total | 16,82,687 |
• జనసాంద్రత | 480/కి.మీ2 (1,200/చ. మై.) |
Languages | |
• Official | Tamil |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 606202 |
Telephone code | 04151 04149 04153 |
Vehicle registration | TN - 15 TN-32 |
కళ్లకురిచి జిల్లా, భారతదేశం, దక్షిణ కొనపై ఉన్న తమిళనాడు రాష్ట్రం, లోని ఒక జిల్లా. జిల్లా కేంద్రం కల్లకురిచిలో ఉంది. కళ్లకురిచి జిల్లా 12 నవంబరు 2019 నవంబరు 12న విలుప్పురం జిల్లా నుండి కొన్ని ప్రాంతాలు వేరుతో సృష్టించగా ఉనికిలోకి వచ్చింది.[2] 550.70 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న కల్వరాయన్ కొండలు జిల్లాకు ప్రధాన ఆకర్షణ. గిరిజన జనాభా అధికంగా ఉండే కొండల్లో పెరియార్ జలపాతం, మేఘం జలపాతం, సిరుకలూర్ జలపాతం, చిన్నతిరుపతి దేవాలయం ఉన్నాయి. తిరుకోయిలూర్‌లోని ఉలగలంత పెరుమాళ్ ఆలయం, వీరత్తనేశ్వరార్ ఆలయం, కబిలార్ కొండ, శ్రీ లక్ష్మీ నరసింహార్ ఆలయం, ఉలుందూర్‌పేట తాలూకాలోని పరిక్కల్, అధిరంగన్ రంగనాథస్వామి ఆలయం, తిరువరంగం అర్థనారీశ్వర ఆలయం, శంకరాపురం తాలూకాలోని రిషివండియం వంటి చాలా ప్రసిద్ధ ఆలయాలు ఈ జిల్లాలో ఉన్నాయి.[3][4]
చరిత్ర
[మార్చు]పురాతన కాలంలో, ఈ ప్రాంతం చోళులు, పల్లవులు, తిరుకోయిలూర్ రాజు మలైమాన్ వంటి వివిధ స్థానిక నాయకుల పాలనలో ఉంది. చోళనాడు, తొండైనాడు మధ్య ఉన్నందున, ఈ ప్రాంతాన్ని నాడు నాడు (మధ్య భూమి) అని పిలుస్తారు. తరువాతి కాలంలో, ఇది జింగీ నాయకులు, ఆర్కాట్ నవాబుల పాలన సాగింది. బ్రిటిష్ పాలనలో, ఈ ప్రాంతం మొత్తం మద్రాసు ప్రెసిడెన్సీలోని సౌత్ ఆర్కాట్ జిల్లాలో భాగంగా ఉండేది. కళ్లకురిచి మునిసిపాలిటీ పరిసర ప్రాంతాన్ని విల్లుపురం జిల్లాను విభజించడం ద్వారా కళ్లకురిచి జిల్లా ఏర్పడింది.[5]
గణాంకాలు
[మార్చు]జిల్లా పరిధి మొత్తం 3530.58 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.జిల్లా పరిధిలోని జనాభా మొత్తం 13,77,494. జిల్లాలో 6 తాలూకాలతో 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, 24 ఫిర్కాలలో 562 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో 9 డెవలప్‌మెంట్ బ్లాకులు 412 గ్రామ పంచాయతీలను కలిగి ఉన్నాయి.
ప్రధాన ఆకర్షణలు
[మార్చు]కాల్వరాయన్ కొండలు
[మార్చు]కల్వరాయన్ కొండలు తూర్పు కనుమలలో ఉన్న కొండల ప్రధాన శ్రేణి. పచ్చైమలై, అలవైమలై, జవాది, శేవరోయ్ కొండలతో పాటు, అవి కావేరీ నదీ పరీవాహక ప్రాంతాన్ని దక్షిణాన పాలార్ నది పరీవాహక ప్రాంతం నుండి ఉత్తరాన వేరు చేస్తాయి. కొండలు 2000 అడుగుల నుండి 3000 అడుగుల ఎత్తు వరకు ఉంటాయి.ఇవి 1,095 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.
జలపాతాలు
[మార్చు]గిరిజన జనాభా అధికంగా ఉండే కొండల్లో పెరియార్ జలపాతం, మేఘం జలపాతం, సిరుకలూర్ జలపాతం,
దేవాలయాలు
[మార్చు]తిరుకోయిలూర్‌లోని ఉలగలంత పెరుమాళ్ ఆలయం, వీరత్తనేశ్వరార్ ఆలయం, కబిలార్ కొండ, శ్రీ లక్ష్మీ నరసింహార్ ఆలయం, ఉలుందూర్‌పేట తాలూకాలోని పరిక్కల్, అధిరంగన్ రంగనాథస్వామి ఆలయం, తిరువరంగం అర్థనారీశ్వర ఆలయం, శంకరాపురం తాలూకాలోని రిషివండియం వంటి చాలా ప్రసిద్ధ ఆలయాలు ఈ జిల్లాలో ఉన్నాయి.[3][4]
భౌగోళికం
[మార్చు]కళ్లకురిచి జిల్లా ఉత్తరాన తిరువణ్ణామలై జిల్లా, తూర్పున విల్లుపురం జిల్లా, పశ్చిమాన ధర్మపురి, సేలం జిల్లాలు, దక్షిణాన పెరంబలూరు, కడలూరు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలో ఎక్కువ భాగం గ్నీస్ కుటుంబానికి చెందిన రూపాంతర శిలలతో కప్పబడి ఉంటుంది. వివిధ భౌగోళిక కాలాలకు చెందిన అవక్షేపణ శిలల మూడు గొప్ప సమూహాలు ఉన్నాయి. ఉత్తరాన ఉన్న కల్రాయన్ కొండలు, తూర్పు కనుమలలో భాగమైన కొన్ని ముళ్ళతో కూడిన అడవులు, వృక్షసంపదతో కప్పబడిన నిరంతర కొండల శ్రేణిని సూచిస్తాయి. జిల్లాలోని ప్రధాన నదులలో తెన్పెన్నై, మణిముక్తార్, గోముఖి, గాడిలం ఉన్నాయి. నీటిపారుదల ప్రధాన వనరు సరస్సులు, కాలువలు, బావుల ద్వారా జరుగుతుంది
జిల్లా వాతావరణం
[మార్చు]వాతావరణం మధ్యస్థం నుండి వేడిగా ఉంటుంది, గరిష్ట ఉష్ణోగ్రత 38°సెంట్రీగ్రేడ్, కనిష్ట ఉష్ణోగ్రత 21° సెంట్రీగ్రేడ్ ఉంటుంది. జిల్లాలో ఈశాన్య రుతుపవనాల నుండి శీతాకాలంలో, నైరుతి రుతుపవనాల నుండి వేసవి నెలలలో వర్షపాతం ఉంటుంది. వార్షిక సగటు వర్షపాతం 1,070 మి.మీ.
పరిపాలనా విభాగాలు
[మార్చు]జిల్లా కల్లక్కురిచ్చి, శంకరాపురం, చిన్నసేలం, ఉలుందూర్‌పేట, తిరుక్కోవిలూర్, కల్వరాయన్ కొండలు అనే 6 తాలూకాలుగా విభజించబడింది.[4]
పురపాలికలు
[మార్చు]1) కళ్లకురిచ్చి
2) తిరుకోవిలూర్
3) ఉలుందూరుపేట
పట్టణ పంచాయతీలు
[మార్చు]1) శంకరాపురం
2) చిన్నసేలం
3) త్యాగదురుగం
4) వడకానందల్
5) మనలూరుపేట
పంచాయితీ యూనియన్లు
[మార్చు]1) కళ్లకురిచ్చి
2) శంకరాపురం
3) తిరుకోవిలూర్
4) ఋషివందియం
5) త్యాగదురుగం
6) ఉలుందూరుపేట
7) చిన్నసేలం
8) తిరునావలూరు
9) కల్వరాయన్మలై
మూలాలు
[మార్చు]- ↑ புதிதாக பிரிக்கப்பட்ட கள்ளக்குறிச்சி மாவட்டம் இன்று உதயம். News7 Tamil. 25 November 2019. Retrieved 30 November 2019.
- ↑ "Kallakurichi is 33rd district of T.N." The Hindu. Special Correspondent. 2019-01-09. ISSN 0971-751X. Retrieved 2019-06-12.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ 3.0 3.1 "History | Kallakurichi District, Govt. of Tamil Nadu, | India". Retrieved 2023-01-17.
- ↑ 4.0 4.1 4.2 https://cdn.s3waas.gov.in/s3c7e1249ffc03eb9ded908c236bd1996d/uploads/2020/04/2020041882.pdf
- ↑ "Tamil Nadu has a new district: Kallakurichi will be 33rd". Hindustan Times. 2019-01-09. Retrieved 2019-06-12.