అక్షాంశ రేఖాంశాలు: 18°25′58″N 79°40′02″E / 18.432713°N 79.667129°E / 18.432713; 79.667129

చిట్యాల మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిట్యాల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలం.[1]

చిట్యాల
—  మండలం  —
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, చిట్యాల స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, చిట్యాల స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, చిట్యాల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°25′58″N 79°40′02″E / 18.432713°N 79.667129°E / 18.432713; 79.667129
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ జిల్లా
మండల కేంద్రం చిట్యాల్ (చిట్యాల మండలం)
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 211 km² (81.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 61,813
 - పురుషులు 30,518
 - స్త్రీలు 31,295
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.85%
 - పురుషులు 59.90%
 - స్త్రీలు 35.79%
పిన్‌కోడ్ 506356

ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 56 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం చిట్యాల.

మండల జనాభా

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 61,813 - పురుషులు 30,518 - స్త్రీలు 31,295.[3]పిన్ కోడ్: 506356.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 211 చ.కి.మీ. కాగా, జనాభా 37,314. జనాభాలో పురుషులు 18,307 కాగా, స్త్రీల సంఖ్య 19,007. మండలంలో 9,784 గృహాలున్నాయి.[4]

వరంగల్ నుండి జయశంకర్ జిల్లాకు మార్పు

[మార్చు]

లోగడ చిట్యాల మండలం వరంగల్ జిల్లా పరిదిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చిట్యాల మండలాన్ని(1+15) పదహారు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5].

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కాల్వపల్లి
  2. గిద్దెముత్తారం
  3. వెంచెరామి
  4. చెయిన్‌పాక
  5. నవాబ్‌పేట్
  6. కైలాపూర్
  7. నాయినిపాక
  8. వోడ్తల
  9. జాదలపేట్
  10. తిర్మలాపూర్
  11. చిట్యాల్
  12. జూకల్
  13. చల్లగరిగె
  14. ముచినిపర్తి
  15. గోపాల్పూర్
  16. దూత్‌పల్లి

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-25.

బయటి లింకులు

[మార్చు]