అక్షాంశ రేఖాంశాలు: 16°22′42″N 80°36′53″E / 16.37833°N 80.61472°E / 16.37833; 80.61472

చిలువూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిలువూరు
చిలువూరు రైల్వే స్టేషన్ సైన్ బోర్డు
చిలువూరు రైల్వే స్టేషన్ సైన్ బోర్డు
పటం
చిలువూరు is located in ఆంధ్రప్రదేశ్
చిలువూరు
చిలువూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°22′42″N 80°36′53″E / 16.37833°N 80.61472°E / 16.37833; 80.61472
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలందుగ్గిరాల
విస్తీర్ణం
17.84 కి.మీ2 (6.89 చ. మై)
జనాభా
 (2011)
7,952
 • జనసాంద్రత450/కి.మీ2 (1,200/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,948
 • స్త్రీలు4,004
 • లింగ నిష్పత్తి1,014
 • నివాసాలు2,281
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522330
2011 జనగణన కోడ్590259

చిలువూరు, గుంటూరు జిల్లా, దుగ్గిరాల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన దుగ్గిరాల నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంగళగిరి నుండి 12 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2281 ఇళ్లతో, 7952 జనాభాతో 1784 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3948, ఆడవారి సంఖ్య 4004. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3787 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 254. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590259.[1]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,530.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,768, స్త్రీల సంఖ్య 3,762, గ్రామంలో నివాస గృహాలు 1,872 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,784 హెక్టారులు.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఈ గ్రామంలో పదవ శతాబ్దంనాటి బ్రహ్మ విగ్రహం బయల్పడినది. ఇది వేంగీ చాళుక్యులనాటిదిగా గుర్తించారు. ఇటీవల గ్రామంలోని గంగానమ్మ ఆలయ పునరుద్ధరణ పనులు నిర్వహించుటకై త్రవ్వకాలు జరుపుచుండగా, ఈ విగ్రహం బయల్పడింది. 12]ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[3]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

సమీప గ్రామాలు

[మార్చు]

శృంగారపురం 3 కి.మీ, మోరంపూడి 3 కి.మీ, పెదవడ్లపూడి 3 కి.మీ, చినవడ్లపూడి 4 కి.మీ, పెనుమూడి 4 కి.మీ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల దుగ్గిరాలలోను, ఇంజనీరింగ్ కళాశాల చింతలపూడిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు తెనాలిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల దుగ్గిరాలలోను, అనియత విద్యా కేంద్రం తెనాలిలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

చిలువూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో6 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

చిలువూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

చిలువూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 116 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1667 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1667 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

చిలువూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 923 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 743 హెక్టార్లు

ఊర చెరువు:- ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016, మే-16న, పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామంలో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉత్పత్తి

[మార్చు]

చిలువూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, మొక్కజొన్న, సపోటా, అపరాలు, కాయగూరలు

గ్రంథాలయo

[మార్చు]

యడ్ల హేమప్రసాద్ గ్రామంలో ఒక గ్రంథాలయాన్ని కట్టించారు.

గ్రామంలో మౌలిక వసతులు

[మార్చు]

కచేరీ భవనo

[మార్చు]

చిలువూరుకు చెందిన ప్రవాస భారతీయుడు కాట్రగడ్డ కృష్ణప్రసాద్, తన తల్లి కీ.శే.కమలమ్మ జ్ఞాపకార్ధం, గ్రామంలో రెవెన్యూ అధికారులు విధులు నిర్వహించడానికి అనువుగా ఒక కచేరీ భవనాన్ని నిర్మించనున్నారు. సుమారు పది లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ భవన నిర్మాణానికి, 2016, మార్చి-4వ తెదీ శుక్రవారంనాడు శంకుస్థాపన నిర్వహించారు.

రహదారి సౌకర్యం

[మార్చు]

ఈమని గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు శ్రీ కాట్రగడ్డ కృష్ణప్రసాద్ లక్షల రూపాయలు వెచ్చించి, చిలువూరు నుండి తుమ్మపూడి వరకు ప్రధాన రహదారి ఏర్పాటు చేయించారు. అంతర్గత రహదారులకు జన్మభూమి కార్యక్రమంలో నిధులు అందజేసినారు.

డాక్టర్ యడ్ల హేమప్రసాద్ గ్రామంలో ఒక ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసారు.

విద్యుత్తు ఉపకేంద్రo

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన యడ్ల సాంబశివరావు (సాంబులు), ఈ గ్రామానికి మంజూరయిన 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రానికి అవసరమైన 55 సెంట్ల భూమిని విరాళంగా అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ భూమి విలువ ఎకరం 80 లక్షల ఖరీదుగలది. వీరు ఈ భూమిని, యడ్ల ఆనందయ్య, యేల్ల ప్రకాశరావు జ్ఞాపకార్ధం అందజేసినారు. ఉద్యాన పంటలతో అలరారే చిలువూరు గ్రామంలో, 600 పైగా వ్యవసాయ విద్యుత్తు కనక్షన్లు ఉండగా, 1000 ఎకరాలకు పైగా సాగుకు ఈ విద్యుత్తు ఉపకేంద్రమే ఆధారం.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో షేక్ షంషూన్, సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా మాణిక్యరావు ఎన్నికైనాడు. మాణిక్యారావు, 2016, ఫిబ్రవరి-7న తన ఉపసర్పంచ్ పదవికి రాజీనామా చేసారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ భోగేశ్వరస్వామి ఆలయం

[మార్చు]
  1. ఈ ఆలయం చోళులకాలం నాటిదిగా ప్రసిద్ధి. ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో, దానిస్థానంలో నూతనంగా ఆలయం నిర్మించేటందుకు, ఆలయ గర్భగుడి గోడను తొలగిస్తుండగా, దానిలో వినాయకుడు, పార్వతీపరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలు వెలుగు చూశాయి. పార్వతి విగ్రహం విరిగి ఉండగా, మిగిలిన విగ్రహాలు చాలా బరువుగా ఉన్నాయి. అవి ఏ లోహంతో చేశారో తెలియలేదు. ఈ ఆలయ జీర్ణోద్ధరణ కోసం, ప్రవాస భారతీయులు, ఈ గ్రామస్థులు అయున శ్రీ పెద్దు రామారావు గ్నాపకార్ధం, ఆయన భార్య లైలా, కుమారులు వేణుగోపాల, అజయకుమార్, రు. 1,00.116-00 లను ఆలయ అభివృద్ధి కమిటీ సమన్వయ కర్త, శ్రీ మండవ సాయిశివరావుకి అందజేశారు.[4]
  2. నూజివీడు సీడ్స్ అధినేత శ్రీ మండవ వెంకటరామయ్య, ఆయనతోపాటు ప్రవాస గ్రామస్థులు, ఒక కోటి రూపాయల వరకు వితరణ చేసి, వందల సంవత్సరాల నాటి శ్రీ భోగేశ్వరస్వామివారి ఆలయ పునర్నిర్మాణానికి నిధులు సమకూర్చారు.ఈ ఆలయంలో ఒక కోటి రూపాయల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలలో భాగంగా, ఆలయంలో నాగవినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికై, 2015, మార్చి-13వ తేదీ శుక్రవారం మద్యాహ్నం నుండి ప్రత్యేకపూజలు నిర్వహించారు. 14వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు.
  3. ఈ ఆలయ పునఃప్రతిష్ఠా వార్షికోత్సవ పూజలు,2017, ఏప్రిల్-25వతేదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా అర్చనలు, అభిషేకాలు, పూజలు, భజనలు, లలితాసహస్రనామ పారాయణం, కోలాటం మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు.

శ్రీ మదనవేణుగోపాలస్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం

[మార్చు]

శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం

[మార్చు]

గ్రామ ప్రముఖులు

[మార్చు]

నూతక్కి రామశేషయ్య

మూలాలు

[మార్చు]
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2013-09-05.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-18.
  4. ఈనాడు, గుంటూరు రూరల్, అక్టోబరు-31,2013. 3వ పేజీ


"https://te.wikipedia.org/w/index.php?title=చిలువూరు&oldid=4254847" నుండి వెలికితీశారు