టాస్మా
టాస్మా | |
---|---|
తరహా | |
స్థాపన | 1933 |
ప్రధానకేంద్రము | కాజాన్, రష్యా |
పరిశ్రమ | ఫోటోగ్రఫిక్ పరికరాలు, తయారీ |
ఉత్పత్తులు | ఫిలిం |
వెబ్ సైటు | http://www.tasma.ru/en/ |
టాస్మా అనేది రష్యా లోని కాజాన్ కేంద్రంగా పనిచేసే ఒక ఫిలిం, ఫోటోగ్రఫిక్ పరికరాల తయారీదారు. టాస్మా యొక్క పూర్తి రూపం, టాటార్ సెన్సిటివ్ మెటీరియల్స్ (Tatar Sensitive Materials) [1]
చరిత్ర
[మార్చు]1933లో ఫ్యాక్టరీ ఫిలిం నెంబరు 8 గా టాస్మా ప్రారంభం అయ్యింది. కానీ టాస్మా అనే పేరు మాత్రం 1974లోనే ఏర్పడింది.
1935లో మొట్టమొదటి సారిగా పరీక్ష కోసం ఫిలిం విదుడల చేసింది. 1936లో మొట్టమొదటి సినీ ఫిలిం ను, 1941లో మొట్టమొదటి ఏరో ఫిలిం ను విడుదల చేసింది. 1942లో మొట్టమొదటి యాంటీ-ఫాగ్ ఫిలిం ను విడుదల చేసింది.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సోవియట్ యూనియన్లో పని చేసిన ఏకైక ఫ్యాక్టరీ టాస్మాయే కావటం విశేషం. ఈ సేవలను గుర్తించి 1944లో టాస్మాకు అప్పటి సోవియట్ యూనియన్ Order of the Red Banner of Labor USSR ను ప్రదానం చేసింది.
యుద్ధం తర్వాత అనేక ఇతర ఉత్పత్తులను టాస్మా తయారు చేసింది. కాలక్రమేణా ఫోటోగ్రఫీ లోని ఇతర రంగాలకు విస్తరించింది.
ముద్రణకు కావలసిన మొట్టమొదటి గ్రాఫిక్ ఆర్ట్ ఫిలిం ను 1948లో, మొట్టమొదటి పారిశ్రామిక ఎక్స్ రే ఫిలిం ను 1949లో, మొట్టమొదటి కలర్ ఫిలిం ను 1950లో విడుదల చేసింది.
80వ దశకంలో ఫ్యాక్టరీ భవనాల విస్తరణ, తయారీ రంగం ప్రక్షాళన, కొత్త పరికరాలను సమకూర్చుకోవటం చేసింది.
1992లో టాస్మాలో కార్పోరేటీకరణ, ప్రైవేటీకరణ జరిగాయి.
ఉత్పత్తులు
[మార్చు]కాలక్రమేణా పలు ఉత్పత్తుల తొలగింపు చేరిక జరిగాయి. 2018 సంవత్సరానికి టాస్మా ఈ క్రింది ఉత్పత్తులను తయారు చేస్తోంది.
- పారిశ్రామిక ఎక్స్ రే ఫిలిం లు/రసాయనాలు
- ఎయిరోస్పేస్ ఫిలిం
- యాంటీ ఫాగ్ ఫిలిం
- థర్మో సెన్సిటివి ఫిలిం
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "టాస్మా వెబ్ సైటు - About Us లంకె". Archived from the original on 2012-04-26. Retrieved 2018-09-18.