అక్షాంశ రేఖాంశాలు: 15°41′42.000″N 80°1′4.800″E / 15.69500000°N 80.01800000°E / 15.69500000; 80.01800000

తిమ్మనపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిమ్మనపాలెం
పటం
తిమ్మనపాలెం is located in ఆంధ్రప్రదేశ్
తిమ్మనపాలెం
తిమ్మనపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°41′42.000″N 80°1′4.800″E / 15.69500000°N 80.01800000°E / 15.69500000; 80.01800000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంకొరిశపాడు
విస్తీర్ణం7.25 కి.మీ2 (2.80 చ. మై)
జనాభా
 (2011)[1]
0
 • జనసాంద్రత0.0/కి.మీ2 (0.0/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు0
 • స్త్రీలు0
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
 • నివాసాలు0
ప్రాంతపు కోడ్+91 ( 08593 Edit this on Wikidata )
పిన్‌కోడ్523326
2011 జనగణన కోడ్590578


తిమ్మనపాలెం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలానికి చెందిన రెవెన్యూ గ్రామం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఆరెవారి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]

ఈ పాఠశాలలో చదువుచున్న ఐదుగురు విద్యార్థులు, ఇటీవల ఒంగోలులో నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీలలో తమ ప్రతిభ ప్రదర్శించి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనారు. అనంతరం వీరు 2015, సెప్టెంబరు-19 నుండి 21 వరకు విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో గూడా పాల్గొని అక్కడ గూడా రాణించారు.ఈ పాఠశాలలో 2016, డిసెంబరు-1, గురువారంనాడు, చదువులతల్లి సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన దాత శ్రీ తూమాటి ఆంజనేయులు దంపతులు, 70 వేల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాన్ని వితరణగా అందజేసినారు. ఈ పాఠశాల మరికొద్ది రోజులలో స్వర్ణోత్సవం జరుపుకొనబోవుచున్నది.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

[మార్చు]

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం

[మార్చు]

రైతుల, ఖాతదారుల సౌకర్యార్ధం, ఈ సంఘం కార్యాలయంలో 2016, జనవరి-7న నూతనంగా ఒక క్యాష్ కౌంటరును ఏర్పాటు చేసారు.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

ఊరచెరువు

[మార్చు]

గ్రామంలోని ఈ చెరువు 29.20 ఎకరాలలో విస్తరించియుండగా, కొంత భాగం జాతీయ రహదారి విస్తరణకు కేటాయించగా, మిగిలిన 25 ఎకరాలలో ఉన్న ఈ చెరువులో, ఇటీవల ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు పథకంలో భాగంగా 9.9 లక్షల రూపాయల నిధులతో పూడికతీత కార్యక్రమం చేపట్టి అభివృద్ధి చేసారు. చెరువులో తీసిన సారవంతమైన పూడిక మట్టిని రైతులు తమ పొలాలకు ఎరువుగా తరలించుకొని పోయినారు. ఈ విధంగా చేయుట వలన చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు ఎరువుల ఖర్చు గూడా తగ్గినదని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూడికతీత అనంతరం చెరువుకట్టలపై ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినారు. ఎప్పుడూ దట్టంగా పెరిగిన చిల్లచెట్లూ, రబ్బరుకంపతో నిండిపోయిన ఈ చెరువును, అభివృద్ధి చేసిన అనంతరం చూచుచుంటే, ఆశ్చర్యం కలుగక మానదు. ఇంకనూ చెరువుకట్ట ఉపరితలంలో గ్రావెలుతో చదునుచేసి, రివెట్ మెంటును ఏర్పాటుచేసి, కట్ట కోతకు గురికాకుండా చూడవలసియున్నది. [7]

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో అన్నంగి మేరమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

[మార్చు]

శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేద్ర స్వామి గాయత్రీమాతా పూజాపీఠం

[మార్చు]

ఈ పీఠంలో, 25 సెప్టెంబరు-25 గురువారం నాడు, దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు, కలశపూజతో ప్రారంభమగును.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

ఆరి సీతారామయ్య

[మార్చు]

ఈ గ్రామానికి చెంది ఆరి మాంధాతయ్య, తులశమ్మ వ్యవసాయ కుటుంబీకులు. ఇతని కుమారుడు ఆరి సీతారామయ్య, లక్నోలో 1965-67లో, జీవరసాయనశాస్త్రం అభ్యసించి, అక్కడే పి.హెచ్.డి, చేసారు. అనంతరం అమెరికాలోని మిచిగన్ రాష్ట్రం ఓక్ ల్యాండ్ విశ్వవిద్యాలయంలో జీవవైద్యవిఙానశస్త్రంలో ఆచార్యులుగా సేవలందించుచున్నారు. వీరు తెలుగుభాషా ప్రేమికులు. ఆయన ఉద్దేశంలో తెలుగుభాష ఒక్కటే మనలను కలిపి ఉంచుతోంది. దానిని పోగొట్టుకుంటే మనం, తెలుగు సంస్కృతిని పోగొట్టుకున్నట్లేనని చెప్పుచున్నారు. అందుకే ఆయన కథాసంపుటాల రూపంలో తెలుగును బ్రతికించుకుంటున్నారు. వీరు డెట్రాయిట్లో 100మంది ఔత్సాహికులైన తెలుగువారితో కలిసి, "డెట్రాయిట్ తెలుగు సాహిత్య సంఘం" అను సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. వీరు ప్రతినెలా ఒక తెలుగు పుస్తకం చదివి దానిపై విస్తృత చర్చ జరుపుచున్నారు. శ్రీశ్రీ. గోపీచంద్ లాంటిమహానుభావుల శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. సీతారామయ్య 2005 లో గట్టుతెగిన చెరువు, 2015లో కెన్యా టు కెన్యా అను కథల సంకలనాలను వ్రాసినారు. ఓల్గా పుస్తకాలను కొన్ని అంగ్లంలోనికి అనువాదం చేసారు. అమెరికాలోని తెలుగు బాలబాలికలకు తెలుగు వ్రాయడం, చదవడం నేర్పించుచున్నారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

2017, మే-15న విడుదలైన ఐసెట్-2017 పరీక్షా ఫలితాలలో, తిమ్మనపాలెం గ్రామానికి చెందిన సాదినేని వెంకటేష్, జిల్లాలోనే ప్రథమస్థానం పొందినాడు. ఈ విద్యార్థి, రాష్ట్రస్థాయిలో 48వ స్థానంలో నిలిచాడు. ఇతని తల్లిదండ్రులు లక్ష్మి, శ్రీనివాసరావు.

• 2023, జూన్ 15న విడుదలైన ఆంధ్రప్రదేశ్ పిజీఈసెట్-2023 పరీక్షా ఫలితాలలో, తిమ్మనపాలెం గ్రామానికి చెందిన అన్నంగి మనోజ్ కుమార్,జిల్లాలోనే ప్రథమస్థానం పొందినాడు. ఈ విద్యార్థి రాష్ట్రస్థాయిలో 750వ స్థానంలో నిలిచాడు,ఈ విద్యార్థి తిమ్మనపాలెం ఆరివారి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు తెలుగు మీడియంలో విద్యను అభ్యసించడం విశేషం.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017

వెలుపలి లంకెలు

[మార్చు]