దుర్గం చిన్నయ్య
దుర్గం చిన్నయ్య | |||
దుర్గం చిన్నయ్య
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2014–2018, 2018–2023 | |||
నియోజకవర్గం | బెల్లంపల్లి, తెలంగాణ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 31 మే 1974 [1] | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | జయతార | ||
సంతానం | విహారిక, నిహారిక | ||
నివాసం | బెల్లంపల్లి, తెలంగాణ | ||
మతం | హిందూమతము |
దుర్గం చిన్నయ్య తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున బెల్లంపల్లి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]దుర్గo చిన్నయ్య 1974, మే 17న రాజం, మల్లక్క దంపతులకు తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా, నెన్నెల్ మండలం, జండావెంకటాపూర్ గ్రామంలో జన్మించాడు. దుర్గం చిన్నయ్యకు ఒక అన్న (బాలస్వామి), ఇద్దరు అక్కలు (రాజుబాయి, చిన్నక్క) ఉన్నారు. ఈయన వృత్తి వ్యవసాయం. తమ కుటుంబానికి ఉన్న ఐదెకరాల మామిడి తోట, రెండెకరాల పొలంలో వ్యవసాయ పనులు చేసేవాడు. దుర్గo చిన్నయ్య చదువంతా పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే జరిగింది. ఐదవ తరగతి వరకు స్వగ్రామంలో చదువుకున్న దుర్గం చిన్నయ్య, తరువాత పక్కనవున్న ఆవుడం గ్రామానికి రోజు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి పదవ తరగతి పూర్తిచేశాడు. ఆ తర్వాత మంచిర్యాలలో ఒక గదిని అద్దెకి తీసుకొని ఇంటర్మీడియెట్, డిగ్రీ (బి.ఏ) విద్యను పూర్తిచేసాడు.[3]
వివాహం - పిల్లలు
[మార్చు]చిన్నయ్యకు జయతారతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు (విహారిక, నిహారిక).[4]
రాజకీయ విశేషాలు
[మార్చు]ఎనిమిదో తరగతి చదువుకునే రోజుల్లోనే విప్లవోద్యమాల వైపు ఆకర్షితుడై పిడీఎస్‌యూలో చేరి చురుగ్గా పనిచేశాడు. ఆ సమయంలో జన్నారంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు హాజరయ్యాడు. అక్కడ న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత వేముపల్లి వెంకట్రామయ్యతో పరిచయం ఏర్పడింది. కొంతకాలం సికాసలో పనిచేశాడు. రెండు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసంలో కూడా ఉన్నాడు.
1995లో రాజకీయాల్లోకి వచ్చిన చిన్నయ్య, తెలుగుదేశం పార్టీ నుండి నెన్నెల్ జడ్పిటీసీగా, 2001లో ఎంపీపీగా, 2014లో ఎంపీటీసీగా గెలిచాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సిపిఐ పార్టీ అభ్యర్థి గుండా మల్లేష్ పై 52,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ పై 11,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]
సేవా కార్యక్రమాలు
[మార్చు]- నెన్నెల మండలం గుండ్లసోమారం గ్రామానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థికి మహారాష్ట్రలో ట్రిపుల్ ఐటీలో సీటు కోసం రూ.18,500 ఫీజుకు ఆర్థిక సహాయం అందించాడు.
- మంచిర్యాలకు చెందిన ఓ బీటెక్ విద్యార్థి రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉండగా కిడ్నీని అమర్చడానికి రూ.12 లక్షలు సీఎం రిలీఫ్‌ఫండ్ మంజూరు చేయించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (31 May 2021). "సీఎం కేసీఆర్‌ను కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే". Namasthe Telangana. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.
- ↑ దుర్గం చిన్నయ్య. "Durgam chinnaiah". myneta.info. Retrieved 30 April 2019.
- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Sakshi (12 May 2019). "మా ఆవిడే నా బలం: ఎమ్మెల్యే చిన్నయ్య". Sakshi. Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ దుర్గం చిన్నయ్య. "Durgam Chinnaiah". nocorruption.in. Retrieved 30 April 2019.
- ↑ దుర్గం చిన్నయ్య. "Durgam Chinnaiah Biography". beinglegends.com. Retrieved 30 April 2019.[permanent dead link]