దొంగ (సినిమా)
స్వరూపం
దొంగ,1985 మార్చి 14 విడుదలైన తెలుగు యాక్షన్ చిత్రం. విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత టీ. త్రివిక్రమ రావు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు ఏ.కోదండరామిరెడ్డి . చిరంజీవి, రాధ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి సమకూర్చారు. కమర్షియల్ గా విజయవంతమైన ఈ సినిమా తమిళంలో కొలై కరన్ కు డబ్బింగ్.
దొంగ (సినిమా) (1985 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
---|---|
తారాగణం | చిరంజీవి, రాధ , రావుగోపాలరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- చిరంజీవి
- రాధ
- కైకాల సత్యనారాయణ
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- నూతన్ ప్రసాద్
- గద్దె రాజేంద్ర ప్రసాద్
- శ్రీధర్
- రాజా
- పి.ఎల్.నారాయణ
- భీమేశ్వరరావు
- సిల్క్ స్మిత
- రాజ్యలక్ష్మి
- అన్నపూర్ణ
- మమత
- అత్తిలి లక్ష్మి
పాటల జాబితా
[మార్చు]- గొలీమార్ , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం..ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- సరిసరి, రచన:వేటూరి సుందర రామమూర్తి, గానం.శ్రీపతిపండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
- దొంగా దొంగా, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- అందమా అలా, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
- తప్పనకా, రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- ఇది పందెం, రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,ఎస్ జానకి.
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, సంభాషణ: పరుచూరి సోదరులు
- సంగీతం: కె. చక్రవర్తి
- నిర్మాత: త్రివిక్రమ రావు
- దర్శకత్వం:ఏ. కోదండరామి రెడ్డి
ప్రత్యేకతలు
[మార్చు]ఈ చిత్రంలో గోలి మార్ పాటకి మైఖేల్ జాక్సన్ రూపొందంచిన థ్రిల్లర్ ఆల్బం మూలం. ఈ పాటల్లో చిరు, జాక్సన్ నాట్య భంగిమలు, వేషధారణలలో చాలా సామ్యం కనబడుతుంది. ఈ పాటని చూసిన ల్యాటిన అమెరికా, ఐరోపా వాసులు చిరుని ఇండియన్ జాక్సన్‌గా వ్యవహరించటం మొదలు పెట్టారు ( అదే విధంగా ఈ పాట ద్వారా తెలుగులో పేరుపొందినా ఇతర ప్రాంతాలలో యూట్యూబు, మరికొన్ని వెబ్ సైట్ల ద్వారా ఎన్నో వ్యంగమైన కామెంట్లు, విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు).
బయటి లింకులు
[మార్చు]- [1] గోలీమార్ పై పాశ్చాత్యులు నిర్మించుకొన్న ఆర్కుట్ కమ్యూనిటీ
- [2] సబ్ టైటిళ్ళతో పాశ్చాత్యులు రూపొందించుకొన్న గోలీమార్ వీడియో
- [3], [4] గోలీమార్ మంత్రాన్ని జపిస్తున్న ల్యాటిన్ యువతులు
- [5] ఈశాన్య దేశాలలోనూ గోలీమార్ మాయ