Jump to content

పెద్దపులిపాక

అక్షాంశ రేఖాంశాలు: 16°27′29.700″N 80°41′5.280″E / 16.45825000°N 80.68480000°E / 16.45825000; 80.68480000
వికీపీడియా నుండి
పెద్దపులిపాక
పటం
పెద్దపులిపాక is located in ఆంధ్రప్రదేశ్
పెద్దపులిపాక
పెద్దపులిపాక
అక్షాంశ రేఖాంశాలు: 16°27′29.700″N 80°41′5.280″E / 16.45825000°N 80.68480000°E / 16.45825000; 80.68480000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకృష్ణా
మండలంపెనమలూరు
విస్తీర్ణం9.69 కి.మీ2 (3.74 చ. మై)
జనాభా
 (2011)
2,571
 • జనసాంద్రత270/కి.మీ2 (690/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,290
 • స్త్రీలు1,281
 • లింగ నిష్పత్తి993
 • నివాసాలు750
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521134
2011 జనగణన కోడ్589504

పెద్దపులిపాక, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలానికి చెందిన గ్రామం.[2] ఇది సముద్రమట్టంనుండి 19 మీ.ఎత్తులో ఉంది.ఇది మండల కేంద్రమైన పెనమలూరు నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 750 ఇళ్లతో, 2571 జనాభాతో 969 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1290, ఆడవారి సంఖ్య 1281. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 691 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 36. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589504[3] ఈ గ్రామాన్ని "పులిపాక" అని గూడా అంటారు.

సమీప గ్రామాలు

[మార్చు]

చలసాని నగర్ 2కి.మీ, పోరంకి 2 కి.మీ, అశోక్ నగర్ 2 కి.మీ, కృష్ణలంక 2 కి.మీ

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి.బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు యనమలకుదురులో ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల విజయవాడలో ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల కానూరులోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు విజయవాడలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడలో ఉన్నాయి.

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యయులు సి.హెచ్.వెంకటనారాయణ ఎంతగానో కృషిచేస్తున్నారు. ఇతని కృషి వలన ఈ పాఠశాల విద్యార్థుల సంఖ్య 4 సంవత్సరాలలో 30 నుండి 130 కి పెరగటమే ఇందుకు నిదర్శనం. [9]

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

పెదపులిపాకలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

పెదపులిపాకలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 8 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

పెదపులిపాకలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 43 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 384 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 4 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 26 హెక్టార్లు
  • బంజరు భూమి: 22 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 488 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 57 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 480 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

పెదపులిపాకలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 194 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 242 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 43 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

పెదపులిపాకలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, చెరకు, పసుపు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

సూరప్ప చెరువు:- పెదపులిపాక, చోడవరం, పెనమలూరు గ్రామాల మధ్య ఉన్న ఈ చెరువు 9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. [2]

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామానికి 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో పులిపాక ఇర్మియ సర్పంచిగా గెలుపొందింది.ఉప సర్పంచిగా ఇబ్రహీం ఎన్నికైనాడు. [3]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ పరివార ప్రయుక్త కోదండరామాలయం

[మార్చు]

ఈ ఆలయం శిథిలావస్థకు చేరటంతో, గ్రామస్థుల రు. 60 లక్షల విరాళంతో, నూతన ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయ, శిఖరధ్వజ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు, 2014, జూన్-5,6,7 తేదీలలో నిర్వహించారు. ఈ మూడురోజులూ జరిగిన అధ్యాత్మిక కార్యక్రమాలలో, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2014, జూన్-7వ తేదీ శనివారం నాడు, వేదపండితులు నిర్ణయించిన శుభముహూర్తం, ఉదయం 8-45 గంటలకు విమానశిఖర, జీవధ్వజ, శ్రీ వినాయక, శ్రీ భక్తాంజనేయ, ద్వారపాలకా సహిత శ్రీ కోదండరామస్వామివార్ల శిలా విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భాన్ని కనులారా వీక్షించదానికి, గ్రామంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. ధ్వజస్తంభం పునాదులలో పసుపు, కుంకుమ, బంగారం, వెండి, చిల్లర నాణ్యాలు నింపటానికి భక్తులు పోటీ పడినారు. అనంతరం ఆలయ మండపంలో శ్రీ సీతారాముల శాంతికల్యాణం జరిపినారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు. [6]

ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు, 2015, మే-27వ తేదీనాడు వైభవంగా నిర్వహించారు. [8]

శ్రీ విజయరాజరాజేశ్వరీ శ్రీ విద్యాపీఠం

[మార్చు]
  1. ఈ గ్రామంలోని శ్రీ విజయరాజరాజేశ్వరీ శ్రీ విద్యాపీఠంలో, 2013 నవంబరు 16,17,18వ తేదీలలో శ్రీ మహాపాశుపత మృత్యుంజయ రుద్రహోమం నిర్వహించెదరు. ఆలయ నిర్మాణం 6నెలలలో పూర్తి చేసెదరు. [4]
  2. ఈ ఆలయంలో శ్రీ విజయరాజరాజేశ్వరీదేవి విగ్రహప్రతిష్ఠా మాహాకుంభాభిషేకాలు, 2016, ఫిబ్రవరి-21,22 తేదీలలో (మాఘశుద్ధ చతుర్దశి, పౌర్ణమి ఆది, సోమవారాలలో) వైభవోపేతంగా నిర్వహించారు. [10]
  3. శ్రీ విజయరాజరాజేశ్వరీదేవి ఆలయ ప్రథమ వార్షికోత్సవం 2017, ఫిబ్రవరి-21వతేదీ మంగళవారం నుండి 25వతేదీ శనివారం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా 21న, 108 కలశాలతో పూజ, హనుమాన్‌చాలీసా పారాయణం, శ్రీ లక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. [11]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు.

గ్రామ విశేషాలు

[మార్చు]
  1. పెదపులిపాక గ్రామానికి చెందిన ముసునూరి బ్రహ్మేశ్వరరావు, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రాష్ట్రమంతటికీ కలిపి ఉన్న ఒకే ఒక సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సీటుని కైవసం చేసుకున్నారు. [2]
  2. పెదపులిపాక గ్రామంలో రు. 7.35 లక్షా వ్యయంతో నూతనంగా నిర్మించిన మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం భవనాన్ని, 2014, మార్చి-31న ప్రారంభించారు. ఈ భవన నిర్మానానికి రు. 2.85 లక్షల వ్యయాన్ని సంఘం భరించగా, మిగిలిన రు. 4.5 లక్షలనూ, ఈ గ్రామానికి చెందిన దాత శ్రీ ముసునూరి శ్రీనివాసరావు, తమ తండ్రి వరప్రసాద్ ఙాపకార్ధం, విరాళంగా అందజేశారు. [5]
  3. ఈ గ్రామంలోని తెల్ల రేషన్ కార్డుదారులందరూ ఎన్.టి.ఆర్ వైద్యసేవ పరిధిలోనికి వచ్చారు. ఉద్యోగులు సహా మరికొందరు ఆరోగ్య సంరక్షణ పథకం పరిధిలోనికి వచ్చారు. ఈ గ్రామంలో ఇంకా మిగిలిపోయిన 240 కుటుంబాలకు, మేడి మాధవి అను అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రురాలు, తన స్వంత గ్రామానికి ఆరోగ్య భరోసా కలిపించాలనే ఉద్దేశంతో, ఆరోగ్య రక్ష బీమా ప్రీమియం డబ్బులను చెల్లించారు. ఈ పథకం వలన, వీరందరికీ వేయి రకాల వ్యాధులకు, రాష్ట్రంలోని 432 కార్పొరేట్ ఆసుపత్రులలోనూ 80 ప్రభుత్వ ఆసుపత్రులలోనూ వైద్యం పొందేటందుకు అవకాశం కలుగుతుంది. దీనితో రాష్ట్రంలోనే అందరికీ ఆరోగ్య భరోసా బీమా ఉన్న తొలి గ్రామఘా చరిత్రకెక్కినది. [12]

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2442. ఇందులో పురుషుల సంఖ్య 1221, స్త్రీల సంఖ్య 1221, గ్రామంలో నివాస గృహాలు 625 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 969 హెక్టారులు.

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Villages & Towns in Penamaluru Mandal of Krishna, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-05-09.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]

[2] ఈనాడు ప్రధానసంచిక; 2012, జూన్-22; 5వపేజీ. [3] ఈనాడు కృష్ణా/పెనమలూరు; 2013, ఆగస్టు-13; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/పెనమలూరు, 2013, నవంబరు-15; 1వపేజీ. [5] ఈనాడు విజయవాడ; 2014, ఏప్రిల్-1; 3వపేజీ. [6] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, జూన్-8; 9వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015, మే-13; 21వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015, మే-28; 21వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-11; 31వపేజీ. [10] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-22; 10వపేజీ. [11] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017, ఫిబ్రవరి-20; 1వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2017, ఏప్రిల్-15; 10వపేజీ.