నిఖిల్ సిద్ధార్థ: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
| deathplace = |
| deathplace = |
||
| birthname = నిఖిల్ సిద్దార్థ్ |
| birthname = నిఖిల్ సిద్దార్థ్ |
||
| othername = " |
| othername = "బేగంపేట బోయ్" |
||
| homepage = |
| homepage = |
||
| notable role = [[హ్యాపీ డేస్]] <br /> [[యువత]] <br /> [[స్వామిరారా]] |
| notable role = [[హ్యాపీ డేస్]] <br /> [[యువత]] <br /> [[స్వామిరారా]] |
||
పంక్తి 22: | పంక్తి 22: | ||
==జీవిత విశేషాలు== |
==జీవిత విశేషాలు== |
||
నిఖిల్ హైదరాబాద్ లో బేగంపేటలో [[జూన్ 1]] [[1985]] న జన్మించాడు. [[బేగంపేట]] [[హైదరబాద్ పబ్లిక్ స్కూల్]] లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా " |
నిఖిల్ హైదరాబాద్ లో బేగంపేటలో [[జూన్ 1]] [[1985]] న జన్మించాడు. [[బేగంపేట]] [[హైదరబాద్ పబ్లిక్ స్కూల్]] లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బేగంపేట బోయ్"గా చెప్పుకొనేవాడు.<ref>http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms</ref> ఇతడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ లో చదువుకున్నాడు<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms]</ref>. |
||
== సినీరంగ ప్రస్థానం == |
== సినీరంగ ప్రస్థానం == |
17:52, 2 మే 2019 నాటి కూర్పు
నిఖిల్ సిద్దార్థ్ | |
నిఖిల్ సిద్దార్థ్ | |
జన్మ నామం | నిఖిల్ సిద్దార్థ్ |
జననం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం | 1985 జూన్ 1
ఇతర పేర్లు | "బేగంపేట బోయ్" |
ప్రముఖ పాత్రలు | హ్యాపీ డేస్ యువత స్వామిరారా |
నిఖిల్ సిద్దార్థ్ ఒక తెలుగు సినీ నటుడు. హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు.
నేపధ్యము
హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. హ్యాపీ డేస్ చిత్రంలో నటించకముందు పలుచిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు.[1]
జీవిత విశేషాలు
నిఖిల్ హైదరాబాద్ లో బేగంపేటలో జూన్ 1 1985 న జన్మించాడు. బేగంపేట హైదరబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. పాఠశాలలో అతడు తనకు తానుగా "బేగంపేట బోయ్"గా చెప్పుకొనేవాడు.[2] ఇతడు "ముఫాఖం ఝా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ" హైదరాబాద్ లో చదువుకున్నాడు[3].
సినీరంగ ప్రస్థానం
నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.[4] హాపీడేస్ చిత్రంలో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశాడు. ఈ "హాపీ డేస్" చిత్రం భారతదేశంలో విడుదల కంటే ముందుగా టాలీవుడ్లో విడుదలైన మొదటి చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించాడు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది[5]. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీడేస్ చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్. యువత మరియు వీడు తేడా చిత్రాలలో నటించాడు.[6] అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఆడాయి.[7]
నటించిన చిత్రాలు
సంవత్సరం | చిత్రం | పాత్ర | వివరాలు |
---|---|---|---|
2003 | సంబరం | చిన్న పాత్ర | |
2006 | హైదరాబాద్ నవాబ్స్ | అతిథి పాత్ర[8] | |
2007 | హ్యాపీ డేస్ | రాజేష్ | |
2008 | అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్ | అంకిత్ | |
యువత | బాబు | ||
2010 | కళావర్ కింగ్ | రాజేష్ | |
ఓం శాంతి | తేజా | ||
ఆలస్యం అమృతం | రామ్ | ||
2011 | వీడు తేడా | 'కత్తి' శీను | |
2012 | డిస్కో | దిస్కో | |
2013 | స్వామిరారా[9][10] | సూర్య | |
2014 | కార్తికేయ (సినిమా) | కార్తికేయ కుమారస్వామి | |
2015 | సూర్యా వర్సెస్ సూర్యా | సూర్య | |
2015 | శంకరాభరణం | గౌతం | |
2016 | ఎక్కడికి పోతావు చిన్నవాడా | అర్జున్ | |
2017 | కేశవ | కేశవ | |
2018 | కిరాక్ పార్టీ | కృష్ణ | కన్నడ చిత్రం కిరిక్ పార్టి పునర్నిర్మాణం |
బయటి లంకెలు
మూలాలు
- ↑ నమస్తే తెలంగాణ, ఆదివారం. "పరాజయాలే నా గాడ్‌ఫాదర్స్". Archived from the original on 2 May 2019. Retrieved 2 May 2019.
- ↑ http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/I-am-a-very-conventional-Telugu-boy-Nikhil/articleshow/19494511.cms
- ↑ [1]
- ↑ ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
- ↑ Nikhil (Happy days) interview - Telugu cinema actor
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-తారలతో ముచ్చట్లు (26 November 2016). "ఆ ప్రత్యేకతే నన్ను నిలబెట్టింది: నిఖిల్". Retrieved 2 May 2019.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ The Hindu Business Line : Small films hold their own in Telugu film industry
- ↑ http://www.youtube.com/watch?v=fDk6wyuQsGE
- ↑ http://timesofap.com/cinema/swamy-ra-ra-movie-first-look/
- ↑ http://www.tollywoodandhra.in/news/movie-news/swamy-ra-ra-movie-first-look/