ప్రేమనగర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమనగర్
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.ప్రకాశరావు
నిర్మాణం డి. రామానాయుడు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కైకాల సత్యనారాయణ,
రాజబాబు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ సురేష్ మూవీస్
పంపిణీ సురేష్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ సెప్టెంబరు 24, 1971
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రేమ్ నగర్ లేదా ప్రేమనగర్, 1971లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ప్రఖ్యాత రచయిత్రి అరికెపూడి కౌసల్యాదేవి (కోడూరి కౌసల్యాదేవి) వ్రాసిన నవల ఆధారంగా ఈ సినిమా నిర్మింపబడింది. అత్యంత విజయనంతమైన తెలుగు నవలాచిత్రాలలో ఇది ఒకటి. అంతకు ముందు కొన్ని సినిమాలలో నష్టాలనెదుర్కొన్న డి.రామానాయుడు ఈ సినిమాతో నిర్మాతగా సినీరంగంలో నిలద్రొక్కుకున్నాడు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తమిళం, హిందీలలో కూడా పునర్నిర్మించారు.

కథా సంగ్రహం

[మార్చు]

కళ్యాణ్ (అక్కినేని) అనే జమీందారు కొడుకు విలాసనంతమైన జీవితానికి, దురలవాట్లకు బానిసయ్యాడు. ఎయిర్-హోస్టెస్‌గా పరిచయమైన లత (వాణిశ్రీ) వారింట్లో సెక్రటరీగా చేరుతుంది. అభిమానవతి అయిన ఆమె క్రమంగా కళ్యాణ్‌ను నిలకడైన జీవనవిధానంవైపు మళ్ళిస్తుంది. ఆమెపట్ల ఆకర్షితుడైన కళ్యాణ్ ఆమెను వివాహం చేసుకోవాలనుకోగా కుటుంబంనుండి ప్రతిఘటన ఎదురవుతుంది. అలా విడిపోయిన వారు తిరిగి కలుసుకొంటారు.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాలో పాటలు తెలుగు చలన చిత్రరంగంలో ఆల్-టైమ్ హిట్లు అయిన పాటల జాబితాలో చేరుతాయి.

పాట రచయిత సంగీతం గాయకులు
ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీదేశం పోరా కె.వి.మహదేవన్ పి.సుశీల
ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్యనందనం ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
ఎవరో రావాలీ, ఈ వీణను కదిలించాలలీ కె.వి.మహదేవన్ పి.సుశీల
కడవెత్తుకొచ్చిందీ కన్నెపిల్లా అది కనబడితే చాలు నా గుండె గుల్లా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
నీకోసం వెలిసిందీ ప్రేమమందిరం - నీకోసం విరిసిందీ హృదయనందనం ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
నేను పుట్టాను లోకం మెచ్చింది నేను ఏడ్చాను లోకం నవ్వింది ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
మనసు గతి యింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదింతే ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
లేలేలే లేలేలే నా రాజా... లేవనంటావా నన్ను లేపమంటావా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల ఎల్.ఆర్.ఈశ్వరి

పద్యాలు

[మార్చు]

ఈ సినిమాలో రెండు సందేశాత్మకమైన పద్యాలు కూడా ఉన్నాయి:

  1. అంతములేని ఈ భువనమంత విశాలమగు పాంథశాల... (దువ్వూరి రామిరెడ్డి 'పానశాల'లోనిది) (గానం: ఘంటసాల)
  2. కలడందురు దీనులయెడ... (పోతన 'భాగవతం'లోనిది) (గానం: పి.సుశేల)

వెలుపలి లింకులు

[మార్చు]

வசந்த மாளிகை

మూలాలు

[మార్చు]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • ప్రేమనగర్-మూలకథ ఆధారం: (కోడూరి)ఆరెకపూడి కౌసల్యాదేవి నవల - ప్రేమనగర్;మాటలు,పాటలు:ఆచార్య ఆత్రేయ