బేరియం టైటనేట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేరియం టైటనేట్
Barium titanate ceramics in plastic package
Polycrystalline BaTiO3 in plastic
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [12047-27-7]
పబ్ కెమ్ 6101006
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య XR1437333
SMILES [Ba+2].[Ba+2].[O-][Ti]([O-])([O-])[O-]
  • InChI=1/2Ba.4O.Ti/q2*+2;4*-1;/r2Ba.O4Ti/c;;1-5(2,3)4/q2*+2;-4

ధర్మములు
BaTiO3
మోలార్ ద్రవ్యరాశి 233.192 g
స్వరూపం white crystals
వాసన odorless
సాంద్రత 6.02 g/cm3, solid
ద్రవీభవన స్థానం 1,625 °C (2,957 °F; 1,898 K)
insoluble
ద్రావణీయత slightly soluble in dilute mineral acids; dissolves in concentrated hydrofluoric acid
Band gap 3.2 eV (300 K, single crystal)[1]
వక్రీభవన గుణకం (nD) no2.412; ne=2.360[2]
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
Tetragonal, tP5
P4mm, No. 99
ప్రమాదాలు
R-పదబంధాలు మూస:R20/22
S-పదబంధాలు S28A, S37, and S45
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references
Scanning transmission electron microscopy of the ferroelastic domains that form in BaTiO3 on cooling through the Curie temperature. The vertex point, where domain bundles meet, moves from the center in isometric crystals (top) to off-center in oblongs (bottom).[3]

బేరియం టైటనేట్ ఒకరసాయనిక సమ్మేళన పదార్థం. ఇది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం. బేరియం టైటనేట్ పోటో రిఫ్రాక్టివ్ ఎఫెక్ట్ (photorefractive effect), పైజో ఎలిక్ట్రిక్ (piezoelectric) గుణాలను కలిగిన ఫెర్రోఎలెక్ట్రిక్ సెరామిక్ పదార్థం. రసాయన ఫార్ములా BaTiO3.

భౌతిక ధర్మాలు

[మార్చు]

పుడి రూపంలో బేరియం టైటనేట్ తెల్లని స్పటికాలుగా ఉండును.పెద్ద స్పటికాలుగా ఉన్నప్పుడుఅయినచో పారదర్శకంగా ఉండును. బేరియం టైటనేట్ వాసన కలిగి ఉండదు. బేరియం టైటనేట్ యొక్క అణుభారం 233.192 గ్రాములు/మోల్. ఈ అకర్బన సమ్మేళనం యొక్క సాంద్రత 6.02 గ్రాములు/సెం.మీ3. బేరియం టైటనేట్ యొక్క ద్రవీభవన స్థానం 1,625 °C (2,957 °F; 1,898 K).బేరియం టైటనేట్ నీటిలో కరుగదు.అయితే ఈ సమ్మేళన పదార్థం ఖనిజ ఆమ్లాలలో స్వల్పంగా కరుగును. గాఢ హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లంలో బేరియం టైటనేట్ కరుగును. గది ఉష్ణోగ్రత వద్ద దీనిక్యురీ పాయింట్ (curie point)120 °C.బేరియం టైటనేట్ యొక్క స్పాంటోనియాస్ పొలరిజేసన్ 0.15 C/m2.

బేరియం టైటనేట్ అణువు సౌష్టవం

[మార్చు]
BaTiO3యొక్క ఘనాణుసౌష్టవం.ఎరుపు గోళాలు ఆక్సైడ్ కేంద్రాలు, నీలంరంగువి Ti4+కేటాయనులు, ఆకుపచ్చ గోళాలు Ba2+.

బేరియం టైటనేట్‌ యొక్క అణుసౌష్టవం ఉష్ణోగ్రత ఎక్కువ, తక్కువ ననుసరించి 5 స్థాయిలలో ఉండును. ఎక్కువ ఉష్ణోగ్రత నుండి ఉష్ణోగ్రత తగ్గే కొలది క్రమానుగతంగా మొదట షడ్భుజి, ఘనాకృతి, చతుష్కోణ, స్పష్ట సమచతుర్భుజాకార, rhombohedral స్పటిక స్థితులలో ఉండును. ఈ 5 స్థితి లేదా స్థాయిలలో ఘనాకృతి స్థాయి మినహా మిగతా స్థితులలో బేరియం టైటనేట్ ఫెర్రో ఎలెక్ర్టిక్ స్వభావం కలిగి ఉండును. ఘనాకృతి స్థాయి అణువులో Ba2+ ఘనంలో కేంద్ర భాగంలో ఉండి సమన్వయ సంఖ్యను 12 గా కలిగి ఉండును.

ఉత్పత్తి-ఇతర ధర్మాలు

[మార్చు]

బేరియం కార్బొనేట్, టైటానియం డై ఆక్సైడ్ల మిశ్రమాన్ని కరిగేంతవరకు వేడి చేయడం వలన బేరియం టైటనేట్ ఏర్పడును.బేరియం టైటనేట్ తో నైట్రోజన్ ట్రైక్లోరైడ్ చర్యవలన పచ్చని లేదా బూడిద రంగు మిశ్రమ ము ఏర్పడును.ఈ మిశ్రమ పదార్థం ఫెర్రో ఎలక్ట్రిక్ ధర్మాలు కలిగి యుండును. బేరియం టైటనేట్ స్వరూపశాస్త్రంపై పలు విస్తృత శోధనలు జరిగాయి.

తగరానికి బేరియం టైటనేట్ కలిపిన ఏర్పర్చిన మిశ్రమమునకు విస్కో ఎలాస్టిక్ స్టిప్నెస్ వజ్రం కన్న ఎక్కువ ఉండును.బేరియం టైటనేట్ రెండు రకాల పరివర్తన దశలను పొందును. తత్ఫలితంగా ఘనపరిమాణం, స్పటిక పరిమాణంలో మార్పులు ఏర్పడును.మామూలు క్లాసిక్ వే బేరియం టైటనేట్ కంటే నానో క్రిష్ట లైన్ బేరియం టైటనేట్ 40% ఎక్కువ పెర్మిట్‌టివిటి (permittivity) కలిగి ఉండును.

చాలా ఆక్సైడు లవలె బేరియం టైటనేట్ కుడా నీటిలో కరుగదు. అయితే సల్ఫ్యూరిక్ ఆమ్ల దాడికి లోనవుతుంది. బేరియం టైటనేట్ యొక్క బల్క్ రూమ్ టెంపరేచర్ బాండ్ గ్యాప్ 3.2 eV, అయితే పార్టికిల్ సైజును 15 నుండి 7 nmకు తగ్గించిన, బ్యాండ్ గ్యాప్ విలువ ~3.5 eV కు పెరుగుతుంది.

ఉపయోగాలు

[మార్చు]
  • బేరియం టైటనేట్ విద్యున్నిరోధకమైన (విద్యు ద్వాహకం కాని) సంయోగ పదార్థం కావున, దీనిని సెరామిక్ ను విద్యుత్తు కేపాసిటరులో ఉపయోగిస్తారు.
  • మైక్రో ఫోనులలో, ట్రాన్సుడ్యుసర్ (transducers) లలో పైజో ఎలిక్ట్రిక్ పదార్థంగా ఉపయోగిస్తారు.
  • బేరియం టైటనేట్ పైజోఎలెక్ట్రిక్ పదార్థంగా, లెడ్‌ జిర్కొనేట్ టైటానేట్ రిప్లేస్ చెయ్యబడింది. పా క్రిష్టలైన్ బేరియం టైటనేట్ యొక్క టెంపరేచర్ కొ ఎఫిసియెంట్ వలన థెర్మిస్టర్‌లు, సెల్ఫ్ రెగ్యు లేటింగ్ ఎలెక్ట్రిక్ హిటింగ్ పరికరాలలో వాడుటకు ఉపయుక్తత కలిగి యున్నది.
  • నాన్ లీనియర్ ఆప్టిక్స్ లో కూడా బేరియం టైటనేట్ స్పటికాలు ఉపయోగించుటకు అనుకూలం.
  • బేరియం టైటనేట్ కు ఉన్న పైరో ఎలెక్ట్రిక్, ఫెర్రో ఎలెక్ట్రిక్ ధర్మాల కారణంగా, దీనిని థెర్మల్ కెమారాలలో అన్ కూల్డ్ సెన్సర్ తయారు చేయుదురు.

ఇవికూడా చూడండి

[మార్చు]

బేరియం

మూలాలు

[మార్చు]
  1. Keigo Suzuki and Kazunori Kijima (2005). "Optical Band Gap of Barium Titanate Nanoparticles Prepared by RF-plasma Chemical Vapor Deposition". Jpn. J. Appl. Phys. 44: 2081–2082. doi:10.1143/JJAP.44.2081.
  2. Tong, Xingcun Colin (2013). Advanced Materials for Integrated Optical Waveguides. Springer Science & Business Media. p. 357. ISBN 978-3-319-01550-7.
  3. doi:10.1088/1468-6996/16/3/036001
    This citation will be automatically completed in the next few minutes. You can jump the queue or expand by hand