భారతదేశంలో పర్యాటకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాతితో నిర్మాణం అయిన రథం - హంపి , కర్ణాటక

పర్యాటకరంగం ప్రపంచ దేశాలలో ఆర్థిక ప్రగతికి, ఉద్యోగ అవకాశాలకు ఒక సాధనం. పర్యాటకం దేశ,విదేశీయులకు విజ్ఞానం, వినోదం అందించడంతో బాటు స్థానిక ప్రాంతాల ప్రగతికి తోడ్పడుతుంది. భారతదేశం వినోదానికి, ఆహ్లదానికి ఒక ప్రముఖ కేంద్రం గా మారుతున్నది. భారతదేశ ప్రాచీన వారసత్వ సంపద, సంస్కృతీ సాంప్రదాయాలు కొనసాగుతూ రావడమే ముఖ్య కారణం గా భావించవచ్చు. ఒక అంచనా ప్రకారం 1997 సంవత్సరంలో లో భారతదేశానికి  23 లక్షల 74 వేల 094 మంది విదేశీ పర్యాటకుల వచ్చినారని, వారి  ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్యం కేవలం 10వేల 511 కోట్లు. 2019 సంవత్సరం వచ్చే నాటికి ఒక కోటి 90వేల మంది వస్తే, వీరి ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్యం 2 లక్షల 11వేల కోట్లు రావడం జరిగింది. 2028 సంవత్సరం వరకు 3  కోట్ల మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశ పర్యటనకు వస్తారని అంచనా  వేయడం జరుగుతున్నది. ప్రపంచంలో అత్యంత సుందరమైన దేశాలలో భారతదేశానికి  7వ స్థానం లభించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన దాని ప్రకారం "ది 50 మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్‌" సర్వేలో పర్యాటకులు భారతదేశానికి  7వ స్థానం ఇచ్చారు[1].

చరిత్ర

[మార్చు]

పురాతన ఈజిప్షియన్, గ్రీకు, రోమన్ నాగరికతలలో ఆనందం కోసం ఇతర ప్రదేశాలకు ప్రయాణించే భావన ఉనికిలో ఉంది,  దీనిని బట్టి చుస్తే,  పర్యాటకం  వేలాది సంవత్సరాలుగా ఉన్నదని తెలుస్తున్నది. మొదట్లో ప్రజల ప్రయాణం ప్రధానంగా గుర్రంపై లేదా పడవలను ఉపయోగించి జరిగింది. అప్పటి సమాజంలో పర్యాటకం అత్యంత సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండేది. శతాబ్దాలు గడిచేకొద్దీ క్రమంగా మారడం ప్రారంభించింది. ప్రస్తుత ఆధునిక పర్యాటకం  పారిశ్రామిక విప్లవం గా గుర్తించబడుతుంది, మొట్ట మొదలు "పర్యాటకం విశ్రాంతి కోసం" ప్రజల ఆలోచన లోనికి వచ్చిన దేశం బ్రిటిష్. నేడు, పర్యాటకం అనే భావన అనేక సంస్కృతులలో దృఢంగా స్థిరపడింది[2].

భారతదేశంలో పర్యాటకం

[మార్చు]
ప్రతాప్ గఢ్ కోట సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ఉన్న ముందు దృశ్యం. మరాఠా సామ్రాజ్యం మొదటి చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ దీనిని నిర్మించాడు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో ఈ కోట ఉంది. కోట కట్టడం నల్లరాయి, సుద్ద మొదలైన వాటితో తయారు చేయబడింది.
అండమాన్ సముద్రం, హావ్లాక్ ద్వీపం, అండమాన్ దీవులు.

భారతదేశ విస్తీర్ణత 3,287,263 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో, ఉత్తరాన మంచుతో హిమాలయ పర్వతాల  నుండి దక్షిణాన ఉష్ణమండల వర్షపు అడవుల వరకు విస్తరించిన భారతదేశం గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని కలిగి  ఉన్న దేశం. పర్యావరణంలో వైవిధ్యం, భూభాగాలు, ప్రకృతి అందాల ప్రదేశాలు దేశవ్యాప్తంగా వ్యాపించి, పర్యాటక రంగం  సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడానికి గణనీయమైన అవకాశాముతో ఉన్నది. భారత దేశం లోని  ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలు టూరిస్ట్ సర్క్యూట్లను అభివృద్ధి చేయడం, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు యాత్రికులకు మౌలిక సదుపాయాలను పెంచడంతో ఆధ్యాత్మిక పర్యాటకంలో పెట్టుబడులను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రయాణ గమ్యస్థానాలలో ఒకటిగా ఉండి, భారతదేశంలో సేవల రంగంలో అభివృద్ధికి భారతీయ పర్యాటక, ఆతిథ్య పరిశ్రమ రంగంలో ఒకటిగా అవతరించింది. ఇతర దేశాల మాదిరిగానే భారతదేశంలో పర్యాటక రంగం విదేశీ మారకద్రవ్యానికి ముఖ్యమైన వనరుగా ఉన్నందున భారతదేశంలో పర్యాటక పరిశ్రమ గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. అనేక దేశాలలో పర్యాటక రంగం విదేశీ మారక లాభాలకు గణనీయమైన వనరు అని  అంగీకరించబడింది[3].

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]
తాజ్ మహల్, ఆగ్రా, భారతదేశం

భారతదేశం ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించే దేశం, ప్రపంచంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా ఉండి, సందర్శకులు సహజ సౌందర్యం, సాంస్కృతిక వారసత్వానికి ఆకర్షితులవుతారు. ఇందులో తాజ్ మహల్, గోల్డెన్ టెంపుల్, ఎర్రకోట వంటి అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో పర్యాటకం దేశ ప్రజలకు సామాజిక-ఆర్థిక అభివృద్ధిని తీసుకురావడానికి ఒక ప్రధాన సాధనంగా భావించబడినది. భారతదేశ పర్యాటక పరిశ్రమ ఇటీవలి సంవత్సరాలలో స్థిరంగా అభివృద్ధి చెందింది. భారతదేశానికి వచ్చే పర్యాటకుల కోసం హోటళ్లు, రిసార్టులు, ఫుడ్ జాయింట్లు, అనేక ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షిండానికి, ప్రోత్సహించడానికి, ప్రభుత్వం అనేక ప్రచారాలు, పథకాలను అమలు చేస్తోంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి ఇన్ క్రెడిబుల్ ఇండియా క్యాంపెయిన్ తో పాటు ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్, డెస్టినేషన్ ఇండియా ఎగ్జిబిషన్స్ ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఇండియన్ కల్చరల్ ఫెస్టివల్స్ వంటి అనేక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.భారతదేశం యోగా, ధ్యానానికి కూడా ప్రసిద్ది చెందింది. మంచుతో కప్పబడిన హిమాలయాల నుండి గోవాలోని ఉష్ణమండల బీచ్ ల వరకు, అస్సాం వన్యప్రాణుల నుండి కేరళలోని అతిపెద్ద తేయాకు మైదానం వరకు, ఈ దేశంలోని ప్రతి మూలలో ఏదో ఒక కొత్తదనం ఉంది. అంతేకాక, ముంబై, బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలు ప్రపంచవ్యాప్తంగా వాయు, రోడ్డు రైలు ప్రయాణ సాధనాల ద్వారా అనుసంధానించబడి ఉన్నందున, భారతదేశంలోని కొన్ని అత్యంత సుందర ప్రదేశాలను అన్వేషించడం సులభం. భారతదేశములోని ప్రాంతాలను ఉత్తర, పశ్చిమ, దక్షిణ,తూర్పు అనే నాలుగు విభిన్న ప్రాంతాలుగా విభజించవచ్చు. భారతదేశం వైవిధ్యమైన దేశం,అనేక విభిన్న ప్రకృతి దృశ్యాలను కలిగి ఉంది. చుట్టూ చల్లని పర్వతాలు, పొడి ఎడారులు, విశాలమైన మైదానాలు, వేడి, తేమతో కూడిన పీఠభూములు విస్తారమైన బీచ్ లు, ఉష్ణమండల ద్వీపాలతో ఒక అందమైన గమ్యస్థానం. ప్రతి ఒక్కరికీ, అన్ని రకాల పర్యాటకులకు ఏదో ఒకటి అందించే దేశం. పర్యాటకులకు సులభంగా,తక్కువ ధరలతో ఉండటం వల్ల న్ని ఆసియాలో అత్యంత డిమాండ్ ఉన్న పర్యాటక ప్రదేశాలలో భారతదేశం ఒకటిగా అయినది. దేశంలోని రాజభవనాలు, అన్యదేశ వన్యప్రాణులు, ద్వీపాలు ప్రతి ప్రాంతం ప్రత్యేక ఆకర్షణలతో ఉంటుంది[4].

భారత దేశం లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి.  అందులో ప్రసిద్ధమైనవిగా చెప్పుకునే ప్రదేశాలు కొన్ని అందులో ఢిల్లీ, ఆగ్రా, సిమ్లా, మనాలి, కూర్గ్, ఊటీ, మన్నార్, గోవా, పాండిచ్చేరి, నైనిటాల్, మహాబలేశ్వర్, ఉదయపూర్, ద్వారక, సోమనాథ్, మదురై, అజంతా గుహాలు, గ్యాంగ్ టక్, డార్జిలింగ్ అత్యంత ప్రసిద్ధ ప్రదేశాలుగా పేర్కొనవచ్చును. దేశవ్యాప్తంగా అనేక రకాలుగా మంచి పర్యాటక ప్రదేశాలు ఉన్నప్పటికీ.. తాజ్ మహల్, రాజస్థాన్, కేరళ, గోవా, వారణాసి, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రముఖ ప్రదేశాలు ముందు స్థానంలో ఉన్నాయి. శ్రీనగర్ లోని దాల్ సరస్సు, గుర్గావ్ లోని సుల్తాన్పూర్ నేషనల్ పార్క్, వారణాసి లోని మున్సిపాట్[5].

మూలాలు

[మార్చు]
  1. Telugu, TV9 (2024-06-20). "India: గేమ్ ఛేంజర్‌గా మారనున్న పర్యాటక రంగం.. 5 కోట్ల ఉద్యోగాలు, రూ.20 లక్షల కోట్ల ఆదాయం!". TV9 Telugu. Retrieved 2024-07-19.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Barten, Martijn (2024-01-06). "Tourism Meaning: Learn About the Definition of Tourism Industry". Revfine.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-07-19.
  3. "TOURISM AND HOSPITALITY INDUSTRY REPORT". https://www.ibef.org/industry/tourism-hospitality-india. 19 July 2024. Retrieved 19 July 2024. {{cite web}}: External link in |website= (help)
  4. "Tourism in India | History | Culture | Regions". Travanya. Retrieved 2024-07-19.
  5. "Top 10 Tourist Places To Visit In India - Jodogo". www.jodogoairportassist.com. Retrieved 2024-07-19.