Jump to content

భాస్కర్ (దర్శకుడు)

వికీపీడియా నుండి
భాస్కర్
జననం
భాస్కరన్ నటరాజన్

సెప్టెంబరు 23, 1979
ఇతర పేర్లుబొమ్మరిల్లు భాస్కర్
విద్యాసంస్థతమిళనాడు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్
వృత్తితెలుగు సినిమా దర్శకుడు, చిత్రానువాదం రచయిత, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
జీవిత భాగస్వామిశ్రీవిద్య
పిల్లలుహాసిని భాస్కరన్
నయా విభా

భాస్కర్ (బొమ్మరిల్లు భాస్కర్) తెలుగు సినిమా దర్శకుడు, చిత్రానువాదం రచయిత, నిర్మాత. 2006లో బొమ్మరిల్లు సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు.[1]

జీవిత విషయాలు

[మార్చు]

భాస్కర్ 1979, సెప్టెంబరు 23న తమిళనాడులోని వెల్లూరులో జన్మించాడు.[2] చెన్నైలోని తమిళనాడు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ లో సినిమా రంగంలో శిక్షణ పొందాడు.

సినిమారంగం

[మార్చు]

తన కెరీర్ ప్రారంభంలో భద్ర, ఆర్య చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. 2006లో సిద్ధార్థ్ నారాయణ్, జెనీలియా నటించిన బొమ్మరిల్లు చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి నంది ఉత్తమ నూతన దర్శకుడుగా, నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా రెండు నంది అవార్డులు అందుకున్నాడు.[3] 2008లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పరుగు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంకాగా,[4] 2010లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. 2013లో వచ్చిన ఒంగోలు గిత్త బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[5] ఆర్య, రానా దగ్గుబాటి, సమంత, శ్రీదివ్య, బాబీ సింహా నటించిన తమిళ చిత్రం బెంగళూరు నాట్కల్ 2016లో విడుదలయింది.[6]

దర్శకత్వం వహించిన సినిమాలు

[మార్చు]
క్రమసంఖ్య సంవత్సరం సినిమాపేరు భాష ఇతర వివరాలు
1 2006 బొమ్మరిల్లు తెలుగు నంది ఉత్తమ నూతన దర్శకుడు
నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత
2 2008 పరుగు తెలుగు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడు – తెలుగుకి నామినేట్
3 2010 ఆరెంజ్ తెలుగు
4 2013 ఒంగోలు గిత్త[7] తెలుగు
5 2016 బెంగళూరు నాట్కల్ తమిళ తొలిచిత్రం
6 2020 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తెలుగు

Collaborations

[మార్చు]
నటులు బొమ్మరిల్లు పరుగు ఆరెంజ్ ఒంగోలు గిత్త బెంగళూరు నాట్కల్
జెనీలియా Yes Yes
సునీల్ Yes Yes
జయసుధ Yes Yes
ప్రకాష్ రాజ్ Yes Yes Yes Yes Yes
బ్రహ్మానందం Yes Yes
చిత్రం శ్రీను Yes Yes
ప్రభు Yes Yes
ఆలీ Yes Yes

మూలాలు

[మార్చు]
  1. Rajamani, Radhika. "The man behind Telugu hit Bommarillu". Rediff.com. Retrieved 2007-10-15.
  2. Times of India, Movies (5 March 2020). "Bommarillu Bhaskar". timesofindia.indiatimes.com. Archived from the original on 4 June 2020. Retrieved 4 June 2020.
  3. "Nandi award winners list 2006 - Telugu cinema, et". Idlebrain.com. Retrieved 4 June 2020.
  4. "'Parugu' remake gets mixed response in Bollywood". IndiaGlitz. 24 May 2014. Retrieved 4 June 2020.
  5. "ఒంగోలు గిత్త విడుదల తేదీ". FilmGola. January 23, 2013. Archived from the original on 2013-01-26. Retrieved 4 June 2020.
  6. "`Bangalore Days` to be remade in Hindi, Tamil and Telugu?". Sify. 1 July 2020. Archived from the original on 1 జూలై 2014. Retrieved 4 June 2020.
  7. "Ram to team up with Bommarillu Bhaskar?". Times of India. 20 February 2012. Archived from the original on 3 జనవరి 2013. Retrieved 4 June 2020.

ఇతర లంకెలు

[మార్చు]