భీమదేవరపల్లి బ్రాంచి
భీమదేవరపల్లి బ్రాంచి | |
---|---|
దర్శకత్వం | రమేశ్ చెప్పాల |
రచన | రమేశ్ చెప్పాల |
నిర్మాత | బత్తిని కీర్తిలత గౌడ్ రాజా నరేందర్ చెట్లపెల్లి |
తారాగణం | అంజిబాబు ప్రొఫెసర్ నాగేశ్వర్ జేడీ లక్ష్మీ నారాయణ అభిరామ్ |
ఛాయాగ్రహణం | కే. చిట్టిబాబు |
కూర్పు | బొంతల నాగేశ్వర రెడ్డి |
సంగీతం | చరణ్ అర్జున్ |
నిర్మాణ సంస్థలు | ఏబీ సినిమాస్ నిహాల్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2023 జూన్ 23 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
భీమదేవరపల్లి బ్రాంచి 2023 జూన్ 23న విడుదలవుతున్న తెలుగు సినిమా.[1] ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మించిన ఈ సినిమాకు రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించాడు.[2] అంజి వల్గుమాన్, సాయి ప్రసన్న, అభిరామ్, రూప శ్రీనివాస్, రాజవ్వ, సుధాకర రెడ్డి, కీర్తి లత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 23న సినిమా విడుదల అయ్యింది.[3][4]
నటీనటులు
[మార్చు]- అంజి వల్గుమాన్[5]
- సాయి ప్రసన్న
- ప్రొఫెసర్ నాగేశ్వర్
- జేడీ లక్ష్మీ నారాయణ[6][7]
- అద్దంకి దయాకర్
- రాజవ్వ
- సుధాకర రెడ్డి
- కీర్తి లత
- అభిరామ్
- సుధాకర్ రెడ్డి
- రూప శ్రీనివాస్
- శుభోదయం సుబ్బారావు
- సి.ఎస్.ఆర్.వివ రెడ్డి
- బుర్ర శ్రీనివాస్
- పద్మ
- మానుకోట ప్రసాద్
- గడ్డం నవీన్
- తాటి గీత
- మల్లికార్జున్
- మహి
- వాలి సత్య ప్రకాష్
- 'మిమిక్రీ' మహేష్
కథ
[మార్చు]జంపన్న (అంజి వాల్గుమాన్) తన తల్లి సమ్మక్క (రాజవ్వ) భార్య స్వరూప (సాయి ప్రసన్న కొండ్ర)తో కలిసి భీమదేవరపల్లి గ్రామంలో సాధారణ జీవితాన్ని గడుపుతాడు. ఒకరోజు సమ్మక్క బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమవుతాయి. బ్యాంకు అకౌంటులో 15 లక్షలు పడటంతో ఖర్చు పెట్టేస్తాడు. ఆ తరువాత ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. ఆ నిజం తెలుసుకున్న అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంటాడు ఆ తర్వాత ఏమి జరుగుతుంది అనేదే మిగతా సినిమా కథ.[8]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఏబీ సినిమాస్, నిహాల్ ప్రొడక్షన్స్
- నిర్మాత: బత్తిని కీర్తిలత గౌడ్[9], రాజా నరేందర్ చెట్లపెల్లి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేశ్ చెప్పాల
- సంగీతం: చరణ్ అర్జున్
- సినిమాటోగ్రఫీ: కే. చిట్టిబాబు
- పాటలు: సుద్దాల అశోక్ తేజ, సంజయ్ మహేష్ వర్మ
- ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
- ఆర్ట్: టి. మోహన్
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటలను సుద్దాల అశోక్ తేజ రాయగా, చరణ్ అర్జున్ సంగీతం అందించాడు. 2023, ఏప్రిల్ 21న ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
- పొల్లా ఓ పొల్లా (గానం: చరణ్ అర్జున్, అపర్ణ నందన్)
- అన్యాలం (గానం: మోహన భోగరాజు, సురేష్ కుమార్)
- ఎల్లమ్మ (గానం: వాణి వొల్లాల, నల్గొండ గద్దర్ నర్సన్న)[10]
ప్రచారం
[మార్చు]ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్‌పోస్టర్ దర్శకుడు వేణుశ్రీరామ్ విడుదల చేయగా,[11] సినిమా టీజర్ 2023 ఫిబ్రవరి 09న మంత్రి కేటీఆర్ చేతులమీదుగా విడుదలయింది.[12] టాప్ టెన్ యూట్యూబర్స్, టాప్ టెన్ ట్విట్టరైట్స్, టాప్ టెన్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, టాప్ టెన్ ఫేస్బుక్ పేజర్స్ అందరూ ఒకేసారి అంతర్జాల వేదికగా 2023, జూన్ 15న సాయంత్రం 5గంటల 9 నిమిషాలకు భీమదేవరపల్లి బ్రాంచి ట్రైలర్ ను విడుదల చేసారు.[13]
2023, జూన్ 19న కరీంనగర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, తెలంగాణ రాష్ట్ర టీవి, చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం, సినీహీరో తిరువీర్ ముఖ్య అథితులుగా హాజరయ్యారు.
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (7 June 2023). "భీమదేవరపల్లి కథ". Archived from the original on 7 June 2023. Retrieved 7 June 2023.
- ↑ Mana Telangana (2 July 2022). "కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Eenadu (7 June 2023). "ఆ గ్రామంలో ఏం జరిగింది?". Retrieved 7 June 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Andhra Jyothy (22 June 2023). "అవకతవక పథకాలు". Archived from the original on 22 June 2023. Retrieved 22 June 2023.
- ↑ "Anji Valguman: ₹5ల భోజనం తిని.. కలను సాకారం చేసుకుని.. అంజి వల్గమాన్ సినీ ప్రయాణమిదీ". EENADU. 2023-06-21. Archived from the original on 2023-06-21. Retrieved 2023-06-22.
- ↑ A. B. P. Desam (29 September 2022). "నటుడిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, సినిమాల్లో తొలి అడుగు". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ NTV Telugu (29 September 2022). "'భీమదేవరపల్లి బ్రాంచి'లో జేడీ లక్ష్మీనారాయణ!". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Sakshi (23 June 2023). "'భీమదేవరపల్లి బ్రాంచి' సినిమా రివ‍్యూ". Archived from the original on 8 September 2023. Retrieved 8 September 2023.
- ↑ Namasthe Telangana (2 July 2023). "నవ్వినవాళ్లే మెచ్చుకుంటున్నారు". Archived from the original on 2 July 2023. Retrieved 2 July 2023.
- ↑ Shanker (2023-04-21). "'భీమదేవరపల్లి బ్రాంచి' చిత్రంలోని ఎల్లమ్మ పాటకు సూపర్ రెస్పాన్స్". Mana Telangana. Archived from the original on 2023-04-21. Retrieved 2023-06-20.
- ↑ Namasthe Telangana (31 October 2022). "భీమదేవరపల్లి బ్రాంచ్‌లో." Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ Sakshi (10 February 2023). "టీజర్ ఆకట్టుకుంది – మంత్రి కేటీఆర్". Archived from the original on 10 February 2023. Retrieved 10 February 2023.
- ↑ "వినూత్న పద్ధతిలో "భీమదేవరపల్లి బ్రాంచి" ట్రైలర్ రిలీజ్! |". 2023-06-16. Archived from the original on 2023-06-20. Retrieved 2023-06-20.