మల్‌రెడ్డి రంగారెడ్డి
Appearance
మల్‌రెడ్డి రంగారెడ్డి | |||
| |||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - 2014 | |||
ముందు | నల్లు ఇంద్రసేనా రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | మలక్‌పేట్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | పి.వినయ్ కుమార్ | ||
నియోజకవర్గం | మలక్‌పేట్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 14 అక్టోబర్ 1955 తొర్రూరు, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | అనసూయ రెడ్డి | ||
సంతానం | 1 కొడుకు (అభిషేక్‌రెడ్డి) , 4 కుమార్తెలు (రజిత, రమ, పద్మజ, అర్చనారెడ్డి) | ||
నివాసం | అబ్దుల్లాపూర్ మెట్ |
మల్రెడ్డి రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన ప్రస్తుతం ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా ఉన్నాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]మల్‌రెడ్డి రంగారెడ్డి తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం లో 1957, అక్టోబరు 14న జన్మించాడు. ఆయన 1973లో హయత్ నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి పూర్తిచేసి, 2005లో తమిళనాడు లోని మదురై కామరాజ్ యూనివర్సిటీ నుండి ఎంఏ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]మల్‌రెడ్డి రంగారెడ్డి 1981లో రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చాడు. ఆయన 1981లో తోరూర్ సర్పంచ్ గా గెలిచాడు. ఆయన 1986లో హైదరాబాద్ డీసీబీబి డైరెక్టర్ గా పని చేశాడు.
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను ఇబ్రహీంపట్నం అభ్యర్థిగా ప్రకటించింది.[2]
శాసనసభకు పోటీ
[మార్చు]సంవత్సరం | నియోజకవర్గం పేరు | నియోజకవర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | పార్టీ | ఓట్లు | మెజారిటీ | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1994 | మలక్‌పేట్ | జనరల్ | మల్‌రెడ్డి రంగారెడ్డి | టీడీపీ | 54441 | నల్లు ఇంద్రసేనారెడ్డి | బీజేపీ | 47857 | 6,584 | గెలుపు |
2004 | మలక్‌పేట్ | జనరల్ | మల్‌రెడ్డి రంగారెడ్డి | కాంగ్రెస్ | 138907 | మంచిరెడ్డి కిషన్‌రెడ్డి | టీడీపీ | 115549 | 23358 | గెలుపు |
2009 | ఇబ్రహీంపట్నం | జనరల్ | మంచిరెడ్డి కిషన్‌రెడ్డి | టీడీపీ | 56508 | మల్‌రెడ్డి రంగారెడ్డి | కాంగ్రెస్ | 47292 | 11056 | ఓటమి |
2014 | మహేశ్వరం | జనరల్ | తీగల కృష్ణారెడ్డి | టీడీపీ | 93305 | మల్‌రెడ్డి రంగారెడ్డి [3] | కాంగ్రెస్ పార్టీ | 62521 | 30,784 | ఓటమి |
2018 | ఇబ్రహీంపట్నం [4] | జనరల్ | మంచిరెడ్డి కిషన్‌రెడ్డి | టిఆర్ఎస్ | 72,581 | మల్‌రెడ్డి రంగారెడ్డి | బహుజన్ సమాజ్ పార్టీ | 72,205 | 376 | ఓటమి |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (28 October 2023). "ఇక రేసులోకి." Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Sakshi (12 April 2014). "మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగానే మల్రెడ్డి". Sakshi. Archived from the original on 7 June 2021. Retrieved 7 June 2021.
- ↑ News18 (2018). "Ibrahimpatnam Rural Assembly constituency (Telangana): Full details, live and past results". News18. Archived from the original on 7 June 2021. Retrieved 7 June 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)