మహిళల క్రికెట్ ప్రపంచ కప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్
నిర్వాహకుడుఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్
ఫార్మాట్WODI
తొలి టోర్నమెంటు1973  England
చివరి టోర్నమెంటు2022  New Zealand
తరువాతి టోర్నమెంటు2025  India
జట్ల సంఖ్య8 (2029 నుండి 10)
ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా (7వ టైటిల్)
అత్యంత విజయవంతమైన వారు ఆస్ట్రేలియా (7 టైటిళ్ళు)
అత్యధిక పరుగులున్యూజీలాండ్ డెబ్బీ హాక్లీ (1,501)
అత్యధిక వికెట్లుభారతదేశం ఝులన్ గోస్వామి (43)

 

ఐసిసి మహిళల క్రికెట్ ప్రపంచ కప్, క్రికెట్‌లో అత్యంత పురాతనమైన ప్రపంచ ఛాంపియన్‌షిప్. మొట్టమొదటి టోర్నమెంటు 1973లో ఇంగ్లాండ్‌లో జరిగింది. ఒక్కో జట్టుకు 50 ఓవర్లుండే వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడారు. ట్వంటీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు విడిగా ఐసిసి మహిళల T20 ప్రపంచ కప్ ఉంది.

ప్రపంచ కప్‌ను ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) నిర్వహిస్తోంది. 2005 వరకు, దీన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ క్రికెట్ కౌన్సిల్ (IWCC) సంస్థ నిర్వహించేది. పురుషుల టోర్నమెంటు మొదలవడానికి రెండు సంవత్సరాల ముందే, 1973 లో, మొదటి మహిళల ప్రపంచ కప్ ఇంగ్లాండ్‌లో జరిగింది. టోర్నమెంటు మొదలైన తొలి నాళ్ళలో నిధుల సమస్యలు ఎదురయ్యాయి. దీని వలన అనేక జట్లకు పంపిన ఆహ్వానాలను తిరస్కరించాయి. టోర్నమెంట్ల మధ్య ఆరు సంవత్సరాల వరకు అంతరం వచ్చింది. అయితే, 2005 నుండి ప్రపంచ కప్‌లు నాలుగు సంవత్సరాల వ్యవధిలో నిర్వహిస్తున్నారు.

ఐసిసి మహిళల ఛాంపియన్‌షిప్‌లో పోటీ చేసే జట్లు, ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధిస్తాయి. టోర్నమెంటు కూర్పు చాలా సాంప్రదాయకంగా ఉంటుంది - 1997 నుండి టోర్నమెంట్‌లో కొత్త జట్లు ఏవీ చేరలేదు. 2000 నుండి ప్రపంచ కప్‌లోని జట్ల సంఖ్య ఎనిమిదిగా నిశ్చయించారు. అయితే టోర్నమెంటును 2029 నుండి 10 జట్లకు విస్తరించనున్నట్లు ఐసిసి 2021 మార్చిలో వెల్లడించింది.[1][2] 1997 ఎడిషన్‌లో రికార్డు స్థాయిలో పదకొండు జట్లు పోటీపడ్డాయి. ఇదే ఇప్పటి వరకు అత్యధికం.[3]

ఇప్పటి వరకు జరిగిన పదకొండు ప్రపంచ కప్‌లు ఐదు దేశాల్లో జరిగాయి. భారత్, ఇంగ్లండ్‌లు చెరి మూడుసార్లు ఆతిథ్యం ఇచ్చాయి. ఆస్ట్రేలియా ఏడు టైటిళ్లను గెలుచుకుని, అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. మూడు సందర్భాల్లో మాత్రమే అది ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఇంగ్లండ్ (నాలుగు టైటిళ్లు), న్యూజిలాండ్‌లు (ఒక టైటిల్) ఈ ఈవెంట్‌ను గెలుచుకున్న ఇతర జట్లు కాగా, భారత్ రెండుసార్లు, వెస్టిండీస్ ఒకసారి ఫైనల్‌కు చేరుకున్నాయి గానీ కప్పు గెలవలేదు.

చరిత్ర

[మార్చు]

మొదటి ప్రపంచ కప్

[మార్చు]

1934లో ఇంగ్లండ్‌కు చెందిన జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించినప్పుడు తొలిసారి మహిళల అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. మొదటి టెస్టు మ్యాచ్ 1934 డిసెంబరు 28-31 ల్లో జరిగింది. అందులో ఇంగ్లండ్ గెలిచింది.[4] మరుసటి సంవత్సరం ప్రారంభంలో న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు ఆడారు. 1960 వరకు ఈ మూడు దేశాలే మహిళల క్రికెట్‌లో టెస్టులు ఆడేవి. 1960 లో దక్షిణాఫ్రికా ఇంగ్లాండ్‌తో అనేక మ్యాచ్‌లు ఆడింది.[5] [4] పరిమిత ఓవర్ల క్రికెట్‌ను మొదటిసారిగా 1962లో ఇంగ్లాండ్‌లో ఫస్ట్-క్లాస్ జట్లు ఆడాయి. తొమ్మిదేళ్ల తర్వాత, మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో తలపడినప్పుడు పురుషుల క్రికెట్‌లో మొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడారు.[6]

జాక్ హేవార్డ్ నేతృత్వంలో మహిళల క్రికెట్ ప్రపంచ కప్ నిర్వహించడం గురించి 1971లో చర్చలు ప్రారంభమయ్యాయి. [7] దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష చట్టాల కారణంగా, ఆ జట్టును పోటీలో పాల్గొనడానికి ఆహ్వానించలేదు.[8] మరో రెండు టెస్టు ఆడే దేశాలు - ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఆహ్వానించారు. హేవార్డ్ గతంలో ఇంగ్లండ్ మహిళల వెస్టిండీస్ పర్యటనలను నిర్వహించాడు. ఈ ప్రాంతం నుండి జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో లను పోటీకి ఆహ్వానించారు. మరిన్ని జట్ల కోసం ఇంగ్లాండ్, "యంగ్ ఇంగ్లండ్" అనే పేరుతో మరో జట్టును రంగంలోకి దించింది. వీటన్నిటికి తోడు "ఇంటర్నేషనల్ XI " అనే జట్టును కూడా చేర్చారు. [7] ఐదుగురు దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు అంతర్జాతీయ XI కోసం ఆడటానికి ఆహ్వానించినప్పటికీ, తరువాత ఈ ఆహ్వానాలను వెనక్కి తీసుకున్నారు.[8]

ప్రారంభ టోర్నమెంటు 1973 జూన్, జూలైల్లో ఇంగ్లాండ్ అంతటా వివిధ వేదికలలో జరిగింది.[9] మొదటి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ఆడటానికి రెండు సంవత్సరాల ముందే ఈ పోటీ జరిగింది.[10] ఈ పోటీ రౌండ్-రాబిన్ టోర్నమెంట్‌గా ఆడారు. చివరి షెడ్యూల్ మ్యాచ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌ల మధ్య జరిగింది. ఆస్ట్రేలియా ఒక పాయింటుతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది: వారు నాలుగు మ్యాచ్‌లు గెలవగా, ఒకటి రద్దైంది. ఇంగ్లండ్ కూడా నాలుగు మ్యాచ్‌లు గెలిచింది, కానీ వారు న్యూజిలాండ్‌తో ఓడిపోయారు.[9][11] ఫలితంగా, ఈ మ్యాచ్ పోటీకి ఫైనల్‌ లాంటిదైంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 92 పరుగుల తేడాతో గెలిచి టోర్నీని గెలుచుకుంది.[12]

ఫైనల్స్

[మార్చు]
Year Host (s) Final venue Final జట్టుs
Winners Result Runners-up
1973  England No final  ఇంగ్లాండు

20 points
ఇంగ్లాండ్ పాయింట్ల ఆధారంగా గెలిచింది

table
 ఆస్ట్రేలియా

17 points
7
1978  India No final  ఆస్ట్రేలియా

6 points
ఆస్ట్రేలియా పాయింట్ల ఆధారంగా గెలిచింది

table
 ఇంగ్లాండు

4 points
4
1982  New Zealand Lancaster Park, Christchurch  ఆస్ట్రేలియా

152/7 (59 overs)
ఆస్ట్రేలియా 3 వికెట్లతో గెలిచింది

స్కోరు
 ఇంగ్లాండు

151/5 (60 overs)
5
1988  Australia మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్, మెల్‌బోర్న్  ఆస్ట్రేలియా

129/2 (44.5 overs)
ఆస్ట్రేలియా 8 వికెట్లతో గెలిచింది

స్కోరు
 ఇంగ్లాండు

127/7 (60 overs)
5
1993  England లార్డ్స్, లండన్  ఇంగ్లాండు

195/5 (60 overs)
ఇంగ్లాండ్ 67 పరుగులతో గెలిచింది

స్కోరు
 న్యూజీలాండ్

128 (55.1 overs)
8
1997  India ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా  ఆస్ట్రేలియా

165/5 (47.4 overs)
ఆస్ట్రేలియా 5 వికెట్లతో గెలిచింది

స్కోరు
 న్యూజీలాండ్

164 (49.3 overs)
11
2000  New Zealand Bert Sutcliffe Oval, Lincoln  న్యూజీలాండ్

184 (48.4 overs)
న్యూజీలాండ్ 4 పరుగులతో గెలిచింది

స్కోరు
 ఆస్ట్రేలియా

180 (49.1 overs)
8
2005  South Africa SuperSport Park, Centurion  ఆస్ట్రేలియా

215/4 (50 overs)
ఆస్ట్రేలియా 98 పరుగులతో గెలిచింది

స్కోరు
 భారతదేశం

117 (46 overs)
8
2009  Australia నార్త్ సిడ్నీ ఓవల్, సిడ్నీ  ఇంగ్లాండు

167/6 (46.1 overs)
ఇంగ్లాండ్ 4 వికెట్లతో గెలిచింది

స్కోరు
 న్యూజీలాండ్

166 (47.2 overs)
8
2013  India Brabourne Stadium, Mumbai  ఆస్ట్రేలియా

259/7 (50 overs)
ఆస్ట్రేలియా 114 పరుగులతో గెలిచింది

స్కోరు
 వెస్ట్ ఇండీస్

145 (43.1 overs)
8
2017  England లార్డ్స్, లండన్  ఇంగ్లాండు

228/7 (50 overs)
ఇంగ్లాండ్ 9 పరుగులతో గెలిచింది

స్కోరు
 భారతదేశం

219 (48.4 overs)
8
2022  New Zealand Hagley Oval, Christchurch  ఆస్ట్రేలియా

356/5 (50 overs)
ఆస్ట్రేలియా 71 పరుగులతో గెలిచింది

స్కోరు
 ఇంగ్లాండు

285 (43.4 overs)
8
2025  India To be confirmed 8

ఫలితాలు

[మార్చు]

పదిహేను జట్లు మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు కనీసం ఒక్కసారైనా అర్హత సాధించాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ -ఈ మూడు జట్లు అన్ని టోర్నమెంట్ల లోనూ పోటీ చేసాయి. ఇప్పటి వరకూ టైటిల్ గెలుచుకున్నది కూడా ఆ మూడూ జట్లే.

జట్ల ప్రదర్శనలు

[మార్చు]
జట్టు ఇంగ్లాండ్

1973

(7)
భారతదేశం

1978

(4)
న్యూజీలాండ్

1982

(5)
ఆస్ట్రేలియా

1988

(5)
ఇంగ్లాండ్

1993

(8)
భారతదేశం

1997

(11)
న్యూజీలాండ్

2000

(8)
దక్షిణాఫ్రికా

2005

(8)
ఆస్ట్రేలియా

2009

(8)
భారతదేశం

2013

(8)
ఇంగ్లాండ్

2017

(8)
న్యూజీలాండ్

2022

(8)
మొత్తం
 ఆస్ట్రేలియా 2వ మొదటి మొదటి మొదటి 3వ మొదటి 2వ మొదటి 4వ మొదటి సె.ఫై మొదటి 12
 బంగ్లాదేశ్ 7వ 1
 డెన్మార్క్ 7వ 9వ 2
 ఇంగ్లాండు మొదటి 2వ 2వ 2వ మొదటి సె.ఫై 5వ సె.ఫై మొదటి 3వ మొదటి 2వ 12
 భారతదేశం 4వ 4వ 4వ సె.ఫై సె.ఫై 2వ 3వ 7వ 2వ 5వ 10
 ఐర్లాండ్ 4వ 5వ QF 7వ 8వ 5
 నెదర్లాండ్స్ 5వ 8వ QF 8వ 4
 న్యూజీలాండ్ 3వ 3వ 3వ 3వ 2వ 2వ మొదటి సె.ఫై 2వ 4వ 5వ 6వ 12
 పాకిస్తాన్ 11వ 5వ 8వ 8వ 8వ 5
 దక్షిణాఫ్రికా QF సె.ఫై 7వ 7వ 6వ సె.ఫై సె.ఫై 7
 శ్రీలంక QF 6వ 6వ 8వ 5వ 7వ 6
 వెస్ట్ ఇండీస్ 6వ 10వ 5వ 6వ 2వ 6వ సె.ఫై 7
Defunct జట్టుs
International XI 4వ 5వ 2
 జమైకా 6వ 1
 ట్రినిడాడ్ అండ్ టొబాగో 5వ 1
ఇంగ్లాండ్ యంగ్ ఇంగ్లాండ్ 7వ 1

తొలిసారి ఆడిన జట్లు

[మార్చు]
సంవత్సరం జట్లు
1973  ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, న్యూజీలాండ్, అంతర్జాతీయ XI , జమైకా , ట్రినిడాడ్ అండ్ టొబాగో ,ఇంగ్లాండ్ యంగ్ ఇంగ్లాండ్
1978  భారతదేశం
1982 ఏదీ లేదు
1988  ఐర్లాండ్, నెదర్లాండ్స్
1993  డెన్మార్క్, వెస్ట్ ఇండీస్
1997  పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక
2000 ఏదీ లేదు
2005 ఏదీ లేదు
2009 ఏదీ లేదు
2013 ఏదీ లేదు
2017 ఏదీ లేదు
2022  బంగ్లాదేశ్
2025 TBD

ఇకపై వన్‌డే హోదా లేదు.ఇప్పుడు ఉనికిలో లేదు.

అవలోకనం

[మార్చు]

దిగువ పట్టిక 2022 టోర్నమెంట్ ముగింపు నాటికి గత ప్రపంచ కప్‌లలో జట్ల ప్రదర్శనల అవలోకనాన్ని అందిస్తుంది. జట్లు, అత్యుత్తమ ప్రదర్శన ద్వారా, ఆపై ఆడిన మ్యాచ్‌లు, మొత్తం విజయాల సంఖ్య, మొత్తం గేమ్‌ల సంఖ్య, అక్షర క్రమం ద్వారా వరుసగా పేర్చబడ్డాయి.

Appearances Statistics
జట్టు మొత్తం తొలి తాజా అత్యుత్తమ స్థానం   గెలి ఓడి టై ఫతే గెలుపు%*
 ఆస్ట్రేలియా 11 1973 2022 ఛాంపియన్లు (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022) 84 70 11 1 2 85.47
 ఇంగ్లాండు 11 1973 2022 ఛాంపియన్లు (1973, 1993, 2009, 2017) 83 57 23 2 1 75.04
 న్యూజీలాండ్ 11 1973 2022 ఛాంపియన్లు (2000) 80 51 26 2 1 65.82
 భారతదేశం 9 1978 2022 రన్నరప్ (2005, 2017) 63 34 27 1 1 55.64
 వెస్ట్ ఇండీస్ 6 1993 2022 రన్నరప్ (2013) 38 13 24 0 1 35.13
 దక్షిణాఫ్రికా 6 1997 2022 సెమీ ఫైనల్స్ (2000, 2017, 2022) 38 15 22 0 3 40.54
 పాకిస్తాన్ 4 1997 2022 Super 6s (2009) 23 3 21 0 0 14.28
 శ్రీలంక 6 1997 2017 క్వార్టర్ ఫైనల్స్ (1997) 35 8 26 0 1 23.52
 ఐర్లాండ్ 5 1988 2005 క్వార్టర్ ఫైనల్స్ (1997) 34 7 26 0 1 21.21
 నెదర్లాండ్స్ 4 1988 2000 క్వార్టర్ ఫైనల్స్ (1997) 26 2 24 0 0 07.69
International XI 2 1973 1982 మొదటి రౌండు (1973, 1982) 18 3 14 0 1 16.66
 డెన్మార్క్ 2 1993 1997 మొదటి రౌండు (1993, 1997) 13 2 11 0 0 15.38
 ట్రినిడాడ్ అండ్ టొబాగో 1 1973 1973 మొదటి రౌండు (1973) 6 2 4 0 0 33.33
 బంగ్లాదేశ్ 1 2022 2022 మొదటి రౌండు (2022) 7 1 6 0 0 14.28
Young Englaవ 1 1973 1973 మొదటి రౌండు (1973) 6 1 5 0 0 16.66
 జమైకా 1 1973 1973 మొదటి రౌండు (1973) 5 1 4 0 0 20.00
  • గెలుపు శాతంలో ఫలితం తేలని వాటిని చేర్చలేదు. టైలను సగం విజయంగా గణిస్తుంది.
  • జట్లు వాటి అత్యుత్తమ పనితీరు ఆధారంగా, ఆపై గెలుపు శాతం, ఆపై అక్షర క్రమం ద్వారా పేర్చబడ్డాయి.

అవార్డులు

[మార్చు]

Player of the Tournament

[మార్చు]
Year Player Performance details
1988 ఇంగ్లాండ్ Carole Hodges 336 Runs / 12 Wickets
1993
1997
2000 ఆస్ట్రేలియా Lisa Keightley 375 Runs
2005 ఆస్ట్రేలియా Karen Rolton 246 Runs
2009 ఇంగ్లాండ్ Claire Taylor 324 Runs
2013 న్యూజీలాండ్ Suzie Bates 407 Runs
2017 ఇంగ్లాండ్ Tammy Beaumont 410 Runs
2022 ఆస్ట్రేలియా Alyssa Healy 509 Runs

Player of the Final

[మార్చు]
Year Player Performance details
1982
1988
1993 ఇంగ్లాండ్ Jo Chamberlain 38 (33) / 1/28 (9)
1997 న్యూజీలాండ్ Debbie Hockley 79 (121)
2000 ఆస్ట్రేలియా Belinda Clark 91 (102)
2005 ఆస్ట్రేలియా Karen Rolton 107* (128)
2009 ఇంగ్లాండ్ Nicky Shaw 4/34 (8.2)
2013 ఆస్ట్రేలియా Jess Cameron 75 (76)
2017 ఇంగ్లాండ్ Anya Shrubsole 6/46 (9.4)
2022 ఆస్ట్రేలియా Alyssa Healy 170 (138)

టోర్నమెంటు రికార్డులు

[మార్చు]
ప్రపంచకప్ రికార్డులు
బ్యాటింగ్
అత్యధిక పరుగులు డెబ్బీ హాక్లీ  న్యూజీలాండ్ 1,501 1982–2000 [13]
అత్యధిక సగటు (నిమి. 10 ఇన్నింగ్స్) కరెన్ రోల్టన్  ఆస్ట్రేలియా 74.92 1997–2009 [14]
అత్యధిక స్కోరు బెలిండా క్లార్క్  ఆస్ట్రేలియా 229 * 1997 [15]
అత్యధిక భాగస్వామ్యం టామీ బ్యూమాంట్ & సారా టేలర్  ఇంగ్లాండు 275 2017 [16]
టోర్నీలో అత్యధిక పరుగులు అలిస్సా హీలీ  ఆస్ట్రేలియా 509 2022 [17]
బౌలింగ్
అత్యధిక వికెట్లు ఝులన్ గోస్వామి  భారతదేశం 43 2005–2022 [18]
అత్యల్ప సగటు (నిమి. 500 బంతులు బౌల్డ్) కత్రినా కీనన్  న్యూజీలాండ్ 9.72 1997–2000 [19]
అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు జాకీ లార్డ్  న్యూజీలాండ్ 6/10 1982 [20]
టోర్నీలో అత్యధిక వికెట్లు లిన్ ఫుల్‌స్టన్  ఆస్ట్రేలియా 23 1982 [21]
ఫీల్డింగ్
అత్యధిక అవుట్‌లు ( వికెట్ కీపర్ ) జేన్ స్మిత్  ఇంగ్లాండు 40 1993–2005 [22]
అత్యధిక క్యాచ్‌లు ( ఫీల్డర్ ) జానెట్ బ్రిటిన్  ఇంగ్లాండు 19 1982–1997 [23]
జట్టు
అత్యధిక స్కోరు  ఆస్ట్రేలియా (వి డెన్మార్క్ ) 412/3 1997 [24]
అత్యల్ప స్కోరు  పాకిస్తాన్ (v ఆస్ట్రేలియా ) 27 1997 [25]
అత్యధిక విజయం %  ఆస్ట్రేలియా 87.36 [26]
అత్యధిక విజయాలు  ఆస్ట్రేలియా 79 [26]
చాలా లాస్ట్  భారతదేశం 31 [26]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • ఐసిసి మహిళల ఛాంపియన్‌షిప్
  • ఐసిసి మహిళల T20 ప్రపంచ కప్
  • ఐసిసి మహిళల T20 ఛాంపియన్స్ ట్రోఫీ
  • క్రికెట్ ప్రపంచ కప్

మూలాలు

[మార్చు]
  1. Jolly, Laura (8 Mar 2021). "New event, more teams added to World Cup schedule". cricket.com.au (in ఇంగ్లీష్). Retrieved 2021-04-06.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "ICC announces expansion of the women's game". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2021-04-06.
  3. "Points Table | ICC Women's World Cup 1997". static.espncricinfo.com. Retrieved 2021-04-06.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. 4.0 4.1 Heyhoe Flint & Rheinberg 1976, pp. 175–180.
  5. Williamson, Martin (9 April 2011). "The low-key birth of one-day cricket". ESPNcricinfo. Archived from the original on 19 September 2013. Retrieved 22 January 2012.
  6. Williamson, Martin (22 June 2010). "The birth of the one-day international". ESPNcricinfo. Archived from the original on 17 November 2017. Retrieved 22 January 2012.
  7. 7.0 7.1 Heyhoe Flint & Rheinberg 1976, p. 168.
  8. 8.0 8.1 "World Cups 1926–1997". Women's Cricket History. Archived from the original on 27 January 2012. Retrieved 22 January 2012.
  9. 9.0 9.1 "Women's World Cup, 1973 / Results". ESPNcricinfo. Archived from the original on 19 August 2012. Retrieved 22 January 2012.
  10. Baker, Andrew (20 March 2009). "England women's cricketers aiming to lift World Cup for third time". The Daily Telegraph. London. Archived from the original on 12 December 2010. Retrieved 22 January 2012.
  11. "Women's World Cup 1973 Table". CricketArchive. Archived from the original on 23 October 2012. Retrieved 22 January 2012.
  12. "21st Match: England Women v Australia Women at Birmingham, Jul 28, 1973". ESPNcricinfo. Archived from the original on 31 July 2012. Retrieved 22 January 2012.
  13. "Records / Women's World Cup / Most runs". ESPNcricinfo. Archived from the original on 24 November 2015. Retrieved 21 January 2012.
  14. "Records / Women's World Cup / Highest averages". ESPNcricinfo. Archived from the original on 7 November 2015. Retrieved 21 January 2012.
  15. "Records / Women's World Cup / High scores". ESPNcricinfo. Archived from the original on 13 November 2017. Retrieved 21 January 2012.
  16. "Records / Women's World Cup / Highest partnerships by runs". ESPNcricinfo. Archived from the original on 3 July 2017. Retrieved 23 July 2017.
  17. "Records / Women's World Cup / Most runs in a series". ESPNcricinfo. Archived from the original on 7 November 2015. Retrieved 21 January 2012.
  18. "Records / Women's World Cup / Most wickets". ESPNcricinfo. Archived from the original on 7 November 2015. Retrieved 21 January 2012.
  19. "Women's World Cup / Best averages". ESPNcricinfo. Archived from the original on 13 September 2015. Retrieved 19 March 2015.
  20. "Records / Women's World Cup / Best bowling figures in an innings". ESPNcricinfo. Archived from the original on 6 November 2015. Retrieved 21 January 2012.
  21. "Records / Women's World Cup / Most wickets in a series". ESPNcricinfo. Archived from the original on 27 November 2015. Retrieved 21 January 2012.
  22. "Records / Women's World Cup / Most dismissals". ESPNcricinfo. Archived from the original on 3 October 2017. Retrieved 21 January 2012.
  23. "Records / Women's World Cup / Most catches". ESPNcricinfo. Archived from the original on 3 October 2017. Retrieved 21 January 2012.
  24. "Records / Women's World Cup / Highest totals". ESPNcricinfo. Archived from the original on 20 December 2015. Retrieved 21 January 2012.
  25. "Records / Women's World Cup / Lowest totals". ESPNcricinfo. Archived from the original on 21 December 2015. Retrieved 21 January 2012.
  26. 26.0 26.1 26.2 "Records / Women's World Cup / Result summary". ESPNcricinfo. Archived from the original on 31 October 2014. Retrieved 21 January 2012.