మేడారం జాతర 2024
మేడారం జాతర 2024 | |
---|---|
ప్రక్రియ | తీర్థయాత్ర |
ఫ్రీక్వెన్సీ | ప్రతి రెండు సంవత్సరాలకు |
ప్రదేశం | మేడారం గ్రామం, తాడ్వాయి మండలం, ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రం |
ఇటీవలి | 2022 |
ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసీ జాతర మాఘశుద్ధ పౌర్ణమి (సమ్మక్కల పున్నం) రోజున రెండేళ్లకోసారి తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం గ్రామంలో జరిగే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరగనుంది. ఈ జాతరకు సంబందించిన పోస్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి కొండా సురేఖ సచివాలయంలో ఆవిష్కరించారు.[1] మేడారం జాతర భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఈ జాతర జరుగుతుంది. ప్రతి రెండేళ్లకు ఓ సారి ఈ జాతరకు వనదేవతలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.
జాతర తేదీలు
[మార్చు]తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలను పూజారులు 2023 మే 3న విడుదల చేశారు.[2]
- 21 ఫిబ్రవరి 2024 బుధవారం రోజున సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు గద్దెలపైకి వచ్చుట
- 22 ఫిబ్రవరి 2024 గురువారం రోజున చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దెలపైకి వచ్చుట
- 23 ఫిబ్రవరి 2024 శుక్రవారం రోజున భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పించుట
- 24 ఫిబ్రవరి 2024 శనివారం రోజున సమ్మక్క-సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలు వన ప్రవేశం
మొదటి రోజు
[మార్చు]కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర మొదలైంది. సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో గల ఈ గ్రామంలోని చిన్న ఆలయంలో గద్దెపైకి కన్నెపల్లి నుంచి ప్రతిష్టించిన సారలమ్మ మేడారం గద్దె వద్దకు చేరుతుంది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కన్నెపల్లి నుంచి సారలమ్మ వడ్డెలు (పూజారులు) మేడారంలోని గద్దెలకు వచ్చి, ముగ్గులు వేసి మళ్లీ కన్నెపల్లిలోని పూజా మందిరానికి చేరుకున్నారు. అక్కడ వడ్డెలు రెండు గంటలపాటు గోప్యంగా పూజలు చేసి, దేవతారూపాన్ని చేతపట్టుకుని గుడి బయటకు వచ్చి వరం పడుతున్న వారిపై నుంచి నడిచి వెళ్తారు. ఉత్సవ కమిటీ, ప్రజాప్రతినిధులు, అధికారులు సారలమ్మను మోస్తున్న వడ్డె వెంట నడుస్తారు. అతడిని దేవదూతగా భావిస్తారు. గ్రామ మహిళలు మంగళహారతులు ఇచ్చి, నీళ్లార బోసి కొబ్బరికాయలు కొడుతూ మేడారానికి సారలమ్మను సాగనంపుతారు. జంపన్నవాగు దాటుతున్న క్రమంలో వాగులో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు రెండుచేతులు పైకెత్తి అమ్మ వారికి స్వాగతం పలుకుతారు. అదే రోజు సారలమ్మ గద్దెపైకి రాకమునుపే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజును, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజును అటవీ మార్గం మీదుగా కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించిన తర్వాత పూజారులు ముగ్గురి రూపాలను గద్దెలపైన ప్రతిష్టించారు. పగిడిద్ద రాజు, గోవిందరాజు, సారలమ్మ రాత్రి 12.11 గంటలకు గద్దెలపై కొలువుదీరారు.[3][4]
రెండో రోజు
[మార్చు]మూడో రోజు
[మార్చు]నాలుగో రోజు
[మార్చు]మేడారం జాతర రూట్ మ్యాప్
[మార్చు]హైదరాబాద్ వైపు నుండి వచ్చేవారు
[మార్చు]హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హనుమకొండ మీదుగా వచ్చే వాహనాలు గుడెప్పాడ్, ఆత్మకూరు మీదుగా ములుగు, పస్రా దగ్గర క్రాస్ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి.[5]
ఖమ్మం, నర్సంపేట, ఇల్లెందు, మానుకోట వైపు నుండి వచ్చేవారు
[మార్చు]ఖమ్మం, మహబూబాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి చేరుకోవాలి. అక్కడి నుంచి నేషనల్ హైవే 163 మీదుగా ములుగు, పస్రా, నార్లాపూర్, మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ మార్గంలో వచ్చే వాహనాల కోసం ఊరట్టం క్రాస్ నుంచి ప్రాజెక్ట్ నగర్ వరకు ఎక్కడికక్కడ పార్కింగ్ ప్లేస్లు కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వైపు నుండి వచ్చేవారు
[మార్చు]గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే వాహనాలు కాటారం నుంచి చింతకాని, యామన్ పల్లి, పెగడపల్లి, సింగారం, కాల్వపల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. ఇలా వచ్చే వాహనాల కోసం ఊరట్టం దగ్గరే పార్కింగ్ ప్లేస్ లు కేటాయించారు. ఈ వెహికిల్స్ అన్నీ కూడా తిరుగు ప్రయాణంలో ఇదే రూట్ లో వెళ్లిపోవాల్సి ఉంటుంది. దాంతో పాటు నార్లాపూర్, బయ్యక్కపేట, గొళ్లబుద్దారం, కమలాపురం క్రాస్ మీదుగా కూడా వెళ్లిపోయే అవకాశం కూడా ఉంటుంది.
వాజేడు, ఛత్తీస్‌గఢ్ వెంకటాపురం(కె) వైపు నుండి వచ్చేవారు
[మార్చు]ఛత్తీస్ గఢ్. భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చే వాహనాలు ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి, కొండాయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకోవాల్సి ఉంటుంది. ఈ వాహనాలన్నీ తిరుగు ప్రయాణంలో వచ్చినదారిలోనే వెళ్లిపోవాల్సి ఉంటుంది.
ఆర్టీసీ, వీఐపీ వెహికిల్స్..
[మార్చు]ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వాహనాలు అన్నీ తాడ్వాయి దగ్గర క్రాస్ తీసుకొని మేడారం చేరుకోవాలి. మళ్లీ అదే రూట్లో ఈ వాహనాలు తిరుగు ప్రయాణం కావాల్సి ఉంటుంది.
ఆర్టీసీ సేవలు
[మార్చు]మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా బస్సులు నడుపుతున్నారు.[6][7]
హెలికాప్టర్ సేవలు
[మార్చు]మేడారం జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 21 నుంచి 25 వరకు హెలికాఫ్టర్ సేవలు భక్తులకు అందుబాటులో ఉంటాయి. టికెట్ బుకింగ్ కోసం 7483432752, 9400399999 సంప్రదించవచ్చు.[8]
హెలికాప్టర్ సర్వీస్ | రూట్లు | ప్రత్యేకత | టికెట్ ధర |
---|---|---|---|
జాయ్‌రైడ్ సర్వీస్ | మేడారంలో గగన విహారం | 7-8 ని.ల పాటు జాతర విహంగ వీక్షణం(ఏరియల్ వ్యూ) | 4,300 |
షటిల్ సర్వీస్ | హనుమకొండ- మేడారం-హన్మకొండ | కేవలం 20-30 నిమిషాల్లో జాతరకు | 28,999 |
చార్టర్ సర్వీస్ | హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు - మేడారం | 5 సీట్లు, వీఐపీ దర్శనం (ఒక్కరికి) | 95,833 |
జాతరకు విచ్చేసిన రాజకీయ ప్రముఖులు
[మార్చు]- తమిళిసై సౌందరరాజన్[9]
- రేవంత్ రెడ్డి[9]
- కిషన్ రెడ్డి[10]
- పొన్నం ప్రభాకర్[11][12]
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- కొప్పుల ఈశ్వర్[13]
ఇవీ చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Andhrajyothy (1 February 2024). "మేడారం జాతరను ఘనంగా నిర్వహిస్తాం: సీఎం". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
- ↑ Hindustantimes Telugu. "మేడారం మహాజాతర తేదీలు ఖరారు". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
- ↑ Andhrajyothy (22 February 2024). "గద్దెపైకి సారలమ్మ.. నేడే సమ్మక్క తల్లి రాక". Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024.
- ↑ Mana Telangana, u (22 February 2024). "గద్దెనెక్కిన సారలమ్మ". Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024.
- ↑ V6 Velugu (20 February 2024). "మేడారం జాతరకు రూట్ మ్యాప్ ఇదే." Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (1 February 2024). "తెలంగాణలో మేడారం జాతర సందడి.. ఈ రూట్స్‌లో స్పెషల్ బస్సులు". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
- ↑ ETV Bharat News (18 February 2024). "మేడారం మహా జాతరకు సిద్ధమైన ఆర్టీసీ - ఈసారి 6 వేల బస్సుల ఏర్పాటు". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
- ↑ Surya (19 February 2024). "హెలికాప్టర్‌లోనూ మేడారం వెళ్లొచ్చు.. హైదరాబాద్ నుంచి టికెట్ ధర ఎంతంటే" (in ఇంగ్లీష్). Archived from the original on 21 February 2024. Retrieved 21 February 2024.
- ↑ 9.0 9.1 Eenadu (24 February 2024). "సీఎం 66 కిలోలు.. గవర్నర్ 60". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
- ↑ Sakshi (22 February 2024). "మేడారం జాతరకు అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నిస్తాం: కిషన్‌రెడ్డి". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
- ↑ Andhrajyothy (5 February 2024). "మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి". Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
- ↑ "మేడారానికి జాతీయ హోదా ఇవ్వాలి". 24 February 2024. Archived from the original on 24 February 2024. Retrieved 24 February 2024.
- ↑ "సమ్మక్క-సారలమ్మ లను దర్శించుకున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్". 20 February 2024. Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.