Jump to content

రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి

రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. రంగారెడ్డి జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 4 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం రాజేంద్రనగర్ పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలోని రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన

[మార్చు]

రాజేంద్రనగర్ డివిజన్‌లోని మండలాలు:[5]

క్ర.సం రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 శేరిలింగంపల్లి మండలం 26 రెవెన్యూ గ్రామాలు
2 రాజేంద్రనగర్ మండలం 16 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
3 గండిపేట్ మండలం 25 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
4 శంషాబాద్ మండలం 43 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-10-06.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-10-06.
  4. "DIVISIONS | RangaReddy District Government of Telangana | India". Archived from the original on 2021-11-27. Retrieved 2022-10-06.
  5. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-10-06.