Jump to content

రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ

వికీపీడియా నుండి
రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ
జననం1872
దెందుకూరు, మధిర, ఖమ్మం జిల్లా
మరణంఅక్టోబర్ 24, 1918
నివాస ప్రాంతంహైదరాబాద్
జాతీయతఇండియన్
వృత్తిసమాజ సేవకురాలు
భార్య / భర్తరావిచెట్టు రంగారావు
తండ్రిఊటుకూరి వెంకటప్పయ్య

రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞానగ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి.[1] తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.

జననం - వివాహం

[మార్చు]

లక్ష్మీ నరసమ్మ 1872లో ఖమ్మం జిల్లా మధిర ప్రాంతంలోని దెందుకూరులో జన్మించింది. తండ్రి ఊటుకూరి వెంకటప్పయ్య. ఈవిడకు 8వ ఏట 1890లో రావిచెట్టు రంగారావు తో వివాహం జరిగింది.

సేవా కార్యక్రమాలు

[మార్చు]

1897 సంవత్సరంలో రంగారావు కొందరు మరాఠీ మిత్రుల సహకారంతో చతుర్వేదములు, దశోపనిషత్తులు, అష్టాదశ పురాణములు, కావ్యాలు, నాటకాలు, ఇతర సంస్కృత గ్రంధాలతో కూడిన ‘శ్రీ శంకర భగవద్‌ పూజ్య పాద గీర్వాణ మంజూష’ యనే గ్రంథాలయాన్ని తమ ఇంటిలోనే నిర్వహించేవాడు. తొలుత కొంతకాలం తమ బంగళాలోనే నిర్వహించబడ్డ భాషానిలయానికి లక్ష్మీనరసమ్మ గారు తమ సేవలను అందించేది. లక్ష్మీ నరసమ్మ గారు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయముకి అవసరమైన ఇల్లు కొనడానికి 3,000 రూపాయలు విరాళమివ్వగా, ఆ డబ్బుతో ఇప్పుడు సుల్తాన్ బజార్ లో భాషా నిలయం భవనం ఉన్న చోటనే 1910లో ఒక పెంకుటిల్లు కొని, కొన్ని మార్పులు చేసి అందులో గ్రంథాలయం నెలకొల్పడం జరిగింది.

గ్రంథాలయ భవనం కోసం రూ.3000 ఇవ్వడమే కాకుండా ఇంకనూ ఇవ్వగలనని లక్ష్మీనరసమ్మ హామీ ఇచ్చింది. కానీ, ఆ భవనం పూర్తికాకమునుపే ఆవిడ చనిపోయింది.[2]

మరణం

[మార్చు]

లక్ష్మీనరసమ్మ 1918, అక్టోబర్ 24న మరణించింది.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి. "మహిళావరణంలో మణిదీపం". Retrieved 21 September 2017.[permanent dead link]
  2. recruitmenttopper. "Telangana history library movement in Telangana". recruitmenttopper. Archived from the original on 3 అక్టోబరు 2017. Retrieved 21 September 2017.