Jump to content

లక్ష్మణ రేఖ (1975 సినిమా)

వికీపీడియా నుండి
లక్ష్మణ రేఖ
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎన్.గోపాలకృష్ణ
తారాగణం చంద్రమోహన్ ,
జయసుధ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఎ.వి.కె.ప్రొడక్షన్స్
భాష తెలుగు

లక్ష్మణరేఖ 1975, సెప్టెంబర్ 12వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రంలో జయసుధతొలిసారి కథానాయికపాత్రలోనటించింది.చంద్రమోహన్,మురళీమోహన్, మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.

సాంకేతికవర్గం

[మార్చు]
  • నిర్మాతలు: పి.ఎం.షణ్ముగం, ఎ.వి.కృష్ణారావు
  • దర్శకత్వం:ఎన్.గోపాలకృష్ణ
  • కథ: సి.ఎం.త్రివేది
  • మాటలు:సముద్రాల జూనియర్
  • పాటలు: ఆత్రేయ, సి.నారయణరెడ్డి, సముద్రాల జూనియర్, కొసరాజు, ఆరుద్ర
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • గాయకులు: పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,లత
  • కళ: కళాధర్
  • కూర్పు:కందస్వామి
  • నృత్యాలు: పసుమర్తి కృష్ణమూర్తి, రాజు, శేషు, సుందరం, శీను
  • పోరాటాలు: జూడో రత్నం

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు సంగీతం సమకూర్చింది సత్యం[1]

క్ర.సం పాట రచయిత గాయకులు
1 "ఒకమాట ఒకేమాట వలచే రెండు హృదయాలు" సినారె పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
2 "నాడు లక్ష్మణరేఖ దాటిన ఫలితమే నేడు నేను అనుభవించే నరకమూ" సముద్రాల జూనియర్ ఎస్.జానకి
3 "నీదాననురా నీనీడనురా నా రాజా నీవెకావాలిరా" కొసరాజు ఎస్.జానకి
4 "నీ సంగతి నాకు తెలుసు నీకివ్వనురా నామనసు" ఆరుద్ర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
5 "అందరిరాతలు రాసేది ఆ దేవుడు ఆడదానిరాత రాసేది మగవాడు" ఆత్రేయ పి.సుశీల

జడ్జి రాజశేఖరానికి కవిత, ఊర్మిళ అనే ఇద్దరు కూతుళ్ళు. కవిత ఆధునిక భావాలు కలది, ఊర్మిళ సనాతన భావాలు కలది. కవిత రమేష్ అనే అతన్ని ప్రేమిస్తుంది. అతడిని తన పుట్టినరోజుకు ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. అతడు రాలేకపోయినందుకు ఫోన్ చేస్తుండగా రాజశేఖరం ప్రేమకథ కనిపెట్టి ఆమెను మందలించడానికి ప్రయత్నిస్తాడు. ఆమె సమేమిరా అని రమేష్‌నే పెళ్ళాడతానంది. రాజశేఖరం చేసేదేమీ లేక కవితతఓ సరే అతనితో నేను మాట్లాడతాను ఇంటికి పిలవమన్నాడు. ఆరోజు కూడా రమేష్ రాలేదు. ఇక లాభం లేదని రాజశేఖరం గోపాలరావు కొడుకు మోహన్‌కిచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయిస్తాడు. పెండ్లిపీటల మీదకు రావడానికి తుది మెరుగులు దిద్దుకుంటున్న కవితకు అద్దంలో చేతికి కట్టుతోవున్న మోహన్ కనిపిస్తాడు. తాను యాక్సిడెంట్‌కు గురయ్యానని, హాస్పెటల్ నుండి నేరుగా వస్తున్నాని చెబుతాడు. కవిత ఇప్పటికే అంతా విషమించిందని చెబుతుంది. విషమించిన జీవితానికి విషమే శరణ్యమని రమేష్ విషం తాగబోతుండగా కవిత అతడిని వారించి అతనితో లేచిపోతుంది. ఈ విషయం తెలిసిన జడ్జి ఆత్మహత్య చేసుకోబోగా ఊర్మిళ అడ్డుపడి మోహన్‌ని వివాహం చేసుకుని తండ్రి పరువు కాపాడుతుంది. మద్రాసులో మా అత్తయ్య ఉందని రమేష్ కవితను తీసుకువెళ్ళి మంజువాణి అనే వేశ్యకు పదివేల రూపాయలకు అమ్మివేస్తాడు. తాను మోసపోయానని తెలుసుకున్న కవిత కుమిలిపోతుంది. తన జీవితాన్ని నాశనం చేసిన రమేష్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి నిరీక్షిస్తూ ఉంటుంది. రమేష్ మోహన్‌కు పరిచయమై వారి ఇంటికి వెళుతూ ఉంటాడు. మోహన్‌కు, ఊర్మిళకు మనస్పర్ధలు కలిగేలా చేస్తాడు. దాంతో మోహన్ ఇంటినుండి వెళ్ళిపోతాడు. తన జీవితం నాశనం చేసిందే కాక తన చెల్లెలి సంసారంలో చిచ్చుపెట్టాడని తెలిసి కవిత ఉగ్రరూపం దాల్చింది. కవిత ఏవిధంగా రమేష్‌కు బుద్ధి చెప్పి తన పగ తీర్చుకున్నది, మోహన్ ఎలా నిజం తెలుసుకున్నాడు, ఊర్మిళను, మోహన్‌ను కలిపి కవిత ఏమయింది మొదలైన విషయాలు చివరలో తెలుస్తాయి[1].

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 తారకరామ. లక్ష్మణరేఖ పాటలపుస్తకం. p. 8. Retrieved 22 August 2020.

బయటి లింకులు

[మార్చు]