Jump to content

లోఫర్ (సినిమా)

వికీపీడియా నుండి
లోఫర్ (సినిమా)
దర్శకత్వంపూరి జగన్నాధ్
రచనపూరి జగన్నాధ్
నిర్మాతసి.కళ్యాణ్
తారాగణంవరుణ్ తేజ్
దిశా పటాని
ఛాయాగ్రహణంపి.జి. వింద
కూర్పుఎస్.ఆర్.శేఖర్
సంగీతంసునీల్ కష్యప్
విడుదల తేదీ
17 డిసెంబరు 2015 (2015-12-17)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్25కోట్లు
బాక్సాఫీసు30కోట్లు

లోఫర్ అనే సినిమా 2015 డిసెంబరు 17 లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్, దిశా పటాని, రేవతి, పోసాని, తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.[1][2][3] ఈ చిత్రం 2015 డిసెంబరు 17న ప్రపంచవ్యాప్తంగా 750 కి పైగా స్క్రీన్లలో విడుదలైంది. విమర్శకుల నుండి బాగాలేదనే సమీక్షలు వచ్చాయి. ఇది తరువాత లోఫర్ ది హీరో పేరుతో హిందీ లోకి అనువదించారు. తరువాత దీనిని తమిళంలోకీ అనువదించారు.

మురళి ( పోసాని కృష్ణ మురళి ), అతని భార్య లక్ష్మీ దేవి ( రేవతి ) లు రాజా ( వరుణ్ తేజ్ ) తల్లిదండ్రులు. మురళి, తన అత్తమామల నుండి డబ్బు డిమాండు చేస్తూంటాడు. దీనివల్ల లక్ష్మీదేవి అతని నుండి విడిపోతుంది. మురళి భార్యకు తెలియకుండా తమ కుమారుడు రాజాను దొంగిలించి జోధ్‌పూరుకు తీసుకు వెళతాడు, అక్కడ వారు చిన్నాచితకా దొంగతనాలు చేస్తూ నివసిస్తూంటారు. తనకిష్టం లేని పెళ్ళి నుండి తప్పించుకుని పారిజాతం ( దిషా పటాని ) అనే అమ్మాయి జోధ్పూర్ చేరుకుంటుంది. రాజా, పారిజాతాలు ప్రేమలో పడతారు.[4]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఐదు పాటలతో కూడిన అధికారిక సౌండ్‌ట్రాక్‌ను సునీల్ కశ్యప్ స్వరపరిచారు. ప్రభాస్ ముఖ్య అతిథిగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆడియో విడుదల కార్యక్రమం జరిగింది.

క్రమసంఖ్య పేరుగాయనీ గాయకులు నిడివి
1. "నొక్కేయ్ దోచేయ్"  సునీల్ కశ్యప్, స్ఫూర్తి  
2. "నువ్వేడుస్తుంటే"  యజీన్ నాజర్  
3. "దియా జలే"  యజీన్ నాజర్, ప్రణవి  
4. "సువ్వీ సువ్వాలమ్మా"  కారుణ్య  
5. "చుట్టా బీడీ"  రాహుల్, శ్రావణ భార్గవి  

మూలాలు

[మార్చు]
  1. Kumar, Hemanth (15 January 2017). "Varun Tej pips Nithiin to bag Puri Jagannadh's next". The Times of India. Retrieved 6 June 2020.
  2. "Mega Family: Varun Tej Loafer Firstlook Released"
  3. "First Look: Varun Tej in Loafer"
  4. "Loafer review. Loafer Telugu movie review, story, rating - IndiaGlitz.com".