అక్షాంశ రేఖాంశాలు: 16°49′7″N 81°48′43″E / 16.81861°N 81.81194°E / 16.81861; 81.81194

వాడపల్లి (ఆత్రేయపురం మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాడపల్లి (ఆత్రేయపురం మండలం)
వాడపల్లి రైతుల తిరుబాటు స్థూపం
వాడపల్లి రైతుల తిరుబాటు స్థూపం
పటం
వాడపల్లి (ఆత్రేయపురం మండలం) is located in ఆంధ్రప్రదేశ్
వాడపల్లి (ఆత్రేయపురం మండలం)
వాడపల్లి (ఆత్రేయపురం మండలం)
అక్షాంశ రేఖాంశాలు: 16°49′7″N 81°48′43″E / 16.81861°N 81.81194°E / 16.81861; 81.81194
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంఆత్రేయపురం
విస్తీర్ణం2.91 కి.మీ2 (1.12 చ. మై)
జనాభా
 (2011)
2,481
 • జనసాంద్రత850/కి.మీ2 (2,200/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు1,265
 • స్త్రీలు1,216
 • లింగ నిష్పత్తి961
 • నివాసాలు720
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533237
2011 జనగణన కోడ్587566

వాడపల్లి, కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలంలో గోదావరి వడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం., ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. ఇది మండల కేంద్రమైన ఆత్రేయపురం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమండ్రి నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 720 ఇళ్లతో, 2481 జనాభాతో 291 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1265, ఆడవారి సంఖ్య 1216. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 209 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 5. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 587566[2].

వాడపల్లి

గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,231. ఇందులో పురుషుల సంఖ్య 1,135, మహిళల సంఖ్య 1,096, గ్రామంలో నివాస గృహాలు 556 ఉన్నాయి.

వాడపల్లిగా మారిన ఓడపల్లి

[మార్చు]

వాడపల్లి ఒకప్పుడు "ఓడపల్లి" అనే పేరుండేది. సంస్కృతంలో దాన్నే "నౌకాపురి" అన్నారని స్థానికుల కథనం. వాడపల్లి, వెంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మింపజేసింది. గొప్ప భగవద్ భక్తుడని కీర్తివహించిన పుణ్యమూర్తి పినపోతు గజేంద్రుడు జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లి గ్రామంలో జన్మించాడు. అగ్నికులక్షత్రియ సామాజికవర్గానికి చెందినవాడు, [ఆధారం చూపాలి] రఘుకుల గోత్రిజ్ఞులు.

పినపోతు గజేంద్రుడు నౌకావ్యాపారి, చాలా ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను సభవించగా అతని ఓడలన్నీ సముద్రగర్భంలో అదృశ్యమయ్యాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి, గట్టున ప్రతిష్ఠించి, గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కుకున్నాడు. తుఫాను వెలిశాక, ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికిచ్చిన మాట ప్రకారం అ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు. పురాణ కథ ప్రకారం వాడపల్లిగా మారింది.

1700 సంవత్సరంలో పినపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి  గొప్ప సంపన్నులు అయినారు.

1759 వ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి  దూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్రవైఢూర్యాలను విరాళంగా ఇచ్చారు భక్త శిఖామణిగా పేరు పొందారు.

క్షేత్ర చరిత్ర, ప్రత్యేకతలు

[మార్చు]
వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం
  • తిరుపతి, ద్వారకా తిరుమలల తరువాత అత్యంత ప్రజాధరణ పొందిన క్షేత్రం వాడపల్లి. గౌతమీ నది తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. కొద్ది దూరాలలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున, లోల్లకు ఆనుకొని ఉండుటతో లోల్లవాడపల్లిగా పిలుస్తారు.
  • ఇక్కడి దేవాలయములోని మూర్తి ధారు మూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూచేందుకు శిలలాగే ఉంటుంది. ఇక్కడకల శిలా ఫలకం ఆధారంగా ఈ క్షేత్ర చరిత్ర ఈ విదంగా ఉంది. వైకుంటంలో ఒకసారి సనకసనందాది మహర్షులు నారాయణుని దర్శించుకొన వచ్చి భూలోకమున పాపము పెరుగుతున్నది. అధర్మం, అన్యాయం పెరుతున్నవి. వాటిని తగ్గించు మార్గం చూపమని వేడుకొన్నారు. అపుడు విష్ణువు వారితో అధర్మం ప్రభలినపుడు నేను అనేక రూపాలలో అవతరించాను అలానే కలియుగంలో అర్చాస్వరూపుడనై భూలోకంలో లక్ష్మీ క్రీడా స్థానమై మానవుల పాపములను కడుగుచున్న గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురం అను ప్రదేశమున వెలయుదును. లక్ష్మీ సహితంగా ఒక చందన వృక్షపేటికలో గౌతమీ ప్రవాహమార్గంలో నౌకాపురి చేరుకొంటాను. ఈ విషయాలను నారదుని ద్వారా ప్రజలకు తెలియజేయమని చెప్తాడు.
  • కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకొస్తున్న చందన వృక్షం కనిపించగా ఒడ్డుకు తీసుకురావాలని వెళ్ళిన వాళ్ళకు కనిపించకపోవడం జరుగుతుండేది. ఒకరోజు ఊరిలో కల వృద్ద బ్రాహమణుడి కలలో స్వామి కనిపించి కలి ప్రభావంతో మీరు నన్ను చూడలేకున్నారు. తెలవారక ముందే అందరూ సుచిగా గౌతమీ స్నానంతో పవిత్రులై మంగళవాయిద్యాలతో నౌకలో నదీగర్భంలోకి వెళితే కృష్ణగరుడపక్షి వాలి ఉన్నచోటులో నేనున్న చందన పేటిక దొరుకుతుందని చెప్పాడు. ప్రజలు స్వామి ఆదేసానుసారం వెళ్లగా చందనపేటిక కనిపిస్తుంది. దానిని నిపుణుడైన శిల్పితో తెరిపించగా దానిలో శంఖ,చక్ర, గదాయుదుడైన నారాయుణుడి విగ్రహం కనిపిస్తుంది. దానితో గతంలో నారదాదుల వలన తెలిసిన విసేషాలతో ఆ అర్చావతారరూపమునకు గౌతమీ తీరాన దేవాలయం నిర్మించి అందే మూర్తిని ప్రతిష్ఠకావించి పూజించుట ప్రారంభిస్తారు.
  • పూర్వపు ఆలయం గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో ఉండుట వలన కోతలతో నదీ గర్భంలో కలిసిపోగా తదనంతర ప్రస్తుత ఆలయాన్ని పినపోతు గజేంద్రుడు అనే అగ్నికులక్షత్రియ వంశానికి చెందినవారు నిర్మించారు. 1700 సంవత్సరంలో పినపోతు గజేంద్రుడు గారు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు దిగుమతులు చేసి  గొప్ప సంపన్నులు అయినారు. 1759 వ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి  దూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్రవైఢూర్యాలను విరాళంగా ఇచ్చారు భక్త శిఖామణిగా పేరు పొందారు

ఇతర విశేషాలు

[మార్చు]

గోదావరి వడ్డున ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మార్చినెలలో సర్వ ఏకాదశి రోజునుండి ఐదు రోజులపాటు జరిగే కళ్యాణోత్సవాలు తిరునాళ్ళకు అశేషంగా ప్రజలు తరలి వస్తుంటారు. ఈ ఉత్సవాలలో మరో ప్రత్యేకత ఊరిలోగల వర్ణాల వారు ఒక్కొక్క గుంపుగా ఏర్పడి ఈ ఐదురోజులు అన్నసంతర్పణ కార్యక్రమములు ఎవరికి వారుగా నిర్వహిస్తుంటారు. వాడపల్లి ఉత్సవాలకు వెళ్ళే భక్తులను భోజనానికి మావద్దకు రండిఅంటే మావద్దకురండి అని పిలుస్తూంటారు.

ఆశ్రమాలు

[మార్చు]
  • ఇక్కడ కొన్ని ఆశ్రమములు కలవు వీటితో పాటు ఆశ్రమ పాఠశాలలు కూడా నడుపబడుచున్నవి.
  • ఈ గ్రామం.[3] సినిమా షూటింగులకు ప్రసిద్దం. ఆత్రేయపురం మాదిరిగానే వాడపల్లి పూతరేకులుకు ప్రసిద్ధి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి లొల్లలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆత్రేయపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల రాజమండ్రిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ రాజమండ్రిలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమండ్రిలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

సమీప ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

వాడపల్లిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది.ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి  గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి.

ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

వాడపల్లిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 62 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 228 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 38 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 189 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

వాడపల్లిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 91 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 98 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

వాడపల్లిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, కొబ్బరి, అరటి

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-08.