వేగివాడ
వేగివాడ | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°51′56.1996″N 81°9′30.1194″E / 16.865611000°N 81.158366500°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు |
మండలం | పెదవేగి |
విస్తీర్ణం | 9.65 కి.మీ2 (3.73 చ. మై) |
జనాభా (2011)[1] | 4,763 |
• జనసాంద్రత | 490/కి.మీ2 (1,300/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 2,392 |
• స్త్రీలు | 2,371 |
• లింగ నిష్పత్తి | 991 |
• నివాసాలు | 1,277 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 534452 |
2011 జనగణన కోడ్ | 588372 |
వేగివాడ, ఏలూరు జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామం.ఏలూరు నుండి ముండూరు మీదుగా తడికెలపూడి వెళ్ళే రోడ్డు మార్గములో ఈ గ్రామం ఉంది. ఈ ఊరు, చక్రాయగూడెం జంట గ్రామాలు. ఇది ఏలూరు నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఊరిలో కొబ్బరి అభివృద్ధి సంస్థ ఉంది.
ఇది మండల కేంద్రమైన పెదవేగి నుండి 20 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1277 ఇళ్లతో, 4763 జనాభాతో 965 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2392, ఆడవారి సంఖ్య 2371. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 586 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 27. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588372.[2] గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
వేగివాడలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
వ్యవసాయం, వృత్తులు
[మార్చు]సమీపంలోని ప్రముఖ పట్టణం, ఏలూరు నుండి గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది. గ్రామ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ఆధారితమైనది. పాల ఉత్పత్తి ప్రజల మరో జీవనాధారం.ఈ ఊరిలో వరి, కొబ్బరి, నిమ్మ, కూరగాయలుమొక్కజొన్న ప్రధానమైన పంటలు. చుట్టుప్రక్కల తాడిచెట్లు బాగా ఎక్కువ. కల్లుగీత కూడా ముఖ్యమైన వృత్తి. ఇక్కడ తేగలు (తాటికాయ గింజలు పాతిపెడితే వచ్చే మొలకలు, తినడానికి బాగుంటాయి) బాగా అమ్ముతారు.
గ్రామంలోని పాఠశాలలు
[మార్చు]- ఆర్.సి.యం.ఉన్నత పాఠశాల,
- ఆర్.సి.యం.ప్రాథమిక పాఠశాల,
- సి.యస్.ఐ.ప్రాథమిక పాఠశాల.
కమ్యూనికేషన్
[మార్చు]చాలా కాలంనుండి టెలిఫోన్ సౌకర్యాలున్నాయి. మారుతున్న కమ్యూనికేషన్ రంగం వల్ల సెల్‌ఫోనుల వినియోగం ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. కేబుల్ టెలివిజన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి.
ప్రార్థనాలయాలు
[మార్చు]- ఆలయాలు
బస్ స్టాండు వద్ద ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఇంకా గ్రామంలో అంకమ్మ తల్లి అలయం, రామాలయం, నాగేంద్రస్వామి గుడి ఉన్నాయి. ప్రతి సంవత్సరం నాగేంద్ర స్వామి గుడి దగ్గర తిరునాళ్ళు ఘనంగా జరుగుతాయి.
- చర్చిలు
గ్రామంలో ఆర్.సి.యం.చర్చి, సి.యస్.ఐ.చర్చి ఉన్నాయి.
- మసీదులు
ఈ గ్రామంలో ఒక మసీదు ఉంది.
వైద్యం
[మార్చు]చాలా కాలంగా వూళ్ళలోని ఒకరిద్దరు ఆర్.ఎమ్.పి. వైద్యులు చుట్టుప్రక్కల గ్రామాలలో అత్యవసర వైద్య సదుపాయం అందించేవారు. కాని ముఖ్యమైన చికిత్సావసరాల కోసం ఏలూరు వెళ్ళక తప్పదు. ఇటీవల పెరిగిన ప్రయాణ సదుపాయాల వలన అది అంత కష్టం కావడంలేదు.
పరిసర ప్రాంతాలు
[మార్చు]వేగివాడ చుట్టూ చక్రాయగూడెం, కన్నాపురం, తాళ్ళ గోకవరం, బత్తెవరం, ధర్మారావు పేట, సీతరామపురం, కాలని, మేదినరావుపాలెం అనే చిన్న గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు అన్నిటికి వేగివాడ ప్రధాన కూడలిగా ఉంటుంది.ఈ గ్రామంలో ఊర చెరువు, గండి చెరువు, మోదుల చెరువు, మతు కుంట ఉన్నాయి. గ్రామంలో కరంటు సబ్ స్టేషను ఉంది. కేంద్ర ప్రభుత్వం వారి కొబ్బరి అభివృద్ధి సంస్థ ఉంది.
ఇతర సమాచారం
[మార్చు]- గ్రామదేవత: అంకమ తల్లి
- పిన్ కోడ్: 534452
- టెలిఫోన్ యస్.టి.డి కోడ్: 08812
ఇతర విశేషాలు
[మార్చు]- ఈ వూళ్ళో ప్రతి ఆదివారం జరిగే సంత ఒక ముఖ్యమైన ఆకర్షణ. ఈ గ్రామంలో వివిధ వర్గాలకు, మతాలకు చెందిన ప్రజలు ఉన్నపటికి అత్యంత శాంతి సౌభాగ్యాలతో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
- రాష్ట్రంలో చాలా ప్రాంతాలలాగానే రైతులు అరకొర ఆదాయంతోను, వర్షాభావ పరిస్థితులతోను, అకాలవర్షాలతోను సతమతమవుతున్నారు. వ్యవసాయంపైన వచ్చే ఆదాయం నిలకడగా ఉండకపోవడం, పెట్టుబడులు, ఖర్చులు బాగా పెరిగిపోవడం వలన వ్యవసాయం గిట్టుబాటుగా ఉండడంలేదు. ఇందుకు తోడు కొద్దిమంది పెద్దరైతులను మినహాయిస్తే చాలా వరకు చిన్న చిన్న కమతాలు. రోజు రోజుకు రైతులకు భూమితో ఉన్న అనుబంధం పలుచబడుతుంది.
- పోలవరం ప్రాజెక్టుకు అనుబంధంగా గోదావరి-కృష్ణా నదులను కలిపే కాలువ ఈ వూరి సమీపంనుండి వెళుతుంది. ప్రస్తుతం (2008లో) నిర్మాణంలో ఉన్న ఈ కాలువ ద్వారా నీటి సదుపాయం కలిగితే ఈ ప్రాంత వ్యవసాయంలో గణనీయమైన మార్పులు రావచ్చునని రైతులు భావిస్తున్నారు.
- వేంగి నగరం (ఇప్పటి పెదవేగి గ్రామం) ఒకప్పటి తూర్పు చాళుక్యుల రాజధాని. ఆ సమయంలో "వేగివాడ"ను "చినవేగి" అనేవారు. పెదవేగి నుండి చినవేగి వరకు ఒక భూగర్భ సొరంగం ఉన్నదని అంటారు. వేగివాడలో కొన్ని విశేషమైన శిల్పాలు కనిపించాయని ఒక చరిత్ర అధ్యాపకుడు చెప్పాడు.[3]
- సత్వవోలు రాంబాబు అనే చిత్రకారుడు బ్రష్షులలాంటి పరికరాలు లేకుండా కేవలం తన ముక్కుతోనే పెయింటింగ్‌లు వేస్తుంటాడు. ఇతని స్వస్థలం వేగివాడ.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి, సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప అనియత విద్యా కేంద్రం పెదవేగిలోను, వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు ఏలూరు లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]వేగివాడవరంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో 3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.
పారిశుధ్యం
[మార్చు]గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]వేగివాడవరంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]వేగివాడవరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 194 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 19 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 4 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు
- బంజరు భూమి: 17 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 729 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 17 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 729 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]వేగివాడవరంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- బావులు/బోరు బావులు: 729 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]వేగివాడవరంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]మూలాలు, వనరులు
[మార్చు]- ↑ ఇక్కడికి దుముకు: 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ హిందూ దినపత్రిక, ఫిబ్రవరి 24, 2005 Archived 2008-02-23 at the Wayback Machine- B. Emmanuel, lecturer in history, Sir C.R. Reddy College, in his paper on "Cultural heritage of Vengi presented at the seminar said that there was enough evidence available to suggest the existence of underground tunnels connecting Eluru and Vegivada which was called China Vengi during the period of the Chalukyas. Although excavation works were undertaken some time ago to unearth this underground route, they were hampered due to some hindrances, he said. He said that in the course of his study he was told by the local people of Vegivada that they had stumbled upon strange relics like idols when they dug some places around their village.