Jump to content

సలీం (రచయిత)

వికీపీడియా నుండి
(సయ్యద్ సలీం నుండి దారిమార్పు చెందింది)
సలీం
జననం1 జూన్ 1959.
త్రోవగుంట, భారతదేశం.
ఇతర పేర్లుసలీం
వృత్తిరచయిత
తండ్రిజాఫర్
తల్లిఅన్వర్ బీ

సయ్యద్ సలీం 1959 జూన్ ఒకటో తేదీన జాఫర్, అన్వర్ బీలకు జన్మించారు.[1] భద్రిరాజు జన్మించిన ఒంగోలు సమీపంలో త్రోవగుంట అనే గ్రామంలో జన్మించారు. మానవత్వాన్ని మించిన మతం లేదనీ, అదే తన అభిమతంగా, కథలు, నవలలు, కవితలు రాశారు.

సాహితీ ప్రస్థానం

[మార్చు]

ఇంటర్ చదివే రోజుల్లోనే 'సమర సాహితి' అనే సంస్థకి కార్యదర్శి అయ్యారు. కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్సీ. పట్టా పొందారు. 1996లో తొలిసారిగా స్వాతిచినుకులు పేరుతో కథల సంపుటి ప్రచురించారు. 1999లో నిశ్శబ్ద సంగీతం అనే కథల సంపుటి, నీలోకి చూసిన జ్ఞాపకం అనే తొలి కవితా సంపుటినీ ప్రచురించారు. 2001లో జీవన్మృతులు, 2003లో వెండిమేఘం అనే నవలలు రాశారు. 2004లో రూపాయి చెట్టు కథల సంపుటి ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. ఆయన రాసిన కాంచనమృగం నవల ఆటా సంస్థ నిర్వహించిన పోటీల్లో బహుమతి పొందింది. మెహర్, బురఖా, తలాక్, ఆరో అల్లుడు వంటి కథల ద్వారా ముస్లిం సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో ఉన్న రుగ్మతల్ని ఖండించారు. సలీం సంస్కరణవాది. ఇప్పటివరకు వీరు మూడు కవితా సంపుటాలు, 10 కథా సంపుటాలు, 25 నవలలు వెలువరించారు.[2]

పురస్కారాలు

[మార్చు]

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ధర్మనిధి పురస్కారం ఇచ్చింది. 2003లో అధికార భాషా సంఘం భాషా పురస్కారం, 2005లో ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు వచ్చాయి. ఆయన కథలు పది కన్నడంలోకి అనువాదమయ్యాయి. మూడు కథలు హిందీలోకి వెళ్తే, పెంగ్విన్ బుక్స్ సంస్థ మెహర్ కథని ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించింది. 2010 లో ఈయన రాసిన నవల కాలుతున్న పూలతోటకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది.[3] వెండి మేఘం నవలకు తెలుగు యూనివర్సిటీ సాహితీ పురస్కారం, వి ఆర్ నార్ల పురస్కారం లభించాయి. రూపాయి చెట్టు కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక పురస్కారం, కథకు చాసో సాహిత్య పురస్కారం, నవలా రచనకు వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం, కొవ్వలి సాహితీ పురస్కారం లభించాయి.[1] వెండిమేఘం నవల ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీల్లో ఎం.ఏ తెలుగు విద్యార్థులకు పాఠ్య పుస్తకంగా ఉంది.

కవితలు:

         కాలేజీ రోజులనుంచే కవితావ్యాసంగం ప్రారంభమై, ఇప్పటివరకు నూట యాభైకి   పైగా కవితలు వివిధ పత్రికల్లో అచ్చయినాయి. కొన్ని కవితలు  కన్నడం, ఆంగ్ల భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి.  మూడు కవితా సంపుటాలు వెలువడ్డాయి.

         1. నీలోకి చూసిన జ్ఞాపకం ... 1999

         2. ఆకులు రాలే దృశ్యం   ... 2005

         3. విషాద వర్ణం            ... 2013

కథలు:

         ఇప్పటివరకు  మూడువందలకు పైగా కథలు వివిధ దిన, వార, మాస పత్రికల్లో ప్రచురించ బడ్డాయి. మొదటికథ ‘మనీషి’ 1980 లో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించబడింది. చాలా కథలకు  బహుమతులొచ్చాయి. పలు కథలు ఇతర భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. వీటిలో ప్రము ఖంగా మానవత్వాన్ని గుర్తుచేసే కథలు, మంచితనాన్ని తట్టిలేపే కథలే ఎక్కువ. ఇప్పటివరకు పదకొండు కథాసంపుటాలు వెలువడ్డాయి.

1. స్వాతి చినుకులు    ... 1996

2. నిశ్శబ్ద సంగీతం     ... 1999

3. రూపాయి చెట్టు      ... 2004

4. చదరపు ఏనుగు     ... 2006

5. రాణీగారి కథలు     ... 2008

6. ఒంటరి శరీరం      ... 2009

7. రెక్కల హరివిల్లు     ... 2011

8. అంతర్గానం                   ... 2014

9. నీటి పుట్ట             ... 2017

10. మాయ జలతారు  ... 2018

11. నీడ                  ... 2023

రాణీగారి కథలు మతసామరస్యాన్ని చాటిచెప్పే కథలు. ముస్లిం మతస్థుడైన సైఫ్,  సనాతన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రాణి ప్రేమించుకుని పెళ్ళిచేసుకుంటారు. ఆ క్రమంలో వాళ్ళకెదురైన సామాజిక, సాంస్కృతిక, వ్యావహారిక, మతపరమైన సమస్యలు... వాటిని సామరస్య పూర్వకంగా ఎదుర్కొని ఆదర్శ జంటగా ఎలా నెగ్గుకొచ్చారో సున్నితమైన హాస్యాన్ని, సునిశితమైన  వ్యంగ్యాన్ని జోడించి చెప్పిన కథలి వి. మతాలకతీతంగా ప్రేమనీ, మానవత్వాన్ని ఎలా బతికించు కోవచ్చో ఈ కథల్లో విశదపర్చటం జరి గింది. ఇవి మాటీవీలో సీరియల్‌గా 56 ఎపిసోడ్లలో ప్రసారం చేయబడ్డాయి. ఈ కథలు అనేక  భారతీ య  భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి.

నవలలు:

ఇప్పటివరకు ముప్పయ్ నవలలు ప్రచురించబడ్డాయి. రెండో నవల ‘వెండి మేఘం’  తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని దక్కించుకుంది. ‘కాలుతున్న పూలతోట’ నవలకు 2010 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ‘అనూహ్య పెళ్ళి’ నవల ఉమ్మడి  ఆంధ్ర రాష్ర్ట సాంస్కృతిక శాఖ నిర్వహించిన నవలల పోటీలో బహుమతి గెల్చుకుంది. ‘అనామిక డైరీ’ నవలకు ఆటా నవ్య వీక్లీ సంయుక్తంగా నిర్వహించిన    పోటీలో మొదటి బహుమతి లభించింది. ‘మేధ  017’, ‘ఆపరేషన్ కైటిన్’, ‘గుహలో ఒకరోజు’, ‘అంగారక గ్రహం మీద అంతిమ విజయం’ నవలికలకు తానా- మంచి పుస్తకం సంయుక్తంగా నిర్వహించిన  బాల సాహిత్యంలో నవలల  పోటీలో బహు మతి లభించింది. ‘మిషన్ ఎపిటీసియా’ అనే నవలిక బాలల సైన్స్ ఫిక్షన్ నవలల పోటీలో 2022 సంవత్సరానికి ఉత్తమ నవలగా ఎంపికైంది.

1. జీవన్మృతులు (2001)

2. వెండి మేఘం (2003)

3. కాంచన మృగం (2006)

4. కాలుతున్న పూలతోట (2006)

5. పడగనీడ (2010)

6. మరణ కాంక్ష (2012)

7. గుర్రపు డెక్క (2013)

8. అనూహ్య పెళ్ళి (2013)

9. అనామిక డైరీ (2014)

10. అరణ్యపర్వం (2015)

11. కావ్యాంజలి (2016)

12. మౌన రాగం (2016)

13. మేధ 017 (2016)

14. అపరాజిత (2016)

15. అన్వేషణ (2017)

16. దూదిపింజలు (2017)

17. లిటిల్ జూలీ (2017)

18. ఎడారి పూలు (2018)

19. గర్భ గుడి (2018)

20. పగడపు దీవి (2018)

21. గుహలో  ఒక రోజు (2019)

22. పడిలేచే కెరటం (2019)

23. ఆపరేషన్ కైటిన్ (2019)

24.  రెండు ఆకాశాల మధ్య (2020)

25. మనోజ్ఞ (2021)

26. అంగారకగ్రహం మీద అంతిమవిజయం (2021)

27. లోపలి విధ్వంసం (2021)

28. మిషన్ ఎపిటీసియా (2022)

29. లోహ విహంగం (2023)

30. చీకటి చివర్న వెల్తురు (2023)

అవార్డులు - బహుమతులు:

1. ‘‘కాలుతున్న పూలతోట’’ నవలకు 2010 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

2. ‘‘వెండి మేఘం’’ నవల ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్శిటీ, మహాత్మా గాంధి      యూనివర్శిటీ, తెలంగాణ యూనివర్శిటీ , బెంగుళూరు యూనివర్శిటీ ల్లో యం.ఏ తెలుగు విద్యార్థులకకు పాఠ్యపుస్తకంగా నిర్ణయించబడింది.

3. ‘‘ఆరో అల్లుడు’’ కథకు బెంగుళూరు విశ్వవిద్యాలయంవారు ప్రచురించిన వరల్డ్   బెస్ట్ స్టోరీస్   రెండో సంపుటిలో స్థానం

4. అధికార భాషాసంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టం నుంచి ‘‘భాషా పురస్కారం’’ 2003

5. కథా రచనకు గాను తెలుగు యూనివర్సిటీ నుంచి ధర్మనిధి పురస్కారం 2003

6. నవలా రచనకు గాను విశాలాంధ్ర స్వర్ణోత్సవ పురస్కారం 2003

7. ‘‘రూపాయిచెట్టు’’ కథా సంపుటికి ‘‘మాడభూషి రంగాచారి స్మారక పురస్కారం’’ 2004              

8. ‘‘వెండి మేఘం’’ నవలకు తెలుగు యూనివర్సిటీ ‘‘సాహితీ పురస్కారం’’ 2004

9. ఢిల్లీ తెలుగు అకాడమి నుంచి ‘‘రాష్ట్రీయ వికాస్ శిరోమణి’’ అవార్డు 2005

10. కథారచనకు గాను పులికంటి సాహితీ సత్కృతి 2005

11. ‘‘వెండి మేఘం’’ నవలకు వి. ఆర్. నార్ల సాహితీ పురస్కారం 2005

12. నవలా రచనకు గాను ‘‘వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం’’ 2007

13. జ్యోత్స్న కళాపీఠం వారి ఉగాది పురస్కారం 2007

14. కథా రచనకు గాను ‘‘చాసో సాహిత్య పురస్కారం’’ 2008

15. రూపాయిచెట్టు, చదరపు ఏనుగు కథాసంపుటాలకు ‘‘విశాల సాహితీ పురస్కారం’’  2008

16. ‘‘కాలుతున్న పూలతోట’’ నవలకు ‘‘కొవ్వలి సాహితీ పురస్కారం’’ 2009

17. ‘‘కాలుతున్న పూలతోట’’ నవల హిందీ అనువాదం ‘‘ నయీ ఇమారత్ కె ఖండహర్’’ కి  నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్, ఢిల్లీ వారి పురస్కారం 2009

18. ఆంధ్ర నాటక కళాసమితి నుంచి ‘‘తటపర్తి వరలక్ష్మి స్మారక ఉగాది పురస్కారం’’ 2011

19. అభ్యుదయ ఫౌండేషన్, కాకినాడ నుంచి ‘‘అభ్యుదయ సాహితీ పురస్కారం’’ 2012

20. డా. నాగభైరవ స్మారక సాహితీ పురస్కారం 2014

21. మొజాయిక్ లిటరరీ అవార్డ్, విశాఖపట్నం 2018        

అనువదించబడిన గ్రంథాలు:    

1. Ocean and other stories - Dr.Bhargavi Rao and Mrs Sujatha Gopal

2.  Three dimensions and other stories - Mrs Sujatha Gopal

3.  Silent storm - Dr.P. Jayalaxmi

4.  A dove from the hillock - Dr. P. Jayalaxmi

5.  Shadow of hood -  S.V. Subba Rao

6.  A Desire for death – Saleem

7.  A ray of sunshine – Dr. P. jayalaxmi

8.  Seven steps to your heart – R.H. Saraswati

9.  Soaring on broken wings – Saleem

10.  Deserted flowers – Dr. Indira Bobbelapati

11.  Struggling to survive - Dr. Indrasena Reddy

12.  Devastation within - Dr. Indrasena Reddy

13.  Between the two skies - Dr. Indrasena Reddy

14.  Fall and rise of a tidal wave – Dr. Indrasena Reddy

15. నయీ ఇమారత్ కే ఖండహర్ (హింది) - శ్రీమతి శాంత సుందరి

16. సునహరీ ధూప్ (హింది) - శ్రీమతి శాంత సుందరి

17. సునహరా బాదల్ (హింది) - డా. కొమ్మిశెట్టి మోహన్

18. జంగల్ కే ఫూల్ (హింది) - డా. కొమ్మిశెట్టి మోహన్

19. రేగిస్తాన్ కే ఫూల్ (హింది) - డా. కొమ్మిశెట్టి మోహన్

20. దో ఆకాశ్ (హింది) - డా. కొమ్మిశెట్టి మోహన్

21. సొనేరీ మేఘ్ (మరాఠి) - శ్రీ మకరంద కులకర్ణి

22. తీన్ బాజు ఆణి ఇతర గోష్ఠి (మరాఠి) - శ్రీ కమలాకర్ ధారప్

23. తలాక్ ఆణి ఇతర కథా (మరాఠి) - శ్రీ కమలాకర్ ధారప్

24. రాణీచి గోష్ట్ (మరాఠి) - శ్రీ కమలాకర్ ధారప్

25. మరణ్ దేతా కా కోయీ మరణ్ (మరాఠీ) - శ్రీ కమలాకర్ ధారప్

26. ఉధ్వస్త ఆసియానా (మరాఠీ) - శ్రీ కమలాకర్ ధారప్

27. మరణ కాంక్షె (కన్నడ) - శ్రీ జి. వీరభద్రగౌడ

28. రాణి కథేగళు (కన్నడ) - శ్రీ జి. వీరభద్రగౌడ

29. ఉరియతిరువ హూబన (కన్నడ) - శ్రీ జి. వీరభద్రగౌడ

30. కాడువ కథేగళు (కన్నడ) - శ్రీ దేవకవి నా. ధనపాల

31. జీవన్మృతరు (కన్నడ) - శ్రీ దేవకవి నా. ధనపాల

32. మేధ 017 (కన్నడ) - శ్రీ దేవకవి నా. ధనపాల

33. అపరాజిత (కన్నడ) - శ్రీ దేవకవి నా. ధనపాల

34. కాడువ కథేగళు -2 (కన్నడ) - శ్రీ దేవకవి నా. ధనపాల

35. ఆపరేషన్ కైటిన్ (కన్నడ) - శ్రీ దేవకవి నా. ధనపాల

36. గుహయెల్లి ఒందు దిన (కన్నడ) - శ్రీ దేవకవి నా. ధనపాల

37. అనామిక డైరీ (కన్నడ) - కస్తూరి

38. అనూహ్య కళ్యాణ (కన్నడ)  - కస్తూరి

39. అన్వేషణె (కన్నడ) - కస్తూరి

40. మరుభూమియ హూగలు (కన్నడ) - కస్తూరి

41. అలెగళు నిల్లువుదిల్ల (కన్నడ) - కస్తూరి

42. అరణ్య పర్వ (కన్నడ) - కస్తూరి

43. నాళె బప్పుడు ఇందె బరలి (కన్నడ) - కస్తూరి

44. మౌనరాగగళు (కన్నడ) - కస్తూరి

45. అడవి దేవియ మదిల మక్కళు (కన్నడ) - కస్తూరి

46. ఎరియుం పూన్తోట్టం (తమిళం) - శ్రీమతి శాంతాదత్

47. రాణీయుం న్జానూం (మలయాళం) - శ్రీ ఎల్. ఆర్. స్వామి

48. కత్తిఎరియన్న పూన్తోట్టం (మలయాళం) - శ్రీ ఎల్. ఆర్. స్వామి

49. మౌనరాగంగళ్ (మలయాళం) - శ్రీ రాజీవన్ ముందియోడ్

50. పంచేది (మలయాళం) - శ్రీ రాజీవన్ ముందియోడ్

51. సలీంక నిర్వాచిత గల్ప (ఒరియా) - శ్రీ బంగాలి నందా

52. జలుతిబ ఫూలో బగీచ (ఒరియా) - శ్రీ బంగాలి నందా

53. రాణిర కహాణి (ఒరియా) - శ్రీమతి కమలా సత్పతి

54. సున్‌హలీ బాదల్ (ఒరియా) - శ్రీమతి కమలా సత్పతి

55. ఖంగర్ కి ఇమారత్ (ఒరియా) - శ్రీమతి కమలా సత్పతి

56. ధ్వంస తలర జీబన (ఒరియా) - శ్రీమతి కమలా సత్పతి

57. మహా సాగర్ - అనన్యగల్ప (ఒరియా) -  శ్రీమతి పున్య ప్రవాదేవి

58. తినోతి పరిసర - అనన్యగల్ప (ఒరియా) - శ్రీమతి బినోదినిదాస్

59. భంగా దేనారే ఉడిబా (ఒరియా) - శ్రీమతి బినోదినిదాస్

60. పహాడా వూపరు కపోతా తై (ఒరియా) - శ్రీమతి బినోదినిదాస్

61. బంచిబ పైన్ సంగ్రామ్ (ఒరియా) - శ్రీమతి బినోదినిదాస్

                       

సలీం సాహిత్యం మీద యం. ఫిల్, పిహెచ్. డి కోసం  పరిశోధనలు:

1. ‘‘సలీం నవలలు - ఒక పరిశీలన’’ అనే అంశం మీద పిహెచ్.డి; విద్యార్థి: పి. గ్లోరి  ;  గైడ్: ప్రొ. కె. మునిరత్నం  ; శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి

2. ‘‘వెండి మేఘం నవల - ముస్లింల సాంస్కృతిక జీవనం’’ అనే అంశం మీద యం. ఫిల్ ;  విద్యార్థి: మొహమ్మద్ బాషా ;     గైడ్: ప్రొ. ఎండ్లూరి సుధాకర్ ;    పొ. శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరు

3. ‘‘కాలుతున్న పూలతోట నవల - పరిశీలన’’ అనే అంశం మీద యం. ఫిల్ ; విద్యార్థి: మోహన్ ;  గైడ్: డా. విజయలక్ష్మి ; సెంట్రల్ యూనివర్శిటి, హైద్రాబాద్

4. ‘‘వెండిమేఘం నవల – ఆవశ్యకత’’ అనే అంశం మీద యం.ఫిల్ ;  విద్యార్థి: మహబూబ్ జాన్ ;  గైడ్: ప్రొ. మహలక్ష్మి  ;కుప్పం విశ్వవిద్యాలయం, కుప్పం

5. ‘‘సలీం కథల్లో వస్తువైవిధ్యం’’ అనే అంశం మీద యం.ఫిల్ ; విద్యార్థి: యం. నాగరాజు ; గైడ్: ప్రొ. శరత్జ్యోత్సారాణి  ; సెంట్రల్ యూనివర్సిటి, హైద్రాబాద్

6. ‘‘సలీం మైనారిటీ కథలు - స్త్రీల సమస్యలు’’ అనే అంశం మీద యం.ఫిల్ ; విద్యార్థి: సలీంబాషా ధులుప్; గైడ్: డా. తుమ్మల రామకృష్ణ, సెంట్రల్ యూనివర్శిటి, హైద్రాబాద్

7. ‘‘సలీం సమగ్ర సాహిత్యం - పరిశీలన’’ అనే అంశం మీద పిహెచ్. డి ; విద్యార్థి: షేక్ హజీబ్ మీరా; గైడ్: ప్రొ. వి. తిమ్మన్న ; ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేర్

8. ‘‘హ్యూమనిజం ఇన్ సలీంస్ షార్ట్ స్టోరీస్’’ అనే అంశం మీద యం.ఫిల్ ; విద్యార్థి: బి.జె. గౌతం ; గైడ్: డా. సోన్‌బా ఎన్. సాల్వే ;  ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటి, హైద్రాబ్రాద్

9. ‘‘అబ్దుల్ బిస్మిల్లా ఔర్ సలీం కె సాహిత్య మే సామాజిక్ చిత్రణ్’’ అంశం మీద పిహెచ్.డి ; విద్యార్థి: సంజయ్‌కుమార్ ప్రజాపతి ; గైడ్:  ప్రొ. శారద సుందరి భారతుల ;    బెనారస్ హిందూ యూనివర్శిటి, వారణాసి

10. ‘‘గుర్రపు డెక్క నవలలో పర్యావరణ స్పృహ - సామాజికాంశాలు’’ అనే అంశం మీద  యం. ఫిల్ ; విద్యార్థి: యు.వి. చక్రవర్తి ; గైడ్: డా. మురళి ; ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నయ్

11. ‘‘సలీం కథాసాహిత్యానుశీలన’’ అనే అంశం మీద పిహెచ్. డి ; విద్యార్థి: వి. పద్మ; గైడ్: డా.యం.విజయశ్రీ ; నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూర్‌

 టీ.వీ సీరియల్స్:

1. ‘‘రాణిగారి కథలు’’ మా టీవీలో 56 ఎపిసోడ్లుగా ప్రసారమైనాయి. శ్రీ అక్కినేని  కుటుంబరావు గారు దర్శకత్వం వహించారు.

2. ‘‘సలీం కథలు’’ పేరుతో పదిహేను కథలు దూరదర్శన్ యాదగిరి ఛానెల్లో ప్రసారమైనాయి. శ్రీ శంకు గారు దర్శకత్వం వహించారు. వీటికి 2015 సంవత్సరానికి ఉత్తమ టీవీ ఫిల్మ్ సీరీస్ కింద బంగారు నంది బహుమతి లభించింది.                                                                                                      

                                                           

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 సయ్యద్ నశీర్ అహమ్మద్ (2010). అక్షరశిల్పులు. వినుకొండ: ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌. pp. 137, 138.
  2. "పుట:అక్షరశిల్పులు.pdf/137 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2022-05-30.
  3. "..:: SAHITYA : Akademi Awards ::." sahitya-akademi.gov.in. Archived from the original on 2022-05-30. Retrieved 2022-05-30.