సింహాచలం కొండలు
సింహాచలం కొండలు | |
---|---|
అత్యంత ఎత్తైన బిందువు | |
ఎత్తు | 377 మీ. (1,237 అ.) |
నిర్దేశాంకాలు | 17°45′39″N 83°15′59″E / 17.760932°N 83.266455°E |
Naming | |
స్థానిక పేరు | Simhachalam Kondalu Error {{native name checker}}: parameter value is malformed (help) |
భౌగోళికం | |
పర్వత శ్రేణి | తూర్పు కనుమలు |
సింహాచలం కొండలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నంలోని మహోన్నత పర్వత శ్రేణి. తూర్పు కనుమలలోని కొండ శ్రేణులలో సింహాచలం కొండలు కూడా ఉన్నాయి.[1]
భౌగోళికం
[మార్చు]ఈ కొండలు తూర్పు కనుమల తూర్పు శ్రేణులలో భాగంగా ఉన్నాయి. ఈ కొండలు 32 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.[2]
చరిత్ర
[మార్చు]ఈ కొండలలో సింహాచలం వరాహ లక్ష్మి నరసింహ దేవాలయం ఉంది. చాళుక్య కాలంనాటి రాధ మాధవ స్వామి దేవాలయం, కొన్ని పాత బౌద్ధ స్మారక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి.[3]
భక్తిక్షేత్రం
[మార్చు]ఇక్కడ వరాహ లక్ష్మి నరసింహ దేవాలయం, ఇతర చిన్న దేవాలయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం గిరి ప్రదక్షిణ పండుగ జరుగుతుంది. భక్తులు ఇక్కడ కొండ చుట్టూ 35 కిలోమీటర్లు నడుస్తారు.[4]
గురించి
[మార్చు]ఈ కొండల సమీపంలో అవడివరం, అక్కయ్యపాలెం, బాలయ్య శాస్త్రి లేఅవుట్, గోపాలపట్నం, హనుమంతవాక, కైలాసపురం, మాధవధార, నరసింహనగర్, ప్రహ్లాదపురం, సీతమ్మధార మొదలైన విశాఖపట్న పరిసర ప్రాంతాలు ఉన్నాయి.
వృక్షజాలం, జంతుజాలం
[మార్చు]విశాఖపట్నం నగర పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో సింహాచలం కొండ రక్షిత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈ ప్రాంతంలో 74 రకాల వృక్షజాలం, 200 రకాల జాతులను కనుగొన్నది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Data, Info (14 April 2019). "Latitude". Retrieved 17 July 2021.
- ↑ "Geography". 21 June 2020. Retrieved 17 July 2021.
- ↑ Susarla, Ramesh (11 July 2020). "Geography". Retrieved 17 July 2021.
- ↑ "Devotional". 8 July 2017. Retrieved 17 July 2021.
- ↑ Bhattacharya, Sumith (16 May 2014). "Flora". Retrieved 17 July 2021.