సీతా రామం
సీతా రామం | |
---|---|
దర్శకత్వం | హను రాఘవపూడి |
రచన | హను రాఘవపూడి |
కథ | హను రాఘవపూడి |
నిర్మాత | అశ్వినీదత్, స్వప్నాదత్ |
ఛాయాగ్రహణం | పి. ఎస్. వినోద్ శ్రేయాస్ కృష్ణ |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వర రావు |
సంగీతం | విశాల్ చంద్రశేఖర్ పాటల రచయిత: అనంత్ శ్రీరామ్ |
నిర్మాణ సంస్థలు | వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ |
విడుదల తేదీ | 2022 ఆగష్టు 5 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 30 కోట్లు |
బాక్సాఫీసు | est. ₹91.4 - 98.1 crore |
సీతా రామం 2022లో తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకానున్న సినిమా. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అశ్వినీదత్, స్వప్నాదత్ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు.[1] దుల్కర్ సల్మాన్, రష్మికా మందన్న, మృణాళిని ఠాకూర్, సుమంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొదటి పాట ‘ఓ సీత హే రామ’ ని మే 9న విడుదల చేసి[2] ఆగష్టు 5న విడుదల చేశారు.[3] ఈ చిత్రం టాలీవుడ్‌లో మృణాళిని ఠాకూర్‌కు తొలి చిత్రం. 1964 నాటి నేపథ్యంలో, లెఫ్టినెంట్ రామ్, కాశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న అనాథ ఆర్మీ అధికారి, సీతా మహాలక్ష్మి నుండి అనామక ప్రేమ లేఖలను పొందాడు, ఆ తర్వాత రాముడు సీతను కనుగొని తన ప్రేమను ప్రతిపాదించే పనిలో ఉన్నాడు.
నటీనటులు
[మార్చు]- దుల్కర్ సల్మాన్[4]
- రష్మికా మందన్న
- మృణాళిని ఠాకూర్
- సుమంత్
- తరుణ్ భాస్కర్
- గౌతమ్ వాసుదేవ్ మీనన్
- భూమిక చావ్లా
- అభయ్ బేతిగంటి
- వెన్నెల కిషోర్
- మురళి శర్మ
- ప్రకాష్ రాజ్
- టినూ ఆనంద్
- శత్రు
- సచిన్ ఖేడేకర్
- నీరజ్ కబీ
- గీతా భాస్కర్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్
- నిర్మాత: అశ్వినీదత్, స్వప్నాదత్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి
- సంగీతం: విశాల్ చంద్రశేఖర్
- సినిమాటోగ్రఫీ: పి. ఎస్. వినోద్ , శ్రేయాస్ కృష్ణ
- ఆర్ట్ డైరెక్టర్ : వైష్ణవి రెడ్డి, ఫైసల్ అలీ ఖాన్
- పాటలు: అనంత్ శ్రీరామ్, కృష్ణ కాంత్
పాటల జాబితా
[మార్చు]1:ఓ సీతా హే రామా , రచన:అనంత శ్రీరామ్, గానం. ఎస్ పి చరణ్, రమ్య బెహరా
2: ఇంతందం దారి మళ్ళిందా , రచన: కృష్ణకాంత్, గానం.ఎస్ పి.చరన్
3: కానున్న కళ్యాణం ఏమన్నది , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.అనురాగ్ కులకర్ణి , సింధూరి . ఎస్
4: కన్నుల ముందర , రచన: కృష్ణకాంత్, గానం.సునీత ఉపద్రష్ట
5: ఎవరిని అడిగాను ఏమైందని , రచన: కృష్ణకాంత్, గానం. యాజిన్ నజీర్
6: వస్తా నే వెంటనే ఉంటా నీ వెంటనే, రచన: కృష్ణకాంత్ , గానం.కపిల్ కపిలాన్, చిన్మయి శ్రీపాద.
మూలాలు
[మార్చు]- ↑ Zee Cinemalu (11 April 2022). "యుద్ధంతో రాసిన ప్రేమకథ" (in ఇంగ్లీష్). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
- ↑ Sakshi (8 May 2022). "దుల్కర్ సల్మాన్-రష్మిక మందన్నా 'సీతా రామం' నుంచి కొత్త అప్‌డేట్." Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
- ↑ Sakshi (5 August 2022). "'సీతారామం' మూవీ రివ్యూ". Archived from the original on 8 August 2022. Retrieved 8 August 2022.
- ↑ 10TV (28 July 2020). "'యుద్ధంతో రాసిన ప్రేమకథ'.. లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్." (in telugu). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)