హర్యానా క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | హర్షల్ పటేల్ |
కోచ్ | సురేంద్ర భావే |
యజమాని | హర్యానా కెరికెట్ అసోసియేషన్ |
జట్టు సమాచారం | |
స్వంత మైదానం | చౌధురీ బన్సీలాల్ క్రికెట్ స్టేడియం, రోహ్‌తక్ |
సామర్థ్యం | 8,500 |
చరిత్ర | |
రంజీ ట్రోఫీ విజయాలు | 1 (1990–91) |
ఇరానీ ట్రోఫీ విజయాలు | 1 (1991–92) |
హర్యానా క్రికెట్ జట్టు హర్యానా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే దేశీయ క్రికెట్ జట్టు. ఇది హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ జట్టు భారతదేశంలోని అగ్రశ్రేణి దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ అయిన రంజీ ట్రోఫీ, దేశంలోని అగ్రశ్రేణి దేశీయ లిస్ట్ A టోర్నమెంటైన విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, దేశీయ T20 టోర్నమెంట్‌లో పాల్గొంటుంది. ఇది రంజీ ట్రోఫీని ఒకసారి గెలుచుకుని, మరొకసారి రన్నరప్‌గా నిలిచింది. ఇరానీ కప్‌ను కూడా ఒకసారి గెలుచుకుంది. గొప్ప భారత ఆల్ రౌండర్, కపిల్ దేవ్, దేశీయ స్థాయిలో హర్యానా తరపున ఆడాడు.
పోటీల చరిత్ర
[మార్చు]హర్యానా మొదటిసారిగా 1970–71 రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ స్థాయిలో పోటీ పడింది, అప్పటి జట్టుకు రవీందర్ చద్దా సారథ్యం వహించాడు. అప్పటి నుండి, 18 సీజన్లపాటు అతనే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగాడు.[1] జట్టు తరఫున చద్దా మొదటి సెంచరీ సాధించడంతో పాటు తొమ్మిది వికెట్లు కూడా పడగొట్టిన రెండవ మ్యాచ్‌లో గెలిచారు.[2]
హర్యానా రెండు రంజీ ట్రోఫీ ఫైనల్స్‌లో పాల్గొంది. తొలిసారి 1986లో ఢిల్లీపై ఘోర పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న హర్యానా జట్టు (కెప్టెన్ కపిల్ దేవ్) 288 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ 638 పరుగుల భారీ స్కోరుతో బదులిచ్చింది, ఆ తర్వాత హర్యానాను 209 పరుగులకే ఆలౌట్ చేయగా, మణిందర్ సింగ్ ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.[3]
హర్యానా యొక్క తదుపరి ఫైనల్ 1991 లో, సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, లాల్‌చంద్ రాజ్‌పుత్ లాంటి ఆటగాళ్ళున ముంబై జట్టుతో జరిగింది, దీనిని హర్యానా జట్టు (కపిల్ దేవ్ కెప్టెన్) ముంబైలోని వాంఖెడే స్టేడియంలో కేవలం రెండు పరుగుల తేడాతో గెలిచింది.[4]
ఆ తరువాత హర్యానా జట్టు, సౌరవ్ గంగూలీ, జవగల్ శ్రీనాథ్, మణిందర్ సింగ్, వినోద్ కాంబ్లీలతో కూడిన రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టుతో ఇరానీ ట్రోఫీలో తలపడింది. ఫరీదాబాద్‌లోని నహర్ సింగ్ స్టేడియంలో 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన హర్యానా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.[5]
2023 జనవరి మధ్య నాటికి, హర్యానా 330 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడింది, అందులో 114 గెలిచింది. 87 మ్యాచ్‌లలో ఓడిపోయి, 129 డ్రా చేసుకుంది.[6]
విజయాలు
[మార్చు]- రంజీ ట్రోఫీ
- విజేతలు (1): 1990–91
- రన్నర్స్-అప్ (1): 1985–86
- విల్స్ ట్రోఫీ
- రన్నర్స్-అప్ (2): 1994-95, 1996-97
ప్రసిద్ధ క్రీడాకారులు
[మార్చు]భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన హర్యానా ఆటగాళ్ళు. బ్రాకెట్లో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- కపిల్ దేవ్ (1978)
- అశోక్ మల్హోత్రా (1982)
- చేతన్ శర్మ (1984)
- అజయ్ జడేజా (1992)
- విజయ్ యాదవ్ (1993)
- అజయ్ రాత్ర (2002)
- అమిత్ మిశ్రా (2008)
- జయంత్ యాదవ్ (2016)
భారతదేశం తరపున వన్‌డే ఆడిన (కానీ టెస్ట్ క్రికెట్ ఆడని) హర్యానా ఆటగాళ్ళు. బ్రాకెట్లో తొలి మ్యాచ్ ఆడిన సంవత్సరం:
- జోగిందర్ శర్మ (2004)
- మోహిత్ శర్మ (2013)
- యుజ్వేంద్ర చాహల్ (2016)
దేశీయ స్థాయిలో ప్రముఖ ఆటగాళ్లు:
- అమర్‌జిత్ కేపీ
- రాజిందర్ గోయల్
ప్రస్తుత స్క్వాడ్
[మార్చు]పేరు | పుట్టినరోజు | బ్యాటింగు శైలి | బౌలింగు శైలి | గమనికలు |
---|---|---|---|---|
బ్యాటర్లు | ||||
హిమాన్షు రానా | 1998 అక్టోబరు 1 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడీయం | |
యువరాజ్ సింగ్ | 2004 నవంబరు 11 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
చైతన్య బిష్ణోయ్ | 1994 ఆగస్టు 25 | ఎడమచేతి వాటం | Slow left-arm orthodox | |
అంకిత్ కుమార్ | 1997 నవంబరు 1 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
యషు శర్మ | 1998 సెప్టెంబరు 19 | ఎడమచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
శివం చౌహాన్ | 1997 అక్టోబరు 14 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడీయం | |
పీయూష్ దహియా | 2003 జూలై 26 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడీయం | |
ఆల్ రౌండర్లు | ||||
నిశాంత్ సింధు | 2004 ఏప్రిల్ 9 | ఎడమచేతి వాటం | Slow left-arm orthodox | Plays for Chennai Super Kings in IPL |
సుమిత్ కుమార్ | 1995 డిసెంబరు 12 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడీయం | |
రాహుల్ తెవాటియా | 1993 మే 20 | ఎడమచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | Plays for Gujarat Titans in IPL |
జైదీప్ భంబు | 1999 మార్చి 19 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడీయం ఫాస్ట్ | |
వికెట్ కీపర్లు | ||||
కపిల్ హూడా | 1997 మార్చి 15 | కుడిచేతి వాటం | ||
రోహిత్ శర్మ | 1993 జూన్ 28 | కుడిచేతి వాటం | ||
దినేష్ బాణా | 2004 డిసెంబరు 15 | కుడిచేతి వాటం | ||
స్పిన్ బౌలర్లు | ||||
జయంత్ యాదవ్ | 1990 జనవరి 22 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | Plays for Gujarat Titans in IPL |
అమిత్ రానా | 1995 డిసెంబరు 14 | కుడిచేతి వాటం | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |
అమిత్ మిశ్రా | 1982 నవంబరు 24 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | Plays for Lucknow Super Giants in IPL |
యుజ్వేంద్ర చాహల్ | 1990 జూలై 23 | కుడిచేతి వాటం | కుడిచేతి లెగ్ బ్రేక్ | వైస్ కెప్టెన్ Plays for Rajasthan Royals in IPL |
పేస్ బౌలర్లు | ||||
మోహిత్ శర్మ | 1988 సెప్టెంబరు 18 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడీయం ఫాస్ట్ | Plays for Gujarat Titans in IPL |
అజిత్ చాహల్ | 1995 డిసెంబరు 12 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడీయం | |
అన్షుల్ కాంబోజ్ | 2000 డిసెంబరు 6 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడీయం | |
అమన్ కుమార్ | 1999 డిసెంబరు 18 | కుడిచేతి వాటం | కుడిచేతి ఫాస్ట్ | |
హర్షల్ పటేల్ | 1990 నవంబరు 23 | కుడిచేతి వాటం | కుడిచేతి మీడీయం ఫాస్ట్ | కెప్టెన్ Plays for Royal Challengers Bangalore in IPL |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "First-Class Matches played by Haryana". CricketArchive. Retrieved 18 January 2023.
- ↑ "Jammu & Kashmir v Haryana 1970-71". Cricinfo. Retrieved 18 January 2023.
- ↑ "Final:Delhi v Haryana at Delhi, 28 Mar - 01 Apr 1986". Static.espncricinfo.com. Retrieved 17 April 2021.
- ↑ "Full Scorecard of Haryana vs Bombay Final 1990/91 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 17 April 2021.
- ↑ "Full Scorecard of Rest of Ind vs Haryana 1991/92 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 17 April 2021.
- ↑ "Playing Record (1970/71-2022/23)". CricketArchive. Retrieved 18 January 2023.