అనుములపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అనుములపల్లె, ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 368., ఎస్.టి.డి.కోడ్ = 08405.[1]

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంరాచర్ల మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


లువా తప్పిదం: Coordinates not found on Wikidata

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన గిద్దలూరు మండలం, తూర్పున బెస్తవారిపేట మండలం, తూర్పున కంభం మండలం, దక్షణాన కొమరోలు మండలం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలోనికి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

[2] ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

అనుములపల్లె గ్రామంలో ఐ.డబ్ల్యూ.ఎం.పి. వాటర్ షెడ్ పథకంలో భాగంగా నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని 2014, మార్చి-17, సోమవారం నాడు ప్రారంభించారు. ప్రభుత్వం వారు ఈ పథకానికి, 1.83 లక్షల రూపాయల విలువగల యంత్రపరికరాలు అందించారు. పంచాయతీకి నిధులు లేకపోవటంతో, సర్పంచ్ శ్రీ భూపని చిన్నకాశయ్య, గ్రామంలో త్రాగునీటి అవసరాలు తీర్చటానికి, తన స్వంత నిధులు 2.1 లక్షల రూపాయలు వెచ్చించి, ఈ పథకానికి కావలసిన షెడ్డు నిర్మాణంచేశారు. గ్రామంలో ప్రతి కుటుంబానికీ, ఉచితంగా శుద్ధజలం అందించాలనే ఉద్దేశంతో ఆయన ఈ విధమైన వితరణచేసి అందరికీ ఆదర్శం నిలిచారు. [2]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

సాగునీటి చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ భూపని చిన్నకాశయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గళ్ళా పుల్లయ్య ఎన్నికైనారు. [1]
  2. ఈ గ్రామములో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి, 2015, ఆగస్టు-15వ తేదీ శనివారంనాడు భూమిపూజ నిర్వహించారు. 13 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో ఈ భవన నిర్మాణం చేస్తున్నారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

  1. శ్రీ దత్తాత్రేయస్వామివారి ఆలయం:- అనుములపల్లె గ్రామ సమీపంలోని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం దత్తజయంతి ని వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర నామార్చన నిర్వహించెదరు. స్వామివారి జండా ఊరేగించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు విశేషంగా పాల్గొంటారు. [5]
  2. శ్రీ సిద్ధి భైరవేశ్వరేశ్వరస్వామివారి ఆలయం.
  3. శ్రీ జీవనమూర్తి ఆలయం.
  4. శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015, మే-30వ తేదీ శనివారం ఉదయం ప్రారంభించారు. సాయంత్రం గ్రామోత్సవం చేపట్టి, శాంతికళ్యాణం నిర్వహించారు. అనంతరం కులుకు భజన కార్యక్రమం ఏర్పాటుచేసారు. 31వ తేదీ ఆదివారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో యంత్రప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అనంతరం హోమం నిర్వహించి, పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [3]
  5. శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఇటీవల ఈ అలయంలో విగ్రహప్రతిష్ఠ నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించి 40 రోజులైన సందర్భంగా, 2017, జూన్=8వతేదీ గురువారంనాడు, ఆలయంలోని స్వామివారికి అభిషేకాకాలు, ఆకుపూజా నిర్వహించారు. అష్టోత్తర నామార్చన చేసారు. హనుమాన్‌చాలీసా పారాయణం చేసారు. భక్తులకునన్నప్రసాద వితరణ చేసారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గణాంకాలు[మార్చు]

[3]

  • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
  • జనసంఖ్య 3084
  • పురుషుల సంఖ్య 1559
  • స్త్రీలు 1525
  • నివాసగృహాలు 823
  • వైశాల్యం 1395 హెక్టారులు

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. సాక్షి, విలేకరి. "సాక్షి" (PDF). సాక్షి. Retrieved 23 December 2016.
  3. http://www.villageprofile.in/andhra-pradesh/prakasam/racherla/anumula-palle%7Cwebsite=village[permanent dead link] profile.in

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-2; 5వపేజీ. [2] ఈనాడు ప్రకాశం; 2014, మార్చి-18; 5వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015, జూన్-1; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-16; 5వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-26; 4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015, జూన్-9; 5వపేజీ.