అమరావతి ఎక్స్‌ప్రెస్
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ |
స్థితి | నడుస్తుంది |
స్థానికత | పశ్చిమ బెంగాల్,ఒడిషా, ఆంధ్రప్రదేశ్,కర్ణాటక,గోవా |
ప్రస్తుతం నడిపేవారు |
|
మార్గం | |
మొదలు | హౌరా జంక్షన్ రైల్వే స్టేషను |
ఆగే స్టేషనులు | 42 |
గమ్యం | వాస్కోడగామా |
ప్రయాణ దూరం | 710 కి.మీ. (440 మై.) |
రైలు నడిచే విధం | వారంలో నాలుగు రోజులు |
సదుపాయాలు | |
శ్రేణులు | స్లీపర్ , ఏ.సి 2,3 జనరల్ |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | రెండు |
పట్టాల గేజ్ | విస్తృతం (1,676 ఎం.ఎం) |
వేగం | 57 kilometres per hour (35 mph) |
భారతీయ రైల్వేస్ [1] కు చెందిన సౌత్ ఈస్ట్రన్ రైల్వే (ఎస్.ఇ.ఆర్.), ఖరగ్ పూర్ డివిజన్ కేంద్రంగా అమరావతి ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసును నడిపిస్తున్నారు. ఈ రైలు వారానికి నాలుగు సార్లు ఇరు మార్గాల్లో నడుస్తుంటుంది. విజయవాడ, గుంతకల్, హుబ్లీ, మడగాం స్టేషన్ల మీదుగా ఈ రైలు కార్యకలాపాలు సాగుతుంటాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ ల మీదుగా, కర్ణాటక, గోవారాష్ట్రంలో గల వాస్కోడగామా వరకు ప్రయాణిస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా గుంటూరు, నర్సారావు పేట, మార్కాపూర్, కంబం, గిద్దలూరు, నంద్యాల, మహానంది, గుంతకల్, బళ్లారి, సమీప ప్రాంతాలవారికి అమరావతి ఎక్స్ ప్రెస్ సుపరితం.
డిసెంబరు 2012 నాటికి, ఈ రైలు బండి సేవలు
ఈ రైలు వారానికి మూడు సార్లు విజయవాడ హుబ్బల్లి మధ్య నడుస్తుంది,, ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే (ద మ రే) బెజవాడ (విజయవాడ) డివిజన్ ఆంధ్రప్రదేశ్ గోవా రాష్త్రముల మధ్య నడుపుచున్నది.
- 18047 హౌరా - వాస్కోడగామా అమరావతి ఎక్సప్రస్ [3]
- 18048 వాస్కోడగామా - హౌరా అమరావతి ఎక్సప్రస్
ఈ రైలు బండి వారానికి నాలుగు రోజులు రెండు వైపుల నుండి వయా విజయవాడ, గుంతకల్లు, హుబ్బల్లి, మదగావ్ నడుస్తుంది, ఈ రైలును ఆగ్నేయ రైల్వే మండలం ఖరగపూర్ విభాగము చే నడపబడుచున్నది. ఈ రైలుబండి పశ్చిమ బెంగాల్ నుండి గోవాకు ఓడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గుండా ప్రయాణించును.
అమరావతి ఎక్సప్రస్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరునరసరావుపేటకంభం[గిద్దలూరు (ప్రకాశం జిల్లా)|గిద్దలూరుగుంతకల్లు కర్నాటకలోని బళ్ళారి హుబ్బల్లి తదితర ప్రాంతాలలో బహుళ ప్రజాదరణ పొందింది.
చరిత్ర
[మార్చు]అమరావతి ఎక్సప్రస్ చరిత్ర
[మార్చు]అమరావతి ఎక్స్ప్రస్ చారిత్రక వైశిష్ట్యం కల మచిలీపట్టణం-మొర్ముగావ్ రైలు మార్గములో నడుస్తున్నది
ఈ రైలును తొలిగా 1950 మీటర్ గేజ్ మార్గమునందు గుంటూరు, హుబ్బల్లి మధ్య నడపబడ్డది, తర్వాత 1987-1990 లలో గుంటూరు హుబ్బలి శీఘ్ర సవారీగా వున్నతికరించబడింది, అటు తర్వాత దీనికి అమరావతి ఎక్స్‌ప్రెస్ గా నామకరణం చేయబడ్డది తొలుత ఈ రైలు బండి yp ఆవిరి ఇంజిన్ తో నడపబడేది, వాస్కోడగామా నుండి కొన్ని బోగీలు గుంటూరు వరకు నడిపేందుకు గాను అదనంగా హుబ్బల్లిలో తగిలించేవారు, వాస్కోడగామా నుండి గోమంతక్ ఎక్సప్రస్ ద్వారా గదగ్ వరకు, గదగ్ నుండి గదగ్-మిరాజ్ లింక్ ఎక్స్ప్రస్ కు ఈ అదనపు భోగీలను తగిలించి నడిపేవారు, కాలక్రమేనా ఈ విధంగా భోగీలను తగిలించటం విడగొట్టడం మానేసి రైలునుహుబ్బలి వరకు అమరావతి ఎక్స్ప్రస్ పేరుతో నడిపించటం మొదలుపెట్టారు.1997 గేజ్ ప్రామనికరణం జరిగేంతవరకు ఈ రైలు ఈ విధానం లోనే నడిపింప బడ్డది.
1994లో ఈ రైలును విజయవాడ వరకు పొడిగించారు. రైలు మార్గం ప్రామాణీకరణ జరుగుతున్న కొద్ది ఈ రైలును హుబ్బల్లి, అటు తర్వాత లోండా కూడలి, కాజిల్ రాక్ స్టేషను, వాస్కోడగామ వరకు పొడిగించుకుంటూ వెళ్లారు.2000 సంవత్సరములో ఈ రైలును వాస్కోడగామ విజయవాడ మధ్య ప్రతిరోజు నడిచే రైలుగా మార్పు చేసారు.అయితే ప్రయాణికుల నుండి తగినంత ఆదరణ లభించకపోవడంతో వారానికి రెండు రోజులు మాత్రమే వాస్కోడగామ వరకు మిగతా ఐదు రోజు హుబ్బల్లి వరకు మాత్రమే నడిపారు.
2003 నుండిఈ రైలును వారానికి మూడు సార్లు విజయవాడ హుబ్బల్లి మధ్య నడిచేలా మిగతా నాలుగు రోజులు హుబ్బలి వరకు నడిపారు, జూలై 2007 నుండి వాస్కోడగామ-విజయవాడ రైలును హౌడా కూడలి వరకు పొడిగించారు.
2010లో 7227/7228 విజయవాడ-హుబ్బల్లి రైలును 17227/17228 గా, హౌడా-విజయవాడ 8047/8048 రైలును 18047/18048 గా సంఖ్యను కేటాయించారు ఫెబ్రవరి 12 2013, రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గే అమరావతి ఎక్సప్రస్ ను 17225/17226 హుబ్బలి-విజయవాడ రైలును ప్రతి రోజు నడిచే రైలుగా మార్చారు.[4]
సవరించబడిన రైలు సమయ పట్టిక సమయాలు త్వరలో అందించబడును
రైలు యొక్క నామ విశిష్టత
[మార్చు]ఈ రైలును శాతవాహనుల చారిత్రక రాజధాని అమరావతి (ప్రస్తుత గుంటూరుజిల్లాలో ఉన్న అమరావతి) కు గుర్తుగా నామకరణం జరిగింది, బౌద్ధ మత స్తుపాలకు అమరావతి దక్షిణభారత సాంచిగా పేరు గాంచింది
ట్రాక్షన్
[మార్చు]- 17225/17226 అమరావతి ఎక్స్‌ప్రెస్ కు WDM3A డిజిల్ ఇంజిను గుత్తి షెడ్ దక్షిణ మధ్య రైల్వే, గుంతకల్లు విభాగం ఇంజిన్ ను విజయవాడ హుబ్బల్లి మధ్య నడిచెందేందుకు ఉపయోగింపబడుచున్నది.
- 18047/18048 సంఖ్య గల అమరావతి ఎక్స్‌ప్రెస్ హౌరా-విశాఖపట్నం ల మధ్య సంత్రగచ్చి లోకోషెడ్ అధారిత WAP4 విద్యుత్ ఇంజన్ ను, అక్కడి నుండి గుంటూరు వరకు విజయవాడ లేదా లాలాగూడా లోకోషెడ్ అధారిత WAP4 ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు. గుంటూరు-వాస్కోడగామా మధ్య గుత్తి లోకోషెడ్ అధారిత WDM3A డీజిల్ ఇంజిన్ ను వినియోగిస్తున్నారు.
కోచ్ల అమరిక
[మార్చు]- 18047/18048 సంఖ్య గల అమరావతి ఎక్స్‌ప్రెస్ (వాస్కోడగామా - హౌరా )
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | జనరల్ | జనరల్ | A1 | బి3 | బి2 | బి1 | ఎస్9 | ఎస్8 | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | ఎస్1 | జనరల్ | హెచ్.సి.పి | SLR |
- 17225/17226 అమరావతి ఎక్స్‌ప్రెస్ (విజయవాడ-హుబ్లీ)
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | ఇంజను |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | జనరల్ | జనరల్ | జనరల్ | ఎస్7 | ఎస్6 | ఎస్5 | ఎస్4 | ఎస్3 | ఎస్2 | ఎస్1 | A1 | బి2 | బి1 | జనరల్ | జనరల్ | SLR |
సమయ సారిణి
[మార్చు]- 18047/48: "అమరావతి ఎక్స్‌ప్రెస్" (హౌరా జంక్షన్ రైల్వే స్టేషను - వాస్కోడగామా)
నెంబరు కోడ్ స్టేషన్ రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు 1 HWh హౌరా జంక్షన్ రైల్వే స్టేషను 23:30 ప్రారంభం 0.0 1 2 KGP ఖర్గపూర్ జం. 01:10 01:15 5ని 115.1 2 3 BLS బాలాసోర్ 02:40 02:42 2ని 231.1 2 4 BHC భద్రక్ 03:40 03:42 2ని 293.6 2 5 JJKR జైపూర్ కోయింజర్ రోడ్ 04:11 04:13 2ని 337.2 2 6 CTC కటక్ జం. 05:10 05:15 5ని 409.2 2 7 BBS భుబనేశ్వర్ 05:50 05:55 5ని 437.2 2 8 KUR ఖుర్దా రోడ్ జం. 06:30 06:50 20ని 456.0 2 9 BAM బరంపురం 08:28 08:30 2ని 603.2 2 10 PSA పలాస 09:45 09:47 2ని 677.6 2 11 CHE శ్రీకాకుళం రోడ్ 10:38 10:40 2ని 750.6 2 12 VZM విజయనగరం 11:33 11:35 2ని 820.1 2 13 VSKP విశాఖపట్నం జం. 12:30 12:50 20ని 881.2 2 14 దువ్వాడ 13:20 13:22 2మని 898.5 2 15 SLO సామర్ల కోట 14:51 14:52 1ని 1031.8 2 16 RJY రాజమండ్రి 15:51 15:53 2ని 1080.9 2 17 TDD తాడేపల్లిగూడెం 16:28 16:29 1ని 1124.1 2 18 EE ఏలూరు 16:58 16:59 1ని 1174.8 2 19 BZA విజయవాడ జం. 18:43 18:45 2ని 1227.2 2 20 GNT గుంటూరు 19:40 20:00 20ని 1262.7 2 21 NRT నర్సారావుపేట 20:45 20:46 1ని 1308.0 2 22 VKN వినుకొండ 21:19 21:20 1ని 1345.3 2 23 DKD దొనకొండ 21:54 21:55 1ని 1382.8 2 24 MRK మార్కాపూర్ 22:19 22:20 1ని 1406.8 2 25 CBM కంభం 22:49 22:50 1ని 1432.8 2 26 GID గిద్దలూరు 23:20 23:21 1ని 1466.4 2 27 NDL నంద్యాల 00:55 01:00 5ని 1519.8 3 28 BMH బేతంచెర్ల 01:48 01:49 1ని 1559.7 3 29 DHNE డోన్ 02:40 02:42 2ని 1595.4 3 30 మడకశిర 03:24 03:25 1ని 1652.3 3 31 GTL గుంతకల్లు 04:00 04:10 10ని 1664.0 3 32 BAY బళ్ళారి 05:23 05:25 2ని 1714.0 3 33 TNGL తోరణగల్లు జంక్షన్ 05:49 05:50 1ని 1746.5 3 34 HPT హోసపెతే 06:19 06:20 1ని 1778.9 3 35 KBL కొప్పళ 06:54 06:55 1ని 1806.7 3 36 GDG గడగ్ జంక్షన్ 07:43 07:45 2ని 1864.1 3 37 UBL హుబ్బళ్లి 08:50 09:00 10ని 1921.7 3 38 DWR ధార్వాడ్ 09:27 09:28 1ని 1942.1 3 39 LD లొండ జంక్షన్ 10:38 10:40 2ని 2012.5 3 40 CLR కాజిల్ రాక్ 11:20 11:30 10ని 2036.9 3 41 QLM కూలెం 12:55 13:00 5ని 2063.0 3 42 SVM వోడ్లేమోల్ కాకర 13:18 13:20 2ని 2081.4 3 43 MAQ మడ్‌గావ్ రైల్వే స్టేషను 13:55 14:00 5ని 2096.3 3 44 VSG వాస్కోడగామా 15:05 గమ్యం 2120.9 3
- 17225/17226 అమరావతి ఎక్స్‌ప్రెస్ (విజయవాడ హుబ్బల్లి )
నెంబరు కోడ్ స్టేషన్ రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం రోజు 1 BZA విజయవాడ జం ప్రారంభం 19:45 0.0 1 2 GNT గుంటూరు 20:45 20:55 10ని 31.7 1 3 NRT నర్సారావుపేట 21:45 21:46 1ని 2 4 VKN వినుకొండ 22:17 22:18 1ని 1345.3 2 5 KCD కురిచేడు 22:39 22:40 1ని 139.0 1 6 DKD దొనకొండ 22:55 22:56 1ని 151.9 2 7 MRK మార్కాపూర్ 23:19 23:20 1ని 175.9 1 8 TLU తర్లుపాడు 23:34 23:35 1ని 188.3 1 9 CBM కంభం 00:01 00:02 1ని 2 2 10 GID గిద్దలూరు 00:39 00:40 1ని 2 2 11 DMT దిగువమెట్ట 01:04 01:05 1ని 247.0 2 12 NDL నంద్యాల 02:40 02:45 5ని 288.9 1 13 BEY బుగ్గానిపల్లి సిమెంట్ నగర్ 03:19 03:20 1ని 322.2 2 14 BMH బేతంచెర్ల 03:29 03:30 1ని 328.8 2 15 DHNE డోన్ 04:00 04:05 5ని 364.6 3 16 PDL పెండేకల్లు జంక్షన్ 04:24 04:25 1ని 390.5 2 17 MKR మడకశిర 04:59 05:00 1ని 421.5 3 18 GTL గుంతకల్లు 05:30 05:40 10ని 433.2 3 19 BAY బళ్ళారి 06:53 06:55 2ని 483.2 3 20 TNGL తోరణగల్లు జంక్షన్ 07:29 07:30 1ని 515.7 3 21 HPT హోసపెతే 08:15 08:20 5ని 548.0 3 22 MRB మునీరాబాద్ 08:34 08:35 1ని 554.0 2 23 KBL కొప్పళ 08:54 08:55 1ని 575.9 3 24 GDG గడగ్ జంక్షన్ 10:08 10:10 2ని 633.2 2 25 NGR అన్నిగేరి 10:24 10:25 1ని 655.9 2 26 UBL హుబ్బళ్లి 11:20 గమ్యం 690.9 2
బాహ్య లింకులు
[మార్చు]- Vijayawada, Guntur or Amaravati
- ఆంధ్ర ప్రదేశ్
- Goa, Hubli, Bellary
- Trains of SWR
- AP Tourism Archived 2011-05-12 at the Wayback Machine
- Amaravati Express
సూచనలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Indian Railways". indianrail.gov.in.
- ↑ "17226 Hubli-Vijayawada". indiarailinfo.com.
- ↑ "18047 Howdah-Vasco da Gama". indiarailinfo.com.
- ↑ "Amaravati Express - 17225". cleartrip.com. Archived from the original on 2014-04-08. Retrieved 2015-03-20.