ఇస్ హాఖ్
వికీపీడియా నుండి
ఇస్ హాఖ్ (ప్రవక్త): ఇస్లాం మతగ్రంథమైన ఖురాన్, మరియు ఇస్లామీయ ధార్మిక సాంప్రదాయాల ప్రకారము, ప్రవక్తల పితామహుడిగా పేరుగాంచిన ఇబ్రాహీం మరియు అతని భార్య సారా ల కుమారుడు 'ఇస్ హాఖ్'. ఇతనిని 'ఇశ్రాయేలీయుల పిత' అనికూడా అంటారు. యూదుల మతగ్రంథమైన తోరాహ్ లోను క్రైస్తవుల మతగ్రంథమైన బైబిలు (అరబ్బీలో ఇంజీల్) లోనూ ఇతని పేరు 'ఇస్సాకు' గా వర్ణింపబడినది. దేవుని పరీక్షలో ఇబ్రాహీము బలి ఇవ్వబోయింది ఇస్మాయీల్ ని అని ముస్లిములు అంటే, ఇస్సాకు ని అని క్రైస్తవులు అంటారు.
ఇస్ హాఖ్ గురించి ఖురాన్ లో, హదీసుల లో అనేక చోట్ల ప్రస్తావించ బడింది:
- ఇబ్రాహీముకు ఇస్‌హాక్, యాకూబ్ లను ఇచ్చాము. ఆ ముగ్గురినీ మేము సన్మార్గంలోనడిపించాము. ఇబ్రాహీముకంటే ముందు మేము నూహ్ (నోవహు) ను కూడా సన్మార్గంలో నడిపాము. అతని సంతానంలో దావూద్ (దావీదు), సులైమాన్ (సొలోమోను), యోబు, యేసేపు, మూసా (మోషే), అహరోను లకు కూడా సన్మార్గం చూపాము. మంచిచేసే వాళ్ళను అలా సత్కరిస్తాము.(అనమ్ :84)
- దైవ ప్రవక్త ఇలా అన్నారు "గౌరవనీయుని కుమారుడు కూడా గౌరవనీయుడే. అంటే ఇబ్రాహీము కుమారుడు , ఇస్‌హాక్ కుమారుడు, యాకూబ్ కుమారుడు, యూసుఫ్ (యోసేపు) కుమారుడు అలా..."(సహీ బుఖారి : 4;596)
- నేను నా పితరులైన ఇబ్రాహీము (అబ్రాహాము), ఇస్ హాఖ్ (ఇస్సాకు), యాఖూబ్ (యాకోబు) ల విశ్వాసాన్నే అనుసరిస్తాను. అల్లాహ్ కు భాగస్వాముల్ని చేర్చము.(యూసుఫ్ : 38)
- ఇంత ముసలి వయసులో నాకు ఇస్మాయీల్ ను, ఇస్సాకును ప్రసాదించిన అల్లాహ్ కు స్తోత్రాలు .(ఇబ్రాహీం :39)
- ఇబ్రాహీము, ఇస్మాయిల్, ఇస్సాకు, యాకూబు వారి సంతానమంతా యూదులు, క్రైస్తవులని అనుకొంటున్నారా? (అల్-బఖరా :140)
- మేము ఇబ్రాహీము, ఇస్మాయిల్, ఇస్సాకు, యాకూబు వారి సంతానానికి , మూసా, ఈసా ఇతర ప్రవక్తలకు పంపబడ్డ అల్లాహ్ సందేశాన్ని నమ్ముతున్నాము. మేము వారిమధ్య ఎలాంటి తేడా చూపము " (ఆల్-ఇమ్రాన్ :84)
|
|||||||
| ఆదమ్ | ఇద్రీస్ | నూహ్ | హూద్ | సాలెహ్ | ఇబ్రాహీం | లూత్ | ఇస్మాయీల్ | ఇస్ హాఖ్ | యాకూబ్ | యూసుఫ్ | అయ్యూబ్ | ||||||||||||||||||||||||||
| آدم | إدريس | نوح | هود | صالح | إبراهيم | لوط | إسماعيل | إسحاق | يعقوب | يوسف | أيوب | ||||||||||||||||||||||||||
| Adam | Enoch | en:Noah | en:Eber | Shelah | en:Abraham | Lot | en:Ishmael | en:Isaac | en:Jacob | Joseph | Job | ||||||||||||||||||||||||||
|
|
|||||||||||||||||||||||||||||||||||||
| షోయెబ్ | మూసా | హారూన్ | జుల్ కిఫ్ల్ | దావూద్ | సులేమాన్ | ఇలియాస్ | అల్-యసా | యూనుస్ | జకరియా | యహ్యా | ఈసా | ముహమ్మద్ | |||||||||||||||||||||||||
| شُعيب | موسى | هارون | ذو الكفل | داود | سليمان | إلياس | إليسع | يونس | زكريا | يحيى | عيسى | مُحمد | |||||||||||||||||||||||||
| Jethro | en:Moses | en:Aaron | en:Ezekiel | David | en:Solomon | en:Elijah | en:Elisha | en:Jonah | Zechariah | John | en:Jesus | en:Mohammed |
|
||||||||||||||||||||||||