Jump to content

కట్టావారిపాలెం

అక్షాంశ రేఖాంశాలు: 15°24′0.648″N 79°51′7.056″E / 15.40018000°N 79.85196000°E / 15.40018000; 79.85196000
వికీపీడియా నుండి
కట్టావారిపాలెం
గ్రామం
పటం
కట్టావారిపాలెం is located in ఆంధ్రప్రదేశ్
కట్టావారిపాలెం
కట్టావారిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 15°24′0.648″N 79°51′7.056″E / 15.40018000°N 79.85196000°E / 15.40018000; 79.85196000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంకొండపి
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523270


కట్టావారిపాలెం, ప్రకాశం జిల్లా కొండపి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

సంస్కృతి

[మార్చు]

ప్రాచీన కాలం నుండి గ్రామం విద్యకు, కళలకు, సంస్కృతికి పెట్టింది పేరు. కాలానుగుణంగా ఆ ప్రాభవమంతా విజయనగర సామ్రాజ్య వైభవం వలె కనుమరుగైనవి.

ఈ గ్రామం గత శతాబ్దం నుంచి కొండపి కరణీకం కింద పరిపాలింపబడింది.

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది కొండపి పట్టణానికి ఒక మైలు దూరంలో ఉంది.

గ్రామ పంచాయతీ

[మార్చు]

కట్టావారిపాలెం, కొండపి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

కొండెపి, కట్టావారిపాలెం గ్రామాల మధ్య, శ్రీ నెప్పల కొండయ్య ఏర్పాటుచేసిన ఈ ఆలయంలో, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని, 2014, డిసెంబరు-13వతేదీ శనివారం నాడు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కొండెపి, కట్టావారిపాలెం గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని తిలకించారు.

ప్రధాన పంటలు

[మార్చు]

ఇక్కడ పండించే పంటలలో వరి, పొగాకు, శనగ, జొన్న, వేరుశనగ తదితర పంటలు ముఖ్యమైనవి. ఎక్కువగా మెట్ట పంటలు ఆధారము.

ప్రధాన వృత్తులు

[మార్చు]

అందరికి వ్యవసాయమే జీవనాధారం.

గ్రామ విశేషాలు

[మార్చు]
  • గ్రామంలో కమ్మ, వడ్డెర, గొల్ల కులస్తులు కలరు. గ్రామంలో కట్టా, మామిళ్ళపల్లి, బెజవాడ, బొక్కిసం, ఆరికట్ల, అంగలకుర్త్తి, బొడ్డపాటి మొదలగు కుటుంబాలు ప్రాముఖ్యముగా ఉన్నాయి.
  • ముఖ్యముగా రావెళ్ళ వారి ఆధీనములో అన్ని రాజకీయ, సామాజిక అంశములు ముడిపడి ఉండెడివి. గ్రామ మునసబు, సర్పంచులుగా కొన్ని దశాబ్దములుగా సేవలందించిరి.
  • కట్టావారిపాలెం, కొండపి అసెంబ్లీ నియొజక వర్గంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కొండపి మండలంనే గాక చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా సుపరిచితము.
  • గ్రామ ప్రజలు కళలును పోషించటంలో తమకు సాటిలేదని నిరూపిస్తూ, మరుగునపడి పోతున్నటువంటి కోలాటం, చెక్కభజన, ముగ్గులపోటీలు, భజన మొదలగు కార్యక్రమాలను ప్రదర్శిస్తూ, వాటి ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఉగాది రోజున జరిగే సంబరాలు, ఆ రోజున దేవుని (జాల్లపాలెం) సన్నిధిలో వుంచే విద్యుత్ ప్రభల ప్రాభవం కనులారా చూసి తరించవలసిందే. ఉన్నత ఉద్యోగాలలో ఉండి, "ఉన్న ఊరు కన్నతల్లి" అనే సామెతను అక్షరాలా పాటిస్తూ, మనవూరివికాసం సభ్యులు గ్రామాభివ్రుద్దికి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.
  • ఈ గ్రామానికి చెందిన శ్రీ కట్టా మల్లిఖార్జున, జర్మన్మీలో ఉన్నత చదువులకు, 2017, మేనెలలో వెళ్ళినారు. ఆయన అక్కడ 2017, జులై-10న ఈతకు వెళ్ళి, ప్రమాదవశాత్తు నీట మునిగి, ప్రాణాలు కోల్పోయినారు. 16వతేదీన మృతదేహం గ్రామానికి చేరుకోగా మిత్రులు, బంధువుల అశ్రునయనాల మధ్య, అంత్యక్రియలు ముగించారు.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

శ్రీ మామిళ్ళపల్లి రమణయ్య

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన మామిళ్ళపల్లి రమణయ్య, అమెరికాలోని కనెక్టికట్ నగరంలోని యేల్ విశ్వవిద్యాలయంలో, సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన నేతృత్వంలోని ముగ్గురు శాస్త్రవేత్తల బృందం, రక్తం ద్వారా గర్భస్త వ్యాధి (ఎండోమెట్రియాసిస్) ని గుర్తించవచ్చని కనిపెట్టినారు. ఇప్పటి వరకు దీనిని శస్త్ర చికిత్స ద్వారా మాత్రమే కనిపెట్టుచున్నారు. ఈ పరిశోధనను గుర్తించిన అమెరికా సైన్స్ కాంగ్రెస్ నిర్ణాయక కమిటీ సభ్యులు, వీరికి పురస్కారం, నగదు మహుమతిని అందజేసినారు.

ఇతను ఈ గ్రామములోని ఒక సాధారణ రైతు కుటుంబంలో, లక్ష్మమ్మ, చిన్నరోశయ్య దంపతుల కుమారుడు. వీరు ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి., శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పి.హె.డి. చేసి అనంతరం దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసారు. 1997లో ఇజ్రాయిల్ దేశం వెళ్ళిన వీరు, 1998లో, అమెరికాలోని వైఎల్ విశ్వవిద్యాలయంలో చేరి, 23 సంవత్సరాలపాటు 70 పరిశోధనలు చేసారు. ఈ క్రమంలోనే, మధ్య వయస్సు మహిళలలో ఎండ్రో మెట్రియాసిస్ గుర్తింపుకు దోహదపడే మైక్రో ఆర్.ఎన్.యే.ను కనుగొన్నారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]