కోరంగి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కోరంగి, తూర్పు గోదావరి జిల్లా, తాళ్ళరేవు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము ప్రసిద్ధి చెందిన కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నది. ఈ గ్రామము కాకినాడ నుండి 15 కి.మీల దూరంలో ఉన్నది.
కోరంగి గ్రామము పేరు మీద నామకరణము చేసిన కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం గోదావరి డెల్టాలో ఉన్నది. ఈ సంరక్షణా కేంద్రము ఉప్పునీటి మొసళ్ళు వంటి సరీసృపాలకు ప్రసిద్ధి చెందినది
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
కోరంగి చాలా ప్రాచీన గ్రామము. ప్లినీ కాలములో కోరింగ గ్రామము ఒక మూలాగ్రము (కేప్)పై ఉండేది. క్రమేణా కోరంగి బేలో ఇసుక మేట వేసి తీరము విస్తరించడం వలన ప్రస్తుతము కోరంగి గ్రామము తీరానికి కొన్ని మైళ్ళదూరములో ఉన్నది. ఈ విస్తరణ ప్రతి 20 సంవత్సరాలకు ఒక మైలు చొప్పున జరిగినది మరియు ప్రతి పది సంవత్సరాలకు ఒక అడుగు చొప్పున మేట వేసింది.[1]
ప్రస్తుతం కోరంగి నదికి తూర్పు తీరాన ఉన్న కోరంగి పట్టణాన్ని 1759 ప్రాంతములో ఇంజరం రెసిడెంటు వెస్ట్‌కాట్ నిర్మింపజేశాడు. పశ్చిమ తీరములో నదికి ఆవలివైపు ఉన్న పాత కోరంగి దీనికంటే పురాతనమైనది.[2] కోరంగిలో మొదట డచ్చివారు స్థావరమేర్పరచుకున్నారు. 1759లో బ్రిటీషువారు ఈ పట్టణాన్ని చేజిక్కించుకొని ఇక్కడికి దక్షిణాన 5 మైళ్ళ దూరములో ఇంజరం వద్ద ఒక ఫ్యాక్టరీని నెలకొల్పారు.[3] 1827లో ఫ్యాక్టరీ మూతవేసేవరకు ఇంజరంలో ఒక బ్రిటీషు వాణిజ్య రెసిడెంటు మరియు ఆయన సిబ్బంది ఉండేవారు.[4] బ్రిటీషు వారి కాలములో కోరంగి తూర్పుతీరములోనే అత్యుత్తమ రేవుగా పేరు పొందినది[5]
1789లో ఒక తుఫాను తాకిడికి వచ్చిన ఉప్పెన వలన కోరంగిలో 20వేలమంది మరణించారు. 1839, నవంబర్ 25న వచ్చిన మరో పెద్ద తుఫాను వలన బలమైన గాలులతో పాటు 40 అడుగుల ఎత్తున వచ్చిన ఉప్పెనతో రేవు గ్రామమైన కోరంగి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈ తుఫాను ఫలితంగా 30 వేల మంది ప్రజలు మరణించారు.[6]
ఆంగ్లభాషలో తుఫానుకు సమానపదమైన సైక్లోన్ ను బ్రిటీషు ఈస్టిండియా కంపెనీ అధికారి అయిన హెన్రీ పిడ్డింగ్టన్ 1789 డిసెంబర్లో కోరంగిని ముంచెత్తిన పెనుతుఫానును వర్ణించడానికి కనిపెట్టాడు.[7]
[మార్చు] వలసలు
ఆంధ్రులు మారిషస్‌కి వలస వెళ్ళడం 1836లో కొరింగ నుండే ప్రారంభమయ్యింది. కొరింగ నుండి గాంజెస్(గంగ) అనే నౌక ఎక్కి వెళ్లినట్లు రికార్డు ఉంది. ఆ తర్వాత విశాఖపట్నం పరిసరప్రాంతాల నుంచి చాలామంది వెళ్లారు. మారీషస్ కు తెలుగు వారి వలసలలో కొరింగ ఎంత ప్రధానత్య వహించిందంటే మారిషస్ లో తెలుగువాళ్ళను కొరింగలు అని పిలిచేవారు. ఒకేసారి ఎక్కువమంది తెలుగువాళ్ళు మారిషస్‌కి వెళ్ళే నౌక ఎక్కింది 1843లో. కొరింగా పాకెట్ అనే ఈ నౌక కొరింగ రేవు నుండి బయల్దేరింది. ఆ నౌక యజమాని పేరు పొనమండ వెంకటరెడ్డి. 1837 - 1880ల మధ్య దాదాపు 20 వేల మంది ఆంధ్రులు మారిషస్‌లోని చెరుకు తోటలలో కూలీలుగా పని చేయడానికి వెళ్ళారు. వాళ్ళలో ఎక్కువ మంది గంజాం, వైజాగ్, రాజమండ్రి ప్రాంతం వాళ్ళు.[8]
18వ శతాబ్ద మధ్యకాలంలో, తెలుగు వ్యవసాయ కూలీలు బ్రతుకు తెరువుకోసం కోరంగి రేవునుండి తెప్పలపై రంగూనుకు వలస వెళ్ళడం మొదలయ్యింది. అదృష్టవంతులు గమ్యాన్ని చేరేవాళ్ళు, దురదృష్టవంతులు నడిసముద్రంలో గల్లంతయ్యేవారు. ఈ ప్రవాసాంధ్రులను బర్మీయులు కోరంగీలనేవారు. ఈ వలస 1942లో జపనీయులు బర్మాపై దాడిచేసే వరకు సాగింది. త్వరగా డబ్బు చేసుకోవాలని వలస వెళ్ళిన ఈ జనం, విశాఖపట్నం, చీకాకోల్ (ఇప్పటి శ్రీకాకుళం), గోదావరి డెల్టాకు చెందినవారు. జల దుర్గ, చిల్క అనే పొగ ఓడలు ఈ వలసదారులను చేరవేయడంలో ప్రధాన పాత్రను నిర్వహించాయి.[9]
[మార్చు] మూలాలు
- ↑ Godavari District Gazetteer By F.R.Hemingway (పేజీ.9)
- ↑ Godavari District Gazetteer By F.R.Hemingway (పేజీ.211) [1]
- ↑ http://www.1911encyclopedia.org/Coringa
- ↑ A Descriptive and Historical Account of the Godavery District in the Presidency of Madras By Henry Morris పేజీ.41[2]
- ↑ http://www.peter-hug.ch/lexikon/1888_bild/04_0268 (జర్మన్)
- ↑ The sailor's horn-book for the law of storms By Henry Piddington పేజీ.150[3]
- ↑ http://www.etymonline.com/index.php?search=Cyclone
- ↑ ప్రపంచ పటంలో ప్రవాస భారతం - ఆంధ్రజ్యోతి పత్రికలో (జనవరి 2006) డాక్టర్ టి.ఎల్.ఎస్.భాస్కర్ రాసిన వ్యాసం
- ↑ http://hindujobs.com/thehindu/mp/2003/07/07/stories/2003070700860100.htm
[మార్చు] బయటి లింకులు
|
|
|
|---|---|
| చొల్లంగి · చొల్లంగి పేట · జీ. వేమవరం · పటవల · కోరంగి · పొలెకుర్రు · లచ్చిపాలెం · ఉప్పంగల · పిల్లంక · ఇంజరం · సుంకరపాలెం · నీలపల్లి · పీ. మల్లవరం · జార్జీపేట |