కోలిన్ మెకంజీ

వికీపీడియా నుండి
Colin Mackenzie

కల్నల్ కోలిన్ మెకంజీ (ఆంగ్లం: Colonel Colin Mackenzie) (1754 - 1821) ప్రముఖ ఆంగ్లేయ అధికారి మరియు భారతదేశపు మొదటి సర్వేయర్ జనరల్..

వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పాలనలో 1797లో అమరావతి పట్టణము దర్శించిన కోలిన్ మెకంజీ అచటి భవనాలను, నగర నిర్మాణాన్ని ఆసియాటిక్ జర్నల్ లో పలువిధములుగా పొగిడాడు. దీపాలదిన్నె గా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ . దీనితో అమరావతి చరిత్ర అంతర్జాతీయం ప్రసిద్ధిచెందినది. మెకంజీ జననము 1754 వ సంవత్సరము. స్కాట్ లాండులో. మరణము: 1821 వ సంవత్సరంలో కలకత్తాలో. మెకంజీ 1810 వ సంవత్సరంలో మద్రాసు సర్యేయర్ జనారల్ గా నియమింప బడ్డాడు. ఇతను తన కాలంలో సుమారు 1560 తాళ పత్ర గ్రంధాలను సేకరించాడు. ఇంకా పురాతన నాణేలు, పురాతన వస్తువులు సేకరించాడు. చరిత్రకు సంబందిన వస్తువులను అనేకం సేకరించాడు. ప్రపంచ చరిత్రలో ఇన్ని చారిత్రిక వస్తువులను సేకరించిన వారు మరొకరు లేరు. మెకంజీ మరణానంతరము సి.పి.బ్రౌన్ అన్నింటికి శుద్ద ప్రతులు రాయించారు . వాటినే మెకంజీ కైపీయత్తులూ అంటున్నారు. మెకంజీ కృషి వల్లె అమరావతి లోని బౌద్ద స్థూపము వెల్లడయింది. 1792 లో మెకంజి, అనాటి అమరావతి పాలకుడైన వెంకటాద్రి నాయుడుని కలుసుకొని వివరాలు సేకరించి ప్రచురించాడు. అమారావతి చెందిన పాల రాతి పలకలను స్థానికి జమీందారు వెంకటాద్రి నాయుడు తన భవన నిర్మాణానికి సున్నం తయారు చేయడానికి ఉపయోగిస్తుంటే అడ్డు పడి వాటి ప్రాధాన్యతను జమీందారుకు వివరించి, ఒప్పించి, ఆపించి, వాటి రక్షణకు పూను కున్నాడు. అప్పటి వరకు మిగిలి వున్న పలకలను వాటిపై వున్న శిల్ప కళల ఆదారంగా మొత్తం మహా చైతన్య రూపాన్ని చిత్రించ గలిగాడు. ఆ విధంగా అమరావతి స్థూపం ఆకారం మనం ఇప్పుడు చూడ గలుగుతున్నాము. కాని ఆ శిలా పలకాలలో అధిక భాగం బద్రపరచ డానికి లండన్ లోని ప్రదర్శన శాలకు తరలించ బడ్డాయి. ఇటు వంటి పురావస్తు సామాగ్రిని సేకరించుటకు బొర్రయ్య అనె ఆతన్ని జీతమిచ్చి నియమించు కొని అనేక వివరాలు సేకరించాడు. ఇతను సేకరించిన వస్తువులను , తాళ పత్ర గ్రంధాలను మద్రాసులోని ప్రాచ్యలిఖిత బాండాగారంలో భద్ర పరిచారు. అవి ఈ నాటికి ప్రదర్శనకు సిద్దంగా వున్నాయి

మూలాలు [మార్చు]

  • W. C. Mackenzie: Colonel Colin Mackenzie, first Surveyor-General of India. Edinburgh: W&R Chambers, 1952

బయటి లింకులు [మార్చు]