గోను తుఫాను

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గోను తుఫాను (Super Cyclonic Storm Gonu)
Category 5 తుఫాను cyclone (SSHS)
తీవ్రమైన స్థాయిలో గోను తుఫాను Cyclone Gonu near peak intensity
ఏర్పడిన తేదీ జూన్ 1, 2007
అదృశ్యమైన తేదీ జూన్ 7, 2007
అత్యధిక గాలులు 10-minute sustained:
240 km/h (150 mph)
1-minute sustained:
260 km/h (160 mph)
అత్యల్ప పీడనం 920 mbar (hPa); 27.17 inHg
మరణాలు 72 మొత్తం
నష్టం $4.216 billion (2007 USD)
ప్రభావిత ప్రాంతాలు ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాకిస్తాన్, ఇరాన్
Part of the 2007 North Indian Ocean cyclone season

2007 జూన్‌లో సంభవించిన తుఫాన్ పేరు గోను (Cyclone Gonu -JTWC designation: 02A, also known as Super Cyclonic Storm Gonu). అరేబియా సముద్రంలో నమోదైన తుఫాన్‌లన్నింటికంటే ఇది అత్యంత ఉధృతమైనదిగా గుర్తించారు. ఉత్తరాన హిందూమహా సముద్రంలో సంభవించిన అతిపెద్ద తుఫాన్‌కు ఇది ఇంచుమించు సమానంగా ఉంది. [1] జూన్ 1న అరేబియా సముద్రం తూర్పు ప్రాంతంలో చిన్న అల్పపీడన ద్రోణి (convection)గా ఇది ప్రారంభమైంది. ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలి దిశ అనుకూలంగా ఉండడంతో ఇది జూన్ 3 నాటికి ఉధృతంగా, 240 km/h (150 mph) గాలి వేగంతో బలపడింది అని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. తరువాత పొడి గాలులు, చల్లని సముద్రజలాల కారణంగా కాస్త బలహీనపడింది.

జూన్ 5వ తారీఖున ఇది ఒమన్ తూర్పు తీరాన్ని (రాస్ అల్ హద్ వద్ద) తాకింది. అరేబియన్ ద్వీపకల్పంలో ఇంత పెద్ద తుఫాన్ ఇంతకు ముందు నమోదు కాలేదు. ఈ ప్రాంతంలో అల్ప పీడనాలు బలహీనంగా ఉంటాయి. అవికూడా త్వరగా చెదరిపోతాయి. [2]

తుఫాను చరిత్ర[మార్చు]

Storm path


మే 27న అరేబియా సముద్రం ఆగ్నేయ దిశలో ఒక విశాలమైన అల్ప పీడన ద్రోణి ఏర్పడింది. [3] ఇది మరింతగా బలపడి మే 31నాటికి మే 31నాటికి బొంబాయికి దక్షిణాన 645 km (400 mi) దూరంలో ఒక ఉష్ణమండల తుఫాన్ ద్రోణి ఏర్పడింది. దీనికి ముందు స్పష్టమైన క్రింది లెవెల్ గాలి తీవ్రత లేదు. కాని పశ్చిమ దిశలో అల్పపీడన లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. [4] వాతావరణంలో ఎత్తైన పైపొరలలో ఉన్న అధిక ఉష్ణోగ్రత పరిస్థితులు ఈ తుఫాన్ మరింతగా బలపడడానికి దోహదపడ్డాయి. జూన్ 1 నాటికి ఈ ద్రోణికి క్రింది లెవెల్ వాయుతీవ్రత పెరిగింది. [5] అప్పటినుండే భారత వాతావరణ శాఖ దీనిని అల్పపీడన ద్రోణిగా వర్గీకరించింది. [6] ఇది క్రమంగా పశ్చిమ దిశగా ప్రయాణించసాగింది. జూన్ 2సంకీర్ణ తుఫాన్ హెచ్చరిక కేంద్రం (Joint Typhoon Warning Center) (JTWC) దీనిని 02 శ్రేణి తుఫాన్‌గా వర్గీకరించి హెచ్చరికలు జారీ చేసింది. [7] (JTWC వారు మూడు సంవత్సరాలకు సరిపడా తుఫాన్ పేర్ల జాబితానొకదానిని తయారుగా ఉంచుతారు. క్రమంలో ఒక్కో తుఫాన్‌కు ఒక్కోపేరు పెడతారు. ఒకసారి వాడిన పేరును మరోసారి వాడరు)


మొదట్లో ఈ ద్రోణికి వాయువ్యదిశగా పొడి వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నందున ఇది మరింత బలపడకుండా ఆగుతుందని భావించారు. [7] కాని తుఫాన్ క్రమంగా ఉధృతమైంది. జూన్ 2 నాటికి అంతర్జాతీయ వాతావరణ సంస్థ దీనిని తీవ్రమైన ద్రోణిగా గుర్తించింది. [8] తరువాత దీనిని తుఫాన్‌గా గుర్తించారు. [9] గోను అనగా మాల్దీవుల ధివేహీ భాషలో 'తాటాకులతో చేసిన సంచి'. [10]


అదే సమయంలో పాకిస్తాన్‌ ప్రాంతంలో మరొక ద్రోణి తయారైంది. అందువలన 'గోను' క్రమంగా ఉత్తరానికి, ఈశాన్యానికి ప్రయాణించింది. [11] తరువాత మళ్ళీ వాతావరణంలో సంభవించిన మార్పులవల్ల పశ్చిమ దిశగా ప్రయాణించింది. [12] క్రమంగా అది మరింత బలపడడంతో జూన్ 3 నాటికి దానిని 'తీవ్రమైన తుఫాన్'గా వర్గీకరించారు. [13] తరువాత మరింత ఉధృతమైనందున దానిని JTWC వారు Saffir-Simpson Hurricane Scaleలో Category 1 తుఫాన్‌గా వర్గీకరించారు. [14] అంటే పొడి వాతావరణం ఈ తుఫాన్పైన ముందు అంచనా వేసినంత ప్రభావం చూపలేకపోయినందున అది అంచనాలను మించి బలపడింది.

ఒమన్‌ను సమీపిస్తున్న తుఫాను [1].


తుఫాన్ గమన మార్గంలో ఉన్న అధిక ఉష్ణ పరిస్థితులవలన ఆ వాయుగుండం మధ్యభాగంలో స్పష్టమైన 'కన్ను' (eye of the cyclone) ఏర్పడింది. [15] జూన్ 3 నాటికి అంతర్జాతీయ వాతావరణ శాఖ (IMD) వారు దీనిని "చాలా తీవ్రమైన తుఫాన్"గా వర్గీకరించారు. [16] దీనితో ఇది అరేబియా సముద్రంలో ఇంతకుముందు నమోదైన అన్నింటికంటే తీవ్రమైన తుఫాన్‌గా నిశ్చయమైంది. [1] పై దిశగా వీచే గాలులు తక్కువగా ఉండడం వలనా, ఇతర అనుకూల వాతావరణ పరిస్థితులవలనా 'గోను' క్రమంగా బలపడింది. నిలకడగా వీచే గాలులు గంటుకు 260 కి.మీ., స్వల్పకాలిక దుమారాలు గంటకు 315 కి.మీ. వేగం కలిగి ఉన్నాయి. - peak 1-min sustained winds of 260 km/h (160 mph) and gusts to 315 km/h (195 mph) - ఇప్పటికి ఇది ఒమన్ తూర్పు తీరాన ఉన్న మసీరాహ్ దీవికి తూర్పు ఆగ్నేయ దిశలో 285 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. [17] [1] జూలై 4 నాటికి అంతర్జాతీయ వాతావరణ శాఖ వాఱు దీనిని "చాలా చాలా తీవ్రమైన తుఫాన్" (Super Cyclonic Storm) గా వర్గీకరించారు. [18]

షుమారు 9 గంటల తరువాత తుఫాన్లో గాలి వేగం కాస్త తగ్గినందున జూన్ 5న మళ్ళీ దీనిని "చాలా తీవ్రమైన తుఫాన్" (very severe cyclonic storm) అన్న శ్రేణిలో వర్గీకరించారు. [19] [20]


24 గంటలలో ఒమన్ భూభాగం ఉపరితల పరిస్థితులు ఈ తుఫాన్ తీవ్రతను అడ్డుకొన్నాయి. గాలి వేగం ముందుకంటే తగ్గింది (గంటకు 260 కి.మీ. వేగం నుండి గంటకు 170 కి.మీ. కు తగ్గింది). [21] ఒమన్ తీర ప్రాంతాన్ని తాకింది. అరేబియన్ పెనిన్సులాలో ఇంతకు ముందు ఇంత పెద్ద తుఫాను నమోదు కాలేదు. [22] [23]


భూతల పరిస్థితులవలన తుఫాన్ వేగం కాస్త మందగించినప్పటికీ మొత్తం వాయుగుండం బలం నిలకడగా ఉంది. [24] తరువాత వాయుగుండం ఒమన్ తీరానికి షుమారు సమాంతరంగా ప్రయాణించి, మస్కట్ పట్టణానికి కొద్ది దూరంగా, ఉత్తర దిశగా వెళ్ళింది. మళ్ళీ 'ఒమన్ గల్ఫ్' (Gulf of Oman) లో ఇది కాస్త బలపడింది. [25] ఇది అందినంత రికార్డులమేరకు ఒమన్ గల్ఫ్లో సంభవించిన మొదటి "ఉష్ణమండలపు తుఫాన్" (tropical cyclone). [26] [1] [27]

జూన్ 6న ఇది ఉత్తర వాయువ్యదిశగా ప్రయాణించింది. అప్పుడు సముద్రంలోని అలల బలం దీనికి వ్యతిరేక దిశలో ఉండడంవలన తుఫాన్ తీవ్రత బాగా మందగించింది. వాతావరణ శాఖ దీనిని సామాణ్యమైన "ఉష్ణమండల తుఫాన్" (tropical storm) గా వర్గీకరించింది. [28] [29] [30] [31] జూన్ 7న గోను ఇరాన్ దేశపు మకరాన్ తీరాన్ని దాటింది. ఆంతటితో ఈ తుఫాన్ శాంతించిందని చెప్పవచ్చును. [32]

తయారీ చర్యలు[మార్చు]

తీవ్రమైన గాలులు, అధిక వర్షపాతం కలిగే అవకాశం ఉన్నందున విపరీతమైన నష్టం వాటిల్లే అవకాశం ఉన్నదని ఒమన్ జాతీయ రక్షణా వ్వవస్థ గుర్తించింది. అందువలన వీలయినంత వరకు నష్టాన్ని నివారించడానికి, అనంతర సహాయ చర్యలు చేపట్టడానికీ పెద్దయెత్తున సన్నాహాలు చేశారు. పోలీసు, మిలిటరీ, పారామిలిటరీ, వైద్య, మునిసిపాలిటీ, విద్యుత్, నీటి సరఫరా విభాగాలు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకొన్నారు. [33] మసీరా దీవినుండి 7,000 జనాలనూ, ఇతర లోతట్టు తీర ప్రాంతాలనుండి చాలా మందినీ వేరే ప్రాంతాలకు తరలించారు. [34] మొత్తం 20,000 మందిని అత్యవసర సహాయ కేంద్రాలకు తరలించారు. [35] దేశం మొత్తం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. [36] 1977లో మసిరా దీవిని తాకిన తుఫానుకంటే ఇది పెద్ద తుఫాన్ అని ప్రకటించారు. [37] ముందు జాగ్రత్త చర్యగా 'మినా అల్-ఫహల్' చమురు కర్మాగారాన్ని మూసివేశారు. [38] [39] జూన్ 5 నుండి 'సీబ్ అంతర్జాతీయ విమానాశ్రయం' నుండి విమాన సర్వీసులకు అంతరాయం కలుగసాగింది. [40]

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలో పెద్దగా ప్రమాదకర పరిస్థితులు ఉంటాయని అంచనాలు వేయలేదు. పాకిస్తాన్లో మత్స్యకారులకు ముందు జాగ్రత్త హెచ్చరికలు జారీ చేయబడ్డాయి.


ఇరాన్లో గట్టి గాలులు, ఎక్కువ వర్షపాతం వచ్చే పరిస్థితులు ఉన్నాయి గనుక ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు. షుమారు 40,000 మందిని తీర ప్రాంతాలనుండి ఇతర ఆవాసాలకు తరలించారు. [41] [42] [43]

ప్రభావం[మార్చు]

మస్కట్ నగరంలో గండి పడిన రోడ్డు

గోను తుఫాను వలన భారతదేశంలో ఋతు పవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. [44]


ఒమన్ తీరప్రాంతాన్ని తాకడానికి 7 గంటలు ముందునుండి తుఫాను ప్రభావం ఒమన్ తీరప్రాంతంపై కనిపించింది. ఈదురుగాలులు, అధిక వర్షపాతం సంభవించాయి. [45]కొన్ని ప్రాంతాలలో 610 మి.మీ.వరకు వర్షపాతం నమోదయ్యింది. [46] బలమైన గాలులు తీరాన వీచాయి. [45] తీరాన రహదారులన్నీ జలమయమైపోయాయి. [41] స్తంభాలు కూలి పోవడం వలన టెలిఫోను, విద్యుత్ సదుపాయాలు కొన్ని చోట్ల తీవ్రంగా స్తంభించాయి. కాని దేశంలో అత్యధిక ప్రాంతంలో ఈ సౌకర్యాలు కొనసాగాయి.

జూన్ 5న మొట్టమొదట తుఫాను ప్రభావం మసీరా దీవి మీదా, షర్కియా ప్రాంతంలోనూ అధికంగా ఉంది. ఇక్కడి ముఖ్యపట్టణమైన సూర్, చుట్టుప్రక్కల రాస్ అల్ హద్ వంటి గ్రామాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యాయి. కొంత సమయం వీటికి మస్కట్ నగరంతో దాదాపు పూర్తిగా సంబంధం లేకుండా జరిగింది. [47]

జూన్ 6న తుఫాన్ మస్కట్ నగరానికి దగ్గరగా తీరం వెంట ప్రయాణించింది. మస్కట్లో గాలులు 100 కి.మీ. వేగంతో వీచాయి. దీనివలన మస్కట్ నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయమైనాయి. అనేక ప్రదేశాలలో రోడ్లు కోతపడి పెద్దపెద్ద గండ్లు పడ్డాయి. అమ్రాత్ మార్గంలో కొండచరియలు విరిగి పడడం వలన అమ్రాత్, కురియాత్, యిత్తీ, జహలూత్, సెహధాబీ వంటి ప్రదేశాలు రాజధానినుండి వేరుపడ్డట్టయ్యింది. నగరంలో ధనికుల నివాస, షాపింగ్ స్థానంగా పేరుపడిన కురమ్ కమర్షియల్ కాంప్లెక్సు ప్రాంతం పెద్దయెత్తున జలమయమయ్యింది. రెండస్తుల భవనాలు పూర్తిగా నీట మునిగాయి. అలాగే ఘుబ్రాహ్ ప్రాంతంలో నీరు పెద్దప్రవాహంలా వచ్చిపడి ఇండ్లను ముంచివేసింది. పోలీసు, మిలిటరీ దళాలు ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలను నిరోధించడం వలన పౌరుల ప్రాణనష్టం చాలావరకు నివారించబడింది.


మస్కట్లోనూ, ఇతర ప్రదేశాలలోను అధిక నష్టానికి ప్రధానకారణం గాలులుకావు, ఉవ్వెత్తుగా "వాడీ"లు పొంగడం. ఇందుకు మస్కట్ నగర స్వరూపాన్ని గమనించాలి. "వాడీ" అంటే ఒక నీటిపారుదల కాలువ. ఇవి సంవత్సరం పొడవునా ఎండిపోయి ఉంటాయి. వర్షం వచ్చినపుడు గంటలలో, ఒక్కోమారు నిముషాలలో ఇవి పొంగులెత్తుతాయి. సముద్రానికీ, కొండలకూ మధ్య సన్నని చారగా మస్కట్ నగరం విస్తరించి ఉంది. సముద్రతీరంనుండి కేవలం ఒక మైలు దూరంలో ప్రారంభమైన ఈ కొండలు వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి. ఆంత విశాలమైన కొండ ప్రదేశంలో పడే వర్షపాతాన్ని నిలువరించడానికి ఏవిధమైన జలాశయాలు గాని, నీటిపారుదల సౌకర్యాలుగాని లేవు. కనుక ఆ నీరంతా ఉధృతంగా నిముషాలలో 'వాడి' రూపంలో సముద్రంవైపు పరుగులెడుతుంది. ఇటీవల నగరం విస్తరించినకొద్దీ వాడీలకిరుప్రక్కలా, ఒక్కోమారు వాడీలలోపల కూడా నివాసస్థానాలు పెరిగిపోయాయి. వీటిలో చాలావాడీలు సామాన్యమైన వర్షాలకు పెద్దగా ప్రవహించవు. కాని ఇప్పుడు వచ్చిన తీవ్రమైన వర్షపాతానికి ఏనాడో ప్రజలు మరచిపోయిన వాడీలు పోటెత్తి జనావాసాలమధ్యనుండి పరుగులెత్తాయి.


అయితే, కొన్ని వార్తలలో చెప్పినట్లు, దేశం మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోలేదు. సూర్, దాని పరిసరాలలో మాత్రం దాదాపు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనిని పునరుద్ధరించడానికి మూడు రోజులనుండి వారం వరకు పట్టింది. మస్కట్ నగరంలో షుమారు సగంవరకు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా సాగింది. మిగిలిన సగంలో చాలావరకు 24 గంటలనుండి 3రోజులలో పునరుద్ధరింపబడింది. ఇక నిజ్వా, సోహార్, ఇబ్రీ వంటిప్రాంతాలలో తుఫాన్ ప్రభావం పెద్దగా లేదు.


అయితే మస్కట్ నగరంలో త్రాగు నీటిసరఫరాకు మరింత ఎక్కువగా అంతరాయం కలిగింది. ఇది మూడునుండి ఏడు రోజులలో అంచెలంచెలుగా పునరుద్ధరింపబడింది. దేశంలో ఆయిల్ ఉత్పత్తి సదుపాయాలకూ పెద్దగా నష్టం వాటిల్లలేదు (తాత్కాలిక అంతరాయం మినహయించి). [35] [48]


ఒమన్ ప్రభుత్వం వారి వివరాల ప్రకారం తుఫాన్ కారణంగా 49 మంది మరణించారు. మరొక 27 మంది జాడ తెలియలేదు. [49] మరణించినవారిలోషుమారు 9 మంది భారతీయులు. మొత్తం 20,000 మంది తుఫాన్ ప్రభావం వల్ల తీవ్రంగా నష్టపోయారు. [50] తుఫాన్ కారణంగా జరిగిన నష్టం 4 బిలియన్ డాలర్లు (1.5 బిలియన్ రియాల్లు) అని అంచనా వేయబడింది. ఇది ఒమన్ చరిత్రలోనే అత్యధిక తీవ్రమైన ప్రకృతి వైపరీత్యం. [51]

మే 31, జూన్ 7, 2007 మధ్య కాలంలో అరేబియా ప్రాంతంలో నమోదైన వర్షపాతం చూపే పటం. 200 మి.మీ. పైగా వర్షపాతం ఉన్న ప్రాంతాలు ఎరుపు రంగులో చూపబడ్డాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఫ్యుజైరాహ్‌తీరాన్ని పెద్ద పెద్ద అలలు తాకాయి. రహదారులు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి.

[52] 10 మీటర్లు ఎత్తైన అలలవలన కొన్ని చేపలు పట్టే పడవలకు నష్టం వాటిల్లింది. [53] [54]


తరువాత ఇరాన్‌లో గంటకు 74 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. ఛబహార్ పట్టణం చుట్టుపట్ల ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడ్డాయి. విద్యుత్ సరఫరాకు కొద్దిపాటి అంతరాయం కలిగింది. కొన్ని మట్టి ఇండ్లు కూలిపోయాయి. [42] [35] [42] [43] [35] [55] [38] [56] ఒకనది పొంగడం వలన, నిక్షార్ ఆనకట్ట నాశనమవడం వలనా మరికొంత వినాశనం సంభవించింది. మొత్తం దేశంలో 23 మంది మరణించారు. ఇరాన్ దేశంలో నష్టం 2 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. [55]

తరువాత చర్యలు[మార్చు]

కురమ్ ప్రాంతంలో మేటలు వేసిన మన్ను, నాశనమైన కార్లు

గోను తుఫాను విమాన సౌకర్యాలకు కూడా అంతరాయం కల్పించింది. ఒమన్ దేశము లో మస్కట్ లొ ఉన్న సీబ్ ఆంతర్జాతీయ విమానశ్రయం మూడు రోజులు మూసి నాల్గవ రోజు తెరిచారు. యు.ఏ.ఇ లొని ఫిజిరాయ్ నౌకాశ్రయాన్ని జూన్ 6 వ తారిఖు మూసి 7 వ తారీఖు తెరిచారు. .[48] . ఈ పెను తుఫానుచమురు సరఫరా కు కొద్దిగా అంతరాయం కల్పించిన చముర ధరలు బ్యారలు కు 2 డాలర్లు తగ్గాయి.[57] ఓమన్ కి నీరు సఫరా చేసే గోను ప్యాసేజి లో ఉన్న రెండు డీసెలైనేషన్ ఫ్లాంట్లు ఈ తుఫాను వల్ల మూయ బడ్డాయి. ఒక ఫ్లాంటు మూసి వేయడం వల్ల మస్కట్ నగరం లో 631,000 మందికి నీరు సరఫరాకి అంతరాయం కలిగింది, అమ్తే కాకుండా తోర్పు ఓమను కు నీటి కొరత కూడా ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ఉన్న నీటి నిల్వలు ఖాళీ చేసి క్రొత్త నిల్వలు ప్రారంభించారు, పరిస్థుతులు మాములు స్థితికి రావడానికి ఐదు రోజులు పట్టింది. విద్యుత్తు సిబ్బంది విద్యుత్తు కొరతను త్వరగా పరిష్కరించారు. [49] అధికారులు ఐదు రోజులలో గోను తుఫాను ఏర్పడిన విద్యుత్తు, నీటి సమస్యను పరిష్కరించి ఆసుపత్రులకు, తీర ప్రాంత ప్రజలకు సామాన్య స్థితికి తీసుకొని వచ్చారు. ఓమనీ సైన్యం ప్రజలు తమ స్వస్థలాలు చేర్చడం లో సహకరించింది.

ఇరాన్‌లో కూడా పెద్దయెత్తున సహాయ చర్యలు చేపట్టారు. [58]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 Joint Typhoon Warning Center (2007). "Northern Indian Ocean Tropical Cyclone Best Track Data". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 2. "NASA Earth Observatory: Tropical Cyclone Gonu". NASA. 2007-06-04. సంగ్రహించిన తేదీ 2007-06-05. 
 3. India Meteorological Department (2007). "May 27 Tropical Weather Outlook". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 4. Delta Forecast Team (2007). "May 31 Significant Tropical Weather Advisory for the North Indian Ocean". Joint Typhoon Warning Center. సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 5. Charlie Forecast Team (2007). "June 1 Significant Tropical Weather Advisory for the North Indian Ocean". Joint Typhoon Warning Center. సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 6. India Meteorological Department (2007). "June 2 Tropical Weather Outlook". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 7. 7.0 7.1 Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone 02A Warning NR 001". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 8. India Meteorological Department (2007). "Deep Depression over East Central Arabian Sea". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 9. India Meteorological Department (2007). "Cyclone Storm “GONU’ over East Central Arabian Sea". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 10. Associated Press (2007). "Powerful Cyclone Gonu Strikes Oil-Rich Persian Gulf". FOXNews.com. సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 11. Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone Gonu Warning NR 004". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 12. Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone Gonu Warning NR 005". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 13. India Meteorological Department (2007). "Severe Cyclone Storm “GONU’ over East Central Arabian Sea". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 14. Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone Gonu Warning NR 006". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 15. Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone Gonu Warning NR 007". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 16. India Meteorological Department (2007). "Very Severe Cyclonic Storm “GONU’ over East Central Arabian Sea". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 17. Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone Gonu Warning NR 010". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 18. India Meteorological Department (2007). "A Super Cyclonic Storm “GONU’ over East Central and adjoining westcentral and north Arabian Sea". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 19. India Meteorological Department (2007). "Very Severe Cyclonic Storm “GONU’ over East Central and adjoining westcentral and north Arabian Sea". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 20. Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone Gonu Warning NR 012". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 21. Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone Gonu Warning NR 015". సంగ్రహించిన తేదీ 2007-06-05. 
 22. India Meteorological Department (2007). "Very Severe Cyclonic Storm “GONU’.". సంగ్రహించిన తేదీ 2007-06-05. 
 23. NASA (2007). "Rare Tropical Cyclone Churns in Arabian Sea". సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 24. Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone Gonu Warning NR 016". సంగ్రహించిన తేదీ 2007-06-05. 
 25. India Meteorological Department (2007). "Very Severe Cyclonic Storm “GONU’.". సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 26. India Meteorological Department (2007). "Very Severe Cyclonic Storm “GONU’.". సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 27. Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone Gonu Warning NR 017". సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 28. Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone Gonu Warning NR 018". సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 29. Joint Typhoon Warning Center (2007). "Tropical Cyclone Gonu Warning NR 019". సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 30. India Meteorological Department (2007). "Severe Cyclonic Storm “GONU’.". సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 31. India Meteorological Department (2007). "Cyclonic Storm “GONU’.". సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 32. India Meteorological Department (2007). "Cyclonic Storm “GONU’.". సంగ్రహించిన తేదీ 2007-06-07. 
 33. Sunil K. Vaidya (2007). "Tropical cyclonic storm to strike eastern coast of Oman". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 34. Associated Press (2007). "Oman evacuates eastern island as powerful storm approaches". సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 35. 35.0 35.1 35.2 35.3 Associated Press (2007). "Cyclone Hammers Oman; Veers Toward Iran". Archived from the original on 2007-06-09. సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 36. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; reut64 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 37. Agencies (2007). "Cyclone reaches Omani coast". Gulfnews.com. సంగ్రహించిన తేదీ 2007-06-05. 
 38. 38.0 38.1 Lin Noueihed (2007). "Cyclone Gonu weakens to a storm on way to Iran". Reuters. సంగ్రహించిన తేదీ 2007-06-07. 
 39. Sunil Vaidya (2007). "Oman declares Gonu public holiday". Gulf News. సంగ్రహించిన తేదీ 2007-06-05. 
 40. Sunil Vaidya (2007). "Oman cancels all flights". Gulfnews.com. సంగ్రహించిన తేదీ 2007-06-05. 
 41. 41.0 41.1 Saeed Al-Nahdy (2007). "Cyclone Gonu's Winds Blast Oman Coast". Associated Press. Archived from the original on 2007-06-08. సంగ్రహించిన తేదీ 2007-06-05. 
 42. 42.0 42.1 42.2 Agence France-Presse (2007). "Iran evacuates thousands as cyclone strikes". సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 43. 43.0 43.1 Islamic Republic News Agency (2007). "Gonu Cyclone keeps lashing southern Iranian islands, cities". సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 44. Staff Writer (2007). "More pre-monsoon showers in city". Cybernoon.com. సంగ్రహించిన తేదీ 2007-06-04. 
 45. 45.0 45.1 Sunil Vaidya, Bureau Chief, Oman and Daniel Bardsley, Staff Reporter, and Aftab Kazmi (2007). "Gulf States on Gonu alert". Gulfnews.com. సంగ్రహించిన తేదీ 2007-06-05. 
 46. Daily News (2007). "Gonu inflicts $1bn damage". సంగ్రహించిన తేదీ 2007-06-11. 
 47. Sunil Vaidya (2007). "Cyclone Gonu weakening". Gulfnews.com. సంగ్రహించిన తేదీ 2007-06-06. 
 48. 48.0 48.1 Diala Saadeh (2007). "Cyclone Gonu leaves Oman, heads towards Iran". Reuters. సంగ్రహించిన తేదీ 2007-06-08. 
 49. 49.0 49.1 Associated Press (2007). "Cyclone Gonu causes water shortages in Oman". సంగ్రహించిన తేదీ 2007-06-10. 
 50. Indo-Asian News Service (2007). "Cyclone Gonu kills 12 in Iran, Gulf toll 61". సంగ్రహించిన తేదీ 2007-06-10. 
 51. Middle East North Africa Financial Network (2007). "Oman suffers $4b from Cyclone Gonu". సంగ్రహించిన తేదీ 2007-06-18. 
 52. Staff reporter (2007). "Fujairah hit by Cyclone Gonu". Gulfnews.com. సంగ్రహించిన తేదీ 2007-06-05. 
 53. Staff reporters (2007). "Gonu sends fish prices soaring". Gulfnews.com. సంగ్రహించిన తేదీ 2007-06-08. 
 54. United Press International (2007). "Iran surveys damage after cyclone". సంగ్రహించిన తేదీ 2007-06-10. 
 55. 55.0 55.1 Reuters (2007). "Death toll in Iran from cyclone climbs to 23". సంగ్రహించిన తేదీ 2007-06-10. 
 56. Gulfnews.com (2007). "Cyclone Gonu kills 15". సంగ్రహించిన తేదీ 2007-06-07. 
 57. Associated Press (2007). "Oil prices decline by US$2 a barrel after Cyclone Gonu dissipates, easing supply worries". సంగ్రహించిన తేదీ 2007-06-08. 
 58. International Federation of Red Cross And Red Crescent Societies (2007). "Iran: Cyclone Gonu Information Bulletin No. 2". Office for the Coordination of Humanitarian Affairs. సంగ్రహించిన తేదీ 2007-06-11. 

బయటి లింకులు[మార్చు]