Jump to content

చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
చెన్నూర్
—  శాసనసభ నియోజకవర్గం  —
దస్త్రం:Chennur assembly constituency.svg
చెన్నూర్ is located in Telangana
చెన్నూర్
చెన్నూర్
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. తూర్పు ఆదిలాబాదు భాగంలో కల ఈ నియోజకవర్గం జిల్లా రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ నుండి విజయం సాధించిన ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందినారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బోడ జనార్థన్ ఇక్కడ నుండి వరుసగా 4 సార్లు గెలుపొందినాడు. 2004లో వరుసగా ఐదవసారి బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి కుమారుడు జి.వినోద్ చేతిలో ఓడిపోయాడు. మరో ఆరు శాసనసభ నియోజకవర్గలతో పాటు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ నియోజకవర్గం 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,48,412.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం చెన్నూర్ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. ఇది వరకు ఉన్న వేమనపల్లి మండలం ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గంలో కలిసింది.

భౌగోళిక స్వరూపం

[మార్చు]

తూర్పున ప్రాణహిత నది, దక్షణముగా గోదావరి నది ఉన్న ఈ నియోజకవర్గం ప్రకృతి సంపదకు ప్రసిద్ధి. ఆదిలాబాదు జిల్లా తూర్పు భాగంలో ఈ నియోజకవర్గం ఉంది. తూర్పున మహారాష్ట్ర రాష్ట్రం సరిహద్దుగా ఉండగా, దక్షిణాన కరీంనగర్ జిల్లా సరిహద్దుగా ఉంది. పశ్చిమాన, ఉత్తరాన అదిలాబాదు జిల్లాకే చెందిన మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 కోదాటి రాజమల్లు కాంగ్రెస్ పార్టీ చంద్రయ్య ఇండిపెండెంట్
1967 కోదాటి రాజమల్లు కాంగ్రెస్ పార్టీ రాజమల్లయ్య ఇండిపెండెంట్
1972 కోదాటి రాజమల్లు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక
1978 సి.నారాయణ కాంగ్రెస్ పార్టీ వి.ప్రభాకర్ జనతా పార్టీ
1983 సొత్కు సంజీవరావు తెలుగుదేశం పార్టీ కె.దేవకి దేవి కాంగ్రెస్ పార్టీ
1985 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ కె.దేవకి దేవి కాంగ్రెస్ పార్టీ
1989 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ కోదాటి ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ
1994 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ సొత్కు సంజీవరావు కాంగ్రెస్ పార్టీ
1999 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ
2004 జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ
2009 నల్లాల ఓదేలు తెలంగాణ రాష్ట్ర సమితి జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ
2014 నల్లాల ఓదేలు తెలంగాణ రాష్ట్ర సమితి జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ
2018 బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర సమితి బోర్లకుంట వెంకటేశ్‌ నేత కాంగ్రెస్ పార్టీ
2023[1] జి. వివేకానంద్ కాంగ్రెస్ పార్టీ బాల్క సుమన్ భారత రాష్ట్ర సమితి

2004 ఎన్నికలు

[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో చెన్నూర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి జి.వినోద్ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడ జనార్థన్ పై 36781 ఓట్ల మెజారిటితో గెలుపొందినాడు. జి.వినోద్ 77240 ఓట్లు సాధించగా, బోడ జనార్థన్ 40459 ఓట్లు పొందినాడు.

2004 ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు

1999 ఎన్నికలు

[మార్చు]

1999లో బోడ జనార్థన్ వరుసగా నాలుగవ సారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయగా జి.వినోద్ కామ్గ్రెస్ తరఫున పోటీ చేశాడు. బోడ జనార్థన్ 42.57% ఓట్లు పొంది 4వ సారి విజయం సాధించగా, జి.వినోద్ 36.14% ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. సి.పి.ఐ. 16.72% ఓట్లతో మూడవ స్థానం పొందినది.

1994 ఎన్నికలు

[మార్చు]

1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బోడ జనార్థన్ వరుసగా మూడవ సారి బరిలోకి దిగగా, 65.78% ఓట్లతో భారీ ఆధిక్యతతో సమీప ప్రత్యర్థి ఎస్.సంజీవరావుపై విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 2.47% ఓట్లు పొందగా, బహుజన్ సమాజ్ పార్టీ 2.7% ఓట్లు పొందినది.

2023 ఎన్నికలు

[మార్చు]

2023 లో మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజక వర్గం లో అసెంబ్లీ ఎన్నికలు 30 నవంబర్ 2023 లో జరిగినాయి.ఫలితము 3 డిసెంబర్ 2023 న ఫలితాలు వెలువడినాయి.ఈ నియోజక వర్గంలో ప్రధనంగా మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ , భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి ఈ ప్రధాన పార్టీల మధ్య పోరు హోరా హోరి సాగింది. చివరికు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద్ 37,525 ఓట్ల మెజారిటీతో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బాల్క సుమన్ పై విజయం సాధించారు.చెన్నూర్ నియోజక వర్గంలో మొత్తం రౌండ్లో వారీగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కౌంటింగ్ నిర్వహించారు.మొత్తం 15 మంది అభ్యర్థులు పోటిలో ఉండగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద్ కు 87,541 ఓట్లు 57.51% , భారత రాష్ట్ర సమితి అభ్యర్థి బాల్క సుమన్ కు 50,026 ఓట్లు 32,86%, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దుర్గం ఆశోక్ కు 3,375 ఓట్లు 2.22 ,నోటాకు 1,792 ఓట్లు 1,18% వచ్చాయి.భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద్ 37,515 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించాడు.చెన్నూర్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా గెలుపు పత్రం అందుకున్నాడు[2].

క్రమసంఖ్య అభ్యర్థి పేరు అభ్యర్థి పార్టీ సాధించిన ఓట్లు శాతం
1 గడ్డం వివేకానంద్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 87,541 57,51%
2 బాల్క సుమన్ భారత రాష్ట్ర సమితి పార్టీ 50,026 32,86%
3 దుర్గం ఆశోక్ భారతీయ జనతా పార్టీ 3,375 2,22%
4 నోటా నోటా 1,792 1.18%
5 అసంపల్లి సంపత్ కుమార్ ఇండిపెండింట్ పార్టీ 1,444 0.95%
6 దాసరపు శ్రీనివాస్ బీఎస్ పి 1,398 0.66%
7 నందిపాటి రాజు డిహెచ్ ఎస్ పి 948 0.62%

వివిధ రాజకీయ పార్టీల పరిస్థితి

[మార్చు]

ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలే ప్రధాన పక్షాలుగా ఉన్నాయి. మూడవ పార్టీ అంతగా బలపడలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం ఆ పార్టీ ఈ నియోజకవర్గంలో మంచి ఉనికిని చూపింది. 1983 తరువాత ఇప్పటి వరకు జరిగిన 6 శాసనసభ ఎన్నికలలో 5 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా, 2004లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు జరిగిన 10 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు చెరో ఐదు సార్లు విజయం సాధించాయి.[3] తెలుగుదేశం పార్టీకి చెందిన బోడ జనార్థన్ ఇక్కడి నుండి 4 సార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన కోదాటి రాములు మూడు సార్లు గెలుపొందినాడు.2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ రంగంలో ఉండటంతో మూడు ప్రధాన పార్టీల మధ్య బలమైన పోటీ జరిగే అవకాశముంది.

నియోజకవర్గ ప్రముఖులు

[మార్చు]
  • బోడ జనార్థన్:
చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి 4 సార్లు గెలుపొందిన బోడ జనార్థన్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా పొందినాడు. ఆదిలాబాదు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ్య నాయకులలో ఒకడు. 1985లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.దేవకి దేవిపై విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టగా, 1989లో కోదాటి ప్రదీప్‌పై నెగ్గి అప్పటి ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో కార్మిక శాఖా మంత్రిపదవిని పొందినాడు.[4] 1994 శాసనసభ ఎన్నికలలో కూడా ఇదే నియోజకవర్గం నుండి సంజీవరావుపై భారీ మెజారిటీతో గెలిచి హాట్రిక్ సాధించాడు. 1999లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి కుమారుడైన జి.వినోద్‌పై నెగ్గినాడు. 2004లో మాత్రం జి.వినోద్ చేతిలో పరాజయం పొందినాడు.
  • జి.వినోద్:
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి కుమారుడైన జి.వినోద్ 1999లో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి, ఇదే నియోజకవర్గం నుండి 4 సార్లు గెలిచిన బోడ జనార్థన్ పై విజయం సాధించాడు. అంతకు క్రితం 1994లో బోడ జనార్థన్ చేతిలో ఓడిపోగా, 1999 అదే ప్రత్యర్థిపై విజయం సాధించి ఇది వరకు బోడ జనార్థన్ నిర్వహించిన కార్మిక శాఖా మంత్రి పదవిని పొందడం విశేషం.
  • కోదాటి రాజమల్లు:
కాంగ్రెస్ పార్టీకి చెందిన కోదాటి రాజమల్లు వరుసగా 3 సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలుపొందినాడు. 1962, 1967 ఎన్నికలలో విజయం సాధించగా 1972లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
  • ఎస్.సంజీవరావు:
1983 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ వరుస విజయాలకు పగ్గం వేసిన ఎస్.సంజీవరావు 1985లో ఎన్.టి.రామారావుకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు కూటమిలో చేరినాడు. 1985 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందినాడు. ఇతని స్థానం పొందిన బోడ జనార్థన్ ఇప్పటి వరకు నియోజకవర్గంలో పట్టు కలిగిఉన్నాడు.
  • కె.దేవకి దేవి:
కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.దేవకి దేవి 1983, 1985 ఎన్నికలలో చెన్నూర్ శాసనసభ స్థానం నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల చేతులలో ఓడిపోయింది. 1983లో 35.98% ఓట్లు పొందగా, 1985లో 31.30% మాత్రమే ఓట్లు సాధించింది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. "Chennur Constituency Election Results 2023: Chennur Assembly Seat Details, MLA Candidates & Winner". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2024-06-12.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-08-31. Retrieved 2009-03-04.
  4. ఈనాడు దినపత్రిక, ఆదిలాబాదు జిల్లా ఎడిషన్, తేది 21-02-2009.

బయటి లింకులు

[మార్చు]