ధర్మవరం రామకృష్ణమాచార్యులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ధర్మవరం రామకృష్ణమాచార్యులు
Dharmavaram Krishnamacharyaulu.JPG
ధర్మవరం రామకృష్ణమాచార్యులు
జన్మ నామం ధర్మవరం రామకృష్ణమాచార్యులు
జననం 1853
అనంతపురం జిల్లా ధర్మవరం
మరణం 1912, నవంబర్ 30
కర్నూలు జిల్లా ఆలూరు
ఇతర పేర్లు "ఆంధ్ర నాటక పితామహుడు"
ప్రాముఖ్యత సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు
వృత్తి వకీలు
తండ్రి కొమాండూరు కృష్ణమాచార్యులు
తల్లి లక్ష్మీదేవమ్మ


ధర్మవరం రామకృష్ణమాచార్యులు (Dharmavaram Ramakrishnamacharyulu) (1853 - 1912) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. ధర్మవరం గోపాలాచార్యులు ఇతని పెద్దతమ్ముడు.

విద్యాభ్యాసం[మార్చు]

తండ్రివద్దనే ఆంధ్ర, సంస్కృత,కన్నడ భాషలు నేర్చుకున్నాడు.1870లో మెట్రిక్యులేషన్ పాసయ్యాడు. తాతగారి వద్ద రఘువంశము, చంపూరామాయణము, ప్రతాపరుద్రీయము చదివాడు.1874లో ఎఫ్.ఏ. పరీక్షలోను,సెకండరీగ్రేడ్ ప్లీడర్‌షిప్ పరీక్షలోనూ ఉత్తీర్ణుడయ్యాడు.

ఉద్యోగం[మార్చు]

కొంతకాలం ఆదోని తాలూకా కచేరిలో గుమాస్తాగా పనిచేశాడు. తరువాత బళ్లారి కంటోన్మెంట్ మెజిస్ట్రీట్ కోర్టులో వకీలుగా ప్రాక్టీసు పెట్టాడు.

అభిరుచులు[మార్చు]

ఇతనికి సంగీతంలో, ఆయుర్వేదంలో, నాడీశాస్త్రంలో,జ్యోతిశ్శాస్త్రంలో,చదరంగంలో ప్రావీణ్యం ఉంది. కవితాశక్తిని అలవరచుకుని అష్టావధానాలు, శతావధానాలు చేశాడు.

రచనలు[మార్చు]

 • గాధినందను చరిత్రము (పద్యకావ్యము) (అసంపూర్ణము)
 • ఉన్మాదరాహు ప్రేక్షణికము
 • మదనవిలాసము
 • చిత్రనళీయము
 • పాదుకాపట్టాభిషేకము
 • భక్త ప్రహ్లాద
 • సావిత్రీ చిత్రాశ్వము
 • మోహినీరుక్మాంగద
 • విషాదసారంగధర
 • బృహన్నల
 • ప్రమీళార్జునీయము
 • పాంచాలీస్వయంవరము
 • చిరకారి
 • ముక్తావళి
 • రోషనారా శివాజీ
 • వరూధినీ నాటకము
 • అభిజ్ఞానమణిమంతము(చంద్రహాస)
 • ఉషాపరిణయము
 • సుశీలాజయపాలీయము
 • అజామిళ
 • యుధిష్ఠిర యౌవరాజ్యము
 • సీతాస్వయంవరము
 • ఘోషయాత్ర
 • రాజ్యాభిషేకము
 • సుగ్రీవపట్టాభిషేకము
 • విభీషణపట్టాభిషేకము
 • హరిశ్చంద్ర
 • గిరిజాకళ్యాణము
 • ఉదాస కళ్యాణము
 • ఉపేంద్ర విజయ (కన్నడ)
 • స్వప్నానిరుద్ధ (కన్నడ)
 • హరిశ్చంద్ర (ఇంగ్లీష్)

పై రచనలలో మొదటిది మినహా మిగిలినవన్నీ నాటకరచనలే.

నాటకరంగం[మార్చు]

1886లో బళ్లారిలో సరసవినోదిని అనే నాటకసభను నెలకొల్పాడు. మొదట స్వప్నానిరుద్ధ అనే కన్నడ నాటకాన్ని ప్రదర్శించాడు. 1887లో చిత్రనళీయము అనే తెలుగునాటకాన్ని బళ్లారి పట్టణంలో మొదటిసారిగా ప్రదర్శించాడు. ఇతడు నాటకకర్తనే కాదు. నటుడు, దర్శకుడు కూడా. ఇతనికి సంగీతంలో ప్రవేశం ఉంది. పాటలు, పద్యాలకు రాగాలు తనే నిర్ణయించేవాడు. మోహన, జంఝాటి, కేదారగౌళ, కమాజు రాగాలంటే ధర్మవరం రామకృష్ణమాచార్యులకు ప్రీతి. రంగస్థలం మీద రాగయుక్తంగా పద్యాలను పాడే ఒరవడి రామకృష్ణమాచార్యులు తెచ్చిపెట్టిందే. ఇతడు దశరథ, బాహుళ,రాజరాజనరేంద్రుడు,చిరకారి,అజామిళ పాత్రలు అభినయించుటలో దిట్ట.

సన్మానాలు[మార్చు]

 • 1891లో మధ్రాసులో సంస్కృత పండితుడు ఓపర్ట్ ఇతని నాటకాన్ని చూసి మెచ్చి రత్నఖచిత బంగారు పతకం బహూకరించాడు.
 • 1910లో గద్వాల మహారాజు ఇతడిని ఆంధ్రనాటకపితామహుడు అనే బిరుదుతో సత్కరించాడు.
 • బళ్లారి పురప్రముఖులు ఇతడిని రత్నఖచిత కిరీటంతో సన్మానించారు.

బయటి లింకులు[మార్చు]