బద్దం నరసింహారెడ్డి
బీ. ఎన్. రెడ్డి | |||
నియోజకవర్గం | మిర్యాలగూడ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నకిరేకల్, నల్లగొండ జిల్లా, తెలంగాణ | 1931 జూన్ 21||
మరణం | నవంబర్ 6, 2017 హైదరాబాద్, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
జీవిత భాగస్వామి | అలివేలు | ||
సంతానం | ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు | ||
మతం | హిందూ |
బద్దం నరసింహారెడ్డి (జూన్ 21, 1931 - నవంబర్ 6, 2017) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు. వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డిగా ప్రసిద్ధులు. భారత జాతీయ కాంగ్రెసు తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1989, 1996, 1998లలో ఎన్నికయ్యారు.
జననం - చదువు
[మార్చు]ఈయన నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ గ్రామంలో 1931, జూన్ 21న జన్మించారు. ఈయన తండ్రి పేరు రామచంద్రారెడ్డి.[1] ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఈ, కొలరాడో విశ్వవిద్యాలయం (యు.ఎస్.ఏ) లో ఎం.ఎస్ చేశారు.
వివాహం
[మార్చు]1949 డిసెంబరులో అలివేలుతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు.
ప్రవృత్తి
[మార్చు]వాస్తుశిల్పి, వాస్తు సలహాదారు, కవి
పదవులు
[మార్చు]- 1989లో 9వ లోక్‌సభ, 1996 లో 11వ లోక్‌సభ, 1998లో 12వ లోక్‌సభ లకు మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు.
- 1990-91,1997-98లలో సభ్యులు, సంప్రదింపుల కమిటీ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
- 1998లో సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (C.P.P.)
- 1998-99లో సభ్యులు, వాణిజ్య కమిటీ, సలహా కార్యవర్గ సమితి, మంత్రిత్వ శాఖ అధికారము
రచనలు
[మార్చు]తెలంగాణ అంశంపై అనేక వ్యాసాలు రాశారు.
- సామాన్యుని సందేశం, బి.ఎన్. భస్టితలు, బి.ఎన్. భావ తరంగిణి (తెలుగు)
- ‘Dews of the Dawn’, 'A Glimpse of Practical Vastu' (అంగ్లం),
- Mangalmaya Vastu Vigyan (Hindi)
అవార్డులు
[మార్చు]- ఉత్తమ రచన (1976) పెళ్ళి కాని పెళ్ళి (సినిమా)
- రాజీవ్ గాంధీ బంగారు పతకం (1992)
- రాజీవ్ గాంధీ అవార్డు (1995)
- ఉద్యోగ్ రత్న అవార్డు (1995)
- పద్మభూషణ్ డా. కె.ఎల్.రావు బంగారు పతకం (1996) యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్.
సందర్శన
[మార్చు]ఫ్రాన్స్, హాంకాంగ్, జపాన్, రష్యా, సింగపూర్, యు.కె., యు.ఎస్.ఏ.
ఇతర వివరాలు
[మార్చు]- సభ్యులు Academic Senate, Osmania University, Hyderabad;
- సభ్యులు Senate, Dr. M.G.R. Medical University, Chennai, Tamil Nadu;
- వైస్ ఛైర్మన్, చైతన్య భారతి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్
ఓట్ల వివరాలు
[మార్చు]మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు
మొత్తం ఓట్లు - 12,26,612
పోలైన ఓట్లు - 8,67,685
మొదటి నలుగురికి పోలైన ఓట్లు
- డా. బద్దం నరసింహారెడ్డి (భారత జాతీయ కాంగ్రెసు) 3,34,183
- చెరుపల్లి సీతారాములు (భారతీయ కమ్యూనిస్టు పార్టీ) 3,19,685
- జుట్టుకొండ సత్యనారాయణ (భారతీయ జనతా పార్టీ) 99,566
- రామచందర్ నాయక్ ఇస్లావత్ (స్వతంత్ర అభ్యర్థి) 70,608
మరణం
[మార్చు]గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న నరసింహారెడ్డి జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2017, నవంబర్ 6న మరణించారు.[2][3]
వనరులు
[మార్చు]- ↑ "లోక్‌సభ జాలగూడు". Archived from the original on 2014-05-04. Retrieved 2014-01-24.
- ↑ నమస్తే తెలంగాణ (6 November 2017). "మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి కన్నుమూత". Retrieved 6 November 2017.[permanent dead link]
- ↑ ఆంధ్రజ్యోతి (6 November 2017). "మాజీ ఎంపీ కన్నుమూత". Archived from the original on 7 నవంబరు 2017. Retrieved 6 November 2017.