బద్దం నరసింహారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీ. ఎన్‌. రెడ్డి

నియోజకవర్గం మిర్యాలగూడ

వ్యక్తిగత వివరాలు

జననం (1931-06-21)1931 జూన్ 21
నకిరేకల్, నల్లగొండ జిల్లా, తెలంగాణ
మరణం నవంబర్ 6, 2017
హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి అలివేలు
సంతానం ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు
మతం హిందూ

బద్దం నరసింహారెడ్డి (జూన్ 21, 1931 - నవంబర్ 6, 2017) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు. వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డిగా ప్రసిద్ధులు. భారత జాతీయ కాంగ్రెసు తరపున మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1989, 1996, 1998లలో ఎన్నికయ్యారు.

జననం - చదువు[మార్చు]

ఈయన నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ గ్రామంలో 1931, జూన్ 21న జన్మించారు. ఈయన తండ్రి పేరు రామచంద్రారెడ్డి.[1] ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఈ, కొలరాడో విశ్వవిద్యాలయం (యు.ఎస్.ఏ) లో ఎం.ఎస్ చేశారు.

వివాహం[మార్చు]

1949 డిసెంబరులో అలివేలుతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు.

ప్రవృత్తి[మార్చు]

వాస్తుశిల్పి, వాస్తు సలహాదారు, కవి

పదవులు[మార్చు]

  • 1989లో 9వ లోక్‌సభ, 1996 లో 11వ లోక్‌సభ, 1998లో 12వ లోక్‌సభ లకు మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు.
  • 1990-91,1997-98లలో సభ్యులు, సంప్రదింపుల కమిటీ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
  • 1998లో సభ్యులు, కార్యనిర్వాహక కమిటీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (C.P.P.)
  • 1998-99లో సభ్యులు, వాణిజ్య కమిటీ, సలహా కార్యవర్గ సమితి, మంత్రిత్వ శాఖ అధికారము

రచనలు[మార్చు]

తెలంగాణ అంశంపై అనేక వ్యాసాలు రాశారు.

  • సామాన్యుని సందేశం, బి.ఎన్. భస్టితలు, బి.ఎన్. భావ తరంగిణి (తెలుగు)
  • ‘Dews of the Dawn’, 'A Glimpse of Practical Vastu' (అంగ్లం),
  • Mangalmaya Vastu Vigyan (Hindi)

అవార్డులు[మార్చు]

  • ఉత్తమ రచన (1976) పెళ్ళి కాని పెళ్ళి (సినిమా)
  • రాజీవ్ గాంధీ బంగారు పతకం (1992)
  • రాజీవ్ గాంధీ అవార్డు (1995)
  • ఉద్యోగ్ రత్న అవార్డు (1995)
  • పద్మభూషణ్ డా. కె.ఎల్.రావు బంగారు పతకం (1996) యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్.

సందర్శన[మార్చు]

ఫ్రాన్స్, హాంకాంగ్, జపాన్, రష్యా, సింగపూర్, యు.కె., యు.ఎస్.ఏ.

ఇతర వివరాలు[మార్చు]

  • సభ్యులు Academic Senate, Osmania University, Hyderabad;
  • సభ్యులు Senate, Dr. M.G.R. Medical University, Chennai, Tamil Nadu;
  • వైస్ ఛైర్మన్, చైతన్య భారతి ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్

ఓట్ల వివరాలు[మార్చు]

మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల ఫలితాలు

మొత్తం ఓట్లు - 12,26,612
పోలైన ఓట్లు - 8,67,685

మొదటి నలుగురికి పోలైన ఓట్లు

  1. డా. బద్దం నరసింహారెడ్డి (భారత జాతీయ కాంగ్రెసు) 3,34,183
  2. చెరుపల్లి సీతారాములు (భారతీయ కమ్యూనిస్టు పార్టీ) 3,19,685
  3. జుట్టుకొండ సత్యనారాయణ (భారతీయ జనతా పార్టీ) 99,566
  4. రామచందర్ నాయక్ ఇస్లావత్ (స్వతంత్ర అభ్యర్థి) 70,608

మరణం[మార్చు]

గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న నరసింహారెడ్డి జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2017, నవంబర్ 6న మరణించారు.[2][3]

వనరులు[మార్చు]

  1. "లోక్‌సభ జాలగూడు". Archived from the original on 2014-05-04. Retrieved 2014-01-24.
  2. నమస్తే తెలంగాణ (6 November 2017). "మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి కన్నుమూత". Retrieved 6 November 2017.[permanent dead link]
  3. ఆంధ్రజ్యోతి (6 November 2017). "మాజీ ఎంపీ కన్నుమూత". Archived from the original on 7 నవంబరు 2017. Retrieved 6 November 2017.