బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం
బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం (అరబ్బీ بسم الله الرحمن الرحيم ), అరబ్బీ భాష పదజాలం, దీని అర్థం : అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను, అతను కృపాశీలుడు, కరుణామయుడు. ఈ బిస్మిల్లాహ్ తోనే ఖురాన్ ప్రారంభమౌతుంది.
వ్యాసాల పరంపర |
అల్లాహ్ |
---|
ఖురాన్, బిస్మిల్లా
[మార్చు]ఖురాన్ "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం" అనే వచనంతోనే ప్రారంభమవుతుంది. ఖురాన్ లోని అన్ని సూరాలు (అధ్యాయాలు) బిస్మిల్లా తోనే ప్రారంభమౌతాయి (ఒక అధ్యాయం "సూరా తౌబా" మినహాయించి).
సంఖ్యా శాస్త్రం
[మార్చు]అరబ్బీ భాష లోని అక్షరాలకు (అబ్‌జద్) సంఖ్యలు ఇవ్వబడ్డాయి. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం, అనే వాక్యంలో గల అక్షరాల సంఖ్యలను కూడితే '786' అనే సంఖ్య వస్తుంది. అందుకే ముస్లింలు తరచూ ఈ 786 అనే సంఖ్యను వాడుతూ ఉంటారు. కాని దీనికి ఎలాంటి అందరం ఖుర్ఆన్, హదీసులో లేదు.
ఆచారాలలో బిస్మిల్లా
[మార్చు]బిస్మిల్లా ఖ్వాని
[మార్చు]ముస్లిం ఆచారాలలో బిస్మిల్లా ఖ్వాని ఒకటి. పిల్లలు విద్యాభ్యాస వయస్సుకు చేరుకున్నప్పుడు, విద్యాభ్యాసం "బిస్మిల్లా ఖ్వానీ"తో ప్రారంభం ఔతుంది. అనగా, విద్యాభ్యాసం బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీంతో ప్రారంభిస్తారు.
కార్యక్రమాలు - బిస్మిల్లా
[మార్చు]ముస్లింలు ఏ కార్యక్రమమైనా ప్రారంభించేటపుడు "బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం" తోనే ప్రారంభిస్తారు. భోజనం మొదలు పెట్టేటపుడు కూడా బిస్మిల్లా చదువుతారు.
ఇవీ చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Saying Bismillah - Virtues and Ocassions - Collection of Sayings from Authentic Hadiths
- Bismallah as in Tadabbur-i-Qur'an
- Meaning of Bismillah